Home /News /andhra-pradesh /

GUNTUR THERE IS 32 VERITIES OF FOREIGN MIGRANT BIRDS TO UPPALAPADU IN GUNTUR DISTRICT NGS GSU NJ

Bird Sanctuary: ఉప్పలపాడుకు విదేశీ అతిథుల వలస.. ఎన్నో రకాల పక్షులను ఒకే దగ్గర చూసే ఛాన్స్..

ఉప్పలపాడుకు

ఉప్పలపాడుకు విదేశీ పక్షులు

Bird Sanctuary: వేల కిలోమీటర్ల ప్రయాణం.. కొన్ని వందల గంటల సమయం వెచ్చించి విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అది కూడా సప్త సముద్రాలు దాటి ఇక్కడకు విదేశీ అతిథులు రావడానికి కారణం ఏంటి? ఇక్కడ వాటిని అంతగా ఆకర్షిస్తోంది ఏంటి?

   Sumanth, News18, Guntur.

  Bird Sanctuary: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ని అదో పక్షుల విహార క్షేత్రంగా మారుతోంది. గుంటూరు జిల్లా (Guntur District) పెదకాకాని మండలం (Pedakakani Mandal) ఉప్పలపాడు (Uppalapadu) ఇప్పుడు వాటికి ఎంతో ప్రసిద్ధి చెందింది.. 50 ఏళ్లుగా విదేశీ అతిథులు వస్తున్నారు. విదేశీ అతిథులు ఏంటి అనుకుంటున్నారా..? ఉప్పలపాడులోని పక్షుల సంరక్షణా కేంద్రానికి.. గత 50 ఏళ్లు గా విదేశాలనుండి పక్షులు సంతానోత్పత్తి కోసం వలసలు వస్తున్నాయి. మొదట్లో గ్రామస్థులు కొద్దిగా ఇబ్బందిగా భావించినా వాటిని గ్రామస్థులు ప్రేమతో ఆహ్వానించి వాటిని సంరక్షించడం ప్రారంభించారు. గుడ్లు పెట్టదానికి అనువైన వాతావరణం, పుష్కలమైన ఆహారం, నీరు, దగ్గరలో సముద్రం, అనువైన వాతావరణం ఉండటంతో.. పక్షులు.. వందల సంఖ్యలో ఖండాలు దాటి ఇక్కడికి వలస వస్తున్నాయి.  చైనా, నేపాల్, హిమాలయాలను పెలికాన్స్, నైజీరియా నుండి పెయింటెడ్ స్స్టర్క్స్, శ్రీలంక ,ఆఫ్రికాల నుంచి ఓపెన్ బీల్ స్టర్క్స్, సౌతాఫ్రికా నుండి వైట్ ఐబీస్..ఇలా మొత్తం 32 అరుదైన జాతుల పక్షులు.. ఏడాది పొడుగునా వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తుంటాయి.

  ఇక్కడ రకరకాలైన కొంగలను కూడా గమనించవచ్చు. ఇక్కడికి సైబేరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలనుంచి పక్షులు వలస వచ్చి స్థానికంగా ఉండే చెరువులకు సమీపంలో చెట్లపైన గూళ్ళు కట్టుకుంటాయి. ఈ ప్రాంతాన్ని 2002లో అటవీశాఖ స్వాధీనం (handover) చేసుకొని.. అభివృద్ధి చేసి.. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గా తీర్చిదిద్దింది. ఈ సరస్సు చుట్టూ.. ట్రాక్ నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉంది.

  ఇదీ చదవండి : గుండెపోటుతో సాధువు మృతి.. అయ్యో పాపం అనాథ అంటూ చూసేందుకు వెళ్లిన వారికి షాక్.. ఏమైందంటే..?

