Jr NTR: పాన్ ఇండియా స్టార్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో నిలుస్తూనే ఉన్నారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతున్నా..? రాజకీయాలు (Politics) అతడిని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఆయన పేరు ప్రస్తావన వస్తూనే ఉంది. తాజాగా అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati Farmers Padayatra)లోనూ తారక్ పేరు తెరపైకి వచ్చింది. అక్కడక్కడా ఉద్రిక్తతల మధ్య అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో కొనసాగుతోంది. మరోవైపు మూడు రాజధానులకు అనుకూలంగా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కడం.. బైక్ ర్యాలీలను నిర్వహిస్తోన్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరి మద్దతు తమకు అవసరం అని అమరావతి రైతులు కోరుకుతున్నారు. తమతో కలిసి రానివారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వచ్చింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) అరసవల్లికి పాదయాత్రగా తరలి వెళ్తోన్న అమరావతి ప్రాంత రైతులు.. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. వ్యక్తిగత దాడికీ దిగారు.
టీడీపీ అభిమానులు అయిన కొందరు రైతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌పై సవాళ్లు విసిరారు. తాను ఎన్టీఆర్ మనవడినని జూనియన్ చెప్పుకొంటోన్నాడని, కానీ ఆ అర్హత ఆయనకు లేదని ఆరోపించారు. ఎన్టీ రామారావు మనవడిగా చెప్పుకోవద్దంటూ హెచ్చరించారు. జూనియర్ నిజంగా ఎన్టీఆర్ మనవడే అయితే ఎన్టీఆర్ పేరు మార్పు.. అమరావతిపై కుట్రలు ఇతర అంశాలపై స్పందించాలాని డిమాండ్ చేశారు.
Jr NTR in Amaravati Padayatra