హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur News: ఒకప్పుడు తుపాకుల మోత.. ఇప్పుడు సిరుల పంట..! మార్పు ఇంత అద్భుతంగా ఉంటుందా..!

Guntur News: ఒకప్పుడు తుపాకుల మోత.. ఇప్పుడు సిరుల పంట..! మార్పు ఇంత అద్భుతంగా ఉంటుందా..!

బొల్లాపల్లి మండలంలో సిరులు పండిస్తున్న రైతులు

బొల్లాపల్లి మండలంలో సిరులు పండిస్తున్న రైతులు

Guntur District: పోయిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. నవ్విన నాపచేనే పండుతుందన్న సామెతను కూడా చెబుతారు. అలాంటి మాటలే అక్కడ నిజమయ్యాయి. ఒకప్పుడు మనుషులు తిరగడానేకి భయపడిన ప్రాంతం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

పోయిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. నవ్విన నాపచేనే పండుతుందన్న సామెతను కూడా చెబుతారు. అలాంటి మాటలే అక్కడ నిజమయ్యాయి. ఒకప్పుడు మనుషులు తిరగడానేకి భయపడిన ప్రాంతం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మారుమూల మండలం బొల్లాపల్లి. బొల్లాపల్లి మండలం ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతం కావటంతో ఇక్కడున్న ప్రభత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, బ్యాంకులు దగ్గరలో ఉన్న వినుకొండకు మార్చారు. దీంతో అక్కడ అభివృద్ధి శున్యంగా మారింది. వెనుకబడిన మండలంగా ప్రభుత్వం గుర్తింపు, దీనికి తోడు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతం కావటంతో వ్యవసాయం కూడా కష్టమైపోయింది. వర్షాలు కురిస్తేనే అక్కడ మొక్కమొలిచేది.. పంటపండేది.

దీంతో అక్కడ సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, కంది, వంటి పంటలు వేసేవారు కానీ ఆశించిన ఆర్ధిక ప్రయోజనం ఉండేది కాదు. వ్యవసాయంతో అప్పుల పాలవడం, మరోవైపు నక్సల్ ప్రభావంతో గ్రామాలలోని ప్రజలు దగ్గరలోని నగరాలకు వలస వెళ్లి అక్కడ పనులు చేసుకొని జీవనం సాగించేవారు.

ఇది చదవండి: ఒకరు ఊసరవెల్లి, ఒకరు ల్యాండ్ మైన్.. చిరు, పవన్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్


కాలం మారింది. కొత్త తరం వచ్చింది. పరిస్థితులు మారాయి, ప్రజల ఆలోచన ధృక్పథంలో మార్పొచ్చింది. నక్సల్స్ ప్రభావం తగ్గటం చదువుకొని ఉద్యోగాలు చేసే యువత పెరగటంతో మండలంలోని పరిస్థితిలు పూర్తిగా మారాయి. గ్రామాలను వదిలివెళ్లిన వారు మళ్లీ పల్లెల బాటపట్టారు. యువకులు చదువుకొని అన్ని విషయాలపై పట్టుసాధించారు. వ్యవసాయం, సాగునీటి సరఫరాలో కొత్త పద్ధతులు వంటబట్టించుకున్నారు. ఇంకేముంది ఒకప్పుడు ఎందుకు పనికిరావని వదిలేయడంతో బీడుబారిన భూముల్లో ఇప్పుడు సిరులు పండిస్తున్నారు. ఒకప్పటి బొల్లాపల్లికి.. ఇప్పటి బొల్లాపల్లికి పోల్చుకోలేనంత మార్పు వచ్చింది.

ఇది చదవండి: 48 గంటల టైమ్ ఇస్తున్నా..! వరద సాయంపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు


అది బొల్లాపల్లి మండలంలోని ఒక గ్రామం ఆ గ్రామానికి చెందిన మధు. ఇతను దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐఐఎం అహ్మదాబాద్ లో చదువుకున్నాడు. లక్షలు జీతం ఇచ్చే ఉద్యోగం వచ్చినా.. దాన్ని వదిలేసి స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తూ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక ఎకరం పొలంలో పాలీ హౌస్ ను నిర్మించి దానిలో హైబ్రిడ్ బొకే లకు ఉపయోగించే గులాబీలను పండిస్తూ కార్పొరేట్ కంపెనీ జీతాన్ని కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఉద్యాన వాన శాఖ సూచనలతో పాటు ఇంటర్నెట్లో దొరికిన సమాచారంతో ఎకరం పొలంతోనే ఊహించని ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.


ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?

సరికొండపాలెం గ్రామానికి చెందిన రమణయ్య షెడ్ నెట్ లను ఏర్పరుచుకొని మూడు నెలలు మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలకు నారుపెంచి రైతులకు సరఫరా చేస్తున్నాడు. అంతేకాదు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, క్యాపసికం వంటి లాభదాయకమైన కూరగాయలను పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో తన పొలంలో ఉన్న బోరు బావిలో ఎకరానికి సరపడా నీరు కూడా ఉండేది కాదని.. ఇప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా అదే నీటిని ఐదెకరాలకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నాడు.

ఇది చదవండి: ఏపీలో రోడ్లపై పేలుతున్న జోక్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ వరద


బొల్లాపల్లి గ్రామంలో సుమారు అరవై ఎకరాలలో దానిమ్మ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ ఎర్రచందనం, శ్రీ గంధం, నిమ్మ, బత్తాయి వంటి పంటలు పండిస్తున్నాడు కృష్ణారెడ్డి అనే రైతు. తనకున్న నీటిలభ్యతను దృష్టి లో ఉంచుకొని పొలంలో పెద్ద నీటి గుంతను తవ్వించుకొని దాని ద్వారా ఆధునిక నీటి నిర్వహణ పద్ధతులను ఉపయోగించుకుకొని అరవై ఎకరాల్లో పంట పండిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నాడు. అలానే మిగతా గ్రామాల్లో కూడా నిమ్మ దానిమ్మ జామ బొప్పాయి వంటి పండ్ల రకాలు కూరగాయలు, పూలు పండిస్తూ ఒకప్పటి బీడు భూములను బంగారు భూములుగా మార్చారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు