Home /News /andhra-pradesh /

GUNTUR THE TRADITION OF WORSHIPPING WEAPONS AS GODESS IN PALNADU GSU NJ ABH

Guntur: రోమ్‌ తర్వాత మన పల్నాడులోనే ఆ సాంప్రదాయం..! ప్రపంచంలో మరెక్కడా లేదు... ఇంతకీ ఏంటంటే అది..!

ప్రపంచంలో

ప్రపంచంలో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి రెండే రెండు చోట్ల ఉంది. ఒకటి రోమ్ అయితే మరొకటి మన పల్నాడులో. పల్నాటి యుద్ధంలో అశువులు బాసిన వారి ఆయుధాలకు నేటికి పూజలు నిర్వహిస్తుంటారు. అదే వీర్ల దేవాలయం.

ప్రపంచంలో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి రెండే రెండు చోట్ల ఉంది. ఒకటి రోమ్ అయితే మరొకటి మన పల్నాడులో. పల్నాటి యుద్ధంలో అశువులు బాసిన వారి ఆయుధాలకు నేటికి పూజలు నిర్వహిస్తుంటారు. అదే వీర్ల దేవాలయం.

  (Sumanth Jangam, News 18, Guntur)

  ప్రపంచంలో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి రెండే రెండు చోట్ల ఉంది. ఒకటి రోమ్ అయితే మరొకటి మన పల్నాడులో. ఇక్కడ ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు వీరాధనోత్సవాలను నిర్వహిస్తారు. చరిత్రలో మాచర్ల, గురజాల రాజ్యాల మధ్య జరిగిన యుద్దం మహాభారత కథను పోలి ఉంటుంది.

  వీర్ల గుడి చరిత్ర:
  11వ శతాబ్ధంలో పలనాటి బ్రహ్మానాయుడు, నాగమ్మ ఆయా రాజ్యాల మంత్రులుగా యుద్దం రంగంలో పోటాపోటీగా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం ముగిసిన తరువాత ఆశయసిద్ధి కోసం యుధ్దంలో మరణించిన వీరనాయుకులకు గుర్తుగా.. 66 వీరకల్లును ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు బ్రహ్మనాయుడు. వీరాచారపీఠం స్థాపించి, దానికి పిడుగు వంశం వారిని పీఠాధిపతిగా నియమించారు. ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి అదే వీర్లదేవాలయం.

  ఈ ఆలయం పల్నాడు జిల్లాలోని కారంపూడిలో నాగులేరు ఒడ్డున నెలకొంది. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి.. వారు ఉపయోగించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరుపుతారు. ఈ సాంప్రదాయం ప్రపంచంలో రోమ్‌ తర్వాత పల్నాడులోని వీరులగుడిలోనే జరుగుతుంది.

  వీరారాధనోత్సవాలు..!
  పల్నాటి యుద్ధ కథను తెలియజేస్తూ ప్రతిఏటా పల్నాటి యుద్దం జరిగిన కారంపూడి వీరుల గుడిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మనాయుడు వినియోగించిన ఆయుధంతో పాటు.. అతని అనుచరులు వాడిన ఆయుధాలను ఈ ఉత్సవాల్లో భాగంగా పూజిస్తారు. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు రాచగావు, రెండు రోజు రాయభారం, మూడు రోజు మందపోరు, నాలుగు రోజు కోడిపోరు, ఐదో రోజు కళ్ళిపాడు నిర్వహిస్తారు.

  మొదటిరోజు - రాచగావు:
  రాజు ఇచ్చే బలినే రాచగావు అంటార. నోటితో కొరికి మేకపోతును చంపుతారు. పోతురాజుకు ఈ బలిని ఇవ్వటం ద్వారానే పల్నాడు వీరారాధనోత్సవాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు ( ఆయుధాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయానికి చేరుకుంటారు.

  రెండో రోజు- రాయబారం:
  రాయబారానికి వచ్చి ఆనాడు హత్యకు గురైన రాజు ఉదంతాన్నివీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు ఉద్వేగభరితంగా కత్తిసేవ చేస్తుంటారు.

  మూడో రోజు -మందపోరు:
  కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలి దేవాదుల వద్ద ఉండే ఆవులను…అంతంచేయాలని నాగమ్మ పన్నాగం పన్నుతుంది. అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇచ్చి విముక్తిని ప్రసాదించాడని చెబుతారు.

  నాలుగో రోజు – కోడిపోరు:
  ఉత్సవాల్లో భాగంగా కోడి పోరు రోజున మాచర్ల, గురజాల నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు హాజరై కోడి పందెం నిర్వహిస్తారు. ఆ కాలంలోనే కులమతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు ఆచరించిన సహపంక్తి భోజనాలు ఇప్పటికీ నిర్వహిస్తుంటారు.

  ఐదోరోజు- కల్లిపాడు:
  పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు ఒరుగుతాయి. దేవుళ్లు(ఆయుధాలు) ఒరిగిన మండల కోసం ప్రజలు ఎగబడతారు. అంతటితో వీరారాధనోత్సవాలు ముగిసిపోతాయి.

  పల్నాడు పీఠాన్ని స్వయంగా బ్రహ్మనాయుడే స్థాపించి ఆ బాధ్యతను పిడుగు వంశం వారికే అప్పచెప్పినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ పిడుగు వంశం వారే పీఠాధిపతులుగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.
  తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఉత్సవాలు చూసేందుకు వస్తుంటారు. నాగులేరులో స్నానమాడి వీర్ల గుడిలో చెన్నకేశవ స్వామి గుడి, అంకాళమ్మ గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. ఈ వీరారాధనోత్సవాల్లో పాల్గొని పూజలు చేస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.  అడ్రస్: కారంపూడి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 522614.

  ఎలా వెళ్ళాలి: పిడుగురాళ్ళ నుండి 17 కి. మీ. దూరంలో ఈ కారంపూడి ఉంటుంది. గుంటూరు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్లే బస్సు ద్వారా కారంపూడి గ్రామానికి వెళ్లొచ్చు. రైలుమార్గం ద్వారా అయితే పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి బస్సు, ఆటోలో చేరుకోవచ్చు.
  First published:

  Tags: Andhrapradesh, Guntur, Local News, Palnadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు