హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మండాలా ఆర్ట్ అంటే ఏమిటి.. అలాంటి కళ ఒకటుందని మీకు తెలుసా..?

మండాలా ఆర్ట్ అంటే ఏమిటి.. అలాంటి కళ ఒకటుందని మీకు తెలుసా..?

మండలా కళ గురించి మీకు తెలుసా..?

మండలా కళ గురించి మీకు తెలుసా..?

మన సంస్కృతిలో 64 కళలున్నాయి. వాటిలో దేనకదే ప్రత్యేకమైనది. కొన్ని కళలకు (Arts) నేర్చుకోవాలన్నా, వాటి గురించి తెలుసున్న చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఈ కళ. 64 క‌ళ‌ల‌లో ఒక‌టైన చిత్ర‌క‌ళ‌ లో భాగ‌మైన అత్యంత శ్ర‌మ‌తో కూడుకున్నది "మండాలా ఆర్ట్" (Mandala Art).

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Gangadhar, News18, Guntur

మన సంస్కృతిలో 64 కళలున్నాయి. వాటిలో దేనకదే ప్రత్యేకమైనది. కొన్ని కళలకు (Arts) నేర్చుకోవాలన్నా, వాటి గురించి తెలుసున్న చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఈ కళ. 64 క‌ళ‌ల‌లో ఒక‌టైన చిత్ర‌క‌ళ‌ లో భాగ‌మైన అత్యంత శ్ర‌మ‌తో కూడుకున్నది "మండాలా ఆర్ట్" (Mandala Art). ఈ ఆర్ట్ నేర్చుకోవటం అంత సుల‌భం కాదు. అంకుఠిత దీక్ష, పట్టు దలతో పాటు శ్ర‌మ‌ తోడైతేనే ఇది సాధ్యం. హిందూ, బౌద్ధ మతాల ప్రాచీన సంస్కృత భాషలో మండల అంటే "వృత్తం" అని అర్థం. సాంప్రదాయకంగా, మండల అనేది ఒక రేఖా గణిత రూపకల్పన. చక్కని వృత్తాలు ఒకదాని వెంట ఒకటి వెళుతూ చూపరులనునే ఆకట్టుకునే లా చిత్రాలు గీయడం మండల కళ ప్రత్యేకత.

యోగ, మెడిటేషన్, ధ్యానం వంటివి సాధన చేసే సమయంలో మండల కళ ద్వారా గీసిన చిత్రాలను ప్రత్యేకంగా వినియోగిస్తారు. మానసిక వికాసానికి కూడా మండల చిత్రాలు దోహద పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతటి కష్ట సాధ్యమైన విద్యని అలవోకగా నేర్చుకుని ఎన్నో అధ్భుతమైన కళాఖండాలు సృష్టించింది చేతన అనే మహిళ. అంతే కాకుండా తాను నేర్చుకున్న మండలా కళను ప్ర‌స్తుతం ఆమె ఉపాధిగా మార్చుకుని తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది. ఆమె ఎన్నో పుర‌స్కారాలు, ప్ర‌శంస‌లు అందుకున్నారు.

ఇది చదవండి: వేసవిలో ఇంతకంటే బెస్ట్ ఐటమ్ ఉండదు..

చేతన అబాక‌స్‌, వేదిక్ మ్యాథ్స్ లో ట్రైనర్ గా పనిచేస్తారు. ఖాళీ స‌మ‌యాల్లో స‌ర‌దాగా ఇంట్లో గోడ‌ల మీద గీస్తున్న గీత‌ల‌ను చూసి ఆమె అన్న‌య్య చేతన క‌ళ‌ల్లో రాణిస్తుంద‌న్న న‌మ్మ‌కం, ప్ర‌గాఢ విశ్వాంసంతో ఆమెను క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ల్లో శిక్ష‌ణ‌ కు పంపించారు. అక్క‌డ రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్ష‌ణ‌లో భాగంగా చిత్ర‌క‌ళ‌తో పాటు "మండల ఆర్ట్స్‌"లో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌డంతో అందులో నాకు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌డంతో పాటు ఇన్‌స్టాగ్రాంలోనూ కొన్ని మెళుకువ‌లు నేర్చుకున్నాను. శిక్ష‌ణ అనంత‌రం "సేవ్ స్పారో" ఆర్ట్ ఈవెంట్ లో క్రియేటివ్ వర్క్ షాప్ లో పాల్గొని వందల సంఖ్యలో విద్యార్థులకు ఈ మండలా ఆర్ట్ పట్ల ఉచితంగా అవగాహన కల్పించారు.

ఇటీవల నిర్వ‌హించిన "సలాం ఇండియా ఆర్ట్ ఈవెంట్" లో క్రియేటివ్ టీమ్ విభాగంలోని ప్రదర్శనలో చేతన చిత్రాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌ి చాయి.కొంద‌రు ఈ చిత్రాలు కొనుగోలు చేశారు.అదే విధంగా మ‌రికొంద‌రు త‌మ చిన్నారుల‌కు "మండాలా ఆర్ట్స్"లో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వాల‌ని కోర‌డం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. మ‌రింత మంది ఈ రంగంలో రాణించాల‌న్న లక్ష్యంతో కొంత మంది విద్యార్థుల‌కు మండాలా ఆర్ట్ లో శిక్ష‌ణ ఇస్తున్నారు.పలు పోటీల్లో బహుమతులు సాధించటంతో పాటు కొన్ని పుర‌స్కారాలు, సన్మానాలు కూడా చేతన పొందగలిగారు.

First published:

Tags: Andhra Pradesh, Fine arts, Guntur, Local News

ఉత్తమ కథలు