  రైతులకు మేలు చేసే రోజీ పాస్టర్స్‌
  శీతాకాలం మధ్యలో ఇక్కడకు వేల సంఖ్యలో వచ్చే రోజీ పాస్టర్స్ మిడతల దండును స్వాహా చేసి రైతులకు మేలు చేస్తున్నాయి. పర్యావరణవేత్తల అంచనా ప్రకారం.. ఈ పక్షులన్నిటికి కాపాలాగా ఉండే మరో పక్షే డాక్టర్ స్నేక్. వేలాదిగా వస్తున్న పక్షుల కోసం గ్రామంలోని మంచినీటి చెరువును 10 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా వదిలేశారు. చెరువు మధ్యనున్న తుమ్మచెట్లు, మట్టి దిబ్బలు పక్షులకు ఆవాసంగా మారాయి.జీవశాస్త్ర నిపుణుల లెక్క ప్రకారం వేల కిలోమీటర్ల ప్రయాణానికి ముందు ప్రాంత అంచనా కోసం కొన్ని పక్షులు ముందుగా పరిశీలించి వెళ్ళిన తర్వాతే సమూహంగా రావడానికి ప్రయాణామవుతాయి. కొన్ని నెలలపాటు ఉండడానికి సిద్ధపడే ఇక్కడకు వస్తాయి, వచ్చి గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి ఎగరడం నేర్పాకే తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తాయి.

  ఇదీ చదవండి : అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే?

  అక్టోబరు నుండి మార్చి వరకూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ రకాల పక్షులు వస్తాయి. అక్టోబరు నెలలో సాధారణంగా ఉప్పలపాడులో సుమారు 15 వేల పక్షులు ఉంటాయని అంచనా. ఒకప్పుడు ప్రతియేటా 12000 దాకా పక్షులు వచ్చి చేరేవి. కానీ ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా కేవలం 7000 పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇక్కడ చెట్లను కృత్రిమంగా పెంచడం, చెరువులు తవ్వించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

  ఇదీ చదవండి : ప్రాణానికి ప్రాణం.. రక్తానికి రక్తం.. ఇది ఆర్జీవీ సినిమా కాదు.. పెద్ద మనుషుల తీర్పుకు మానసిక వికలాంగుడి బలి..?

  నెల్లూరు నేలపట్టుకు ఒకప్పుడు వెళ్ళే పక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరి కొల్లేటి సరస్సుకు వెళ్ళే పక్షులు ఈ రోజు  ఉప్పలపాడూకు రావడం మిగిలిన ప్రాంతాలలో అనుకూల, పర్యవరణ పరిస్థితులు క్షీణించడమే కారణం. ఈ ఉప్పలపాడూలో ఉన్న చెరువులు, చెట్లు, పక్షులకు కావల్సిన ఆహారం దొరకటంతో పక్షులు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కావడం పక్షుల కిల కిల రావాలతో రమణీయంగా ఉన్న ఈ కేంద్రం సందర్శకులను ఆకర్షిస్తుంది.

  ఇదీ చదవండి : జ‌గ‌న్ ముగించిన చోటు నుంచే లోకేష్ స్టార్ట్? అక్టోబ‌ర్ 2 నుంచి లోకేష్ పాద‌యాత్ర‌? రోడ్ మ్యాప్ ఇదే

  ప్రవేశ రుసుము.. సమయం
  ఈ కేంద్రం చూడటానికి రూ.50 ప్రవేశ రుసుము చెల్లించి లోపలికి వెళ్లాలి. వీకెండ్స్‌లో ఇక్కడకు ఫ్యామిలీలు, యువత పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకే ఉంటుంది.

  ఇదీ చదవండి : రోబోలే ఆహ్వానిస్తాయి.. సర్వ్‌ చేస్తాయ్‌.. సరికొత్త ఫీల్ కలిగించే ఆ రెస్టారెంట్‌ ఎక్కడంటే..?

  bird sanctury

  ఎలా వెళ్లాలి? 
  ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి చేరుకోవటానికి ..గుంటూరు నుంచి బస్సు సదుపాయం కలదు. గుంటూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్లడానికి రోడ్డు మార్గం తప్ప రైలు సౌకర్యం లేదు. విమానం ద్వారా రావాలనుకొనేవారు విజయవాడ దగ్గర గన్నవరం వరకు వచ్చి 52 కిలోమీటర్ల దూరం వేరే వాహణంలో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. రైలు సౌకర్యమైతే గుంటూరు వరకూ ఉంది. అక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Gunturu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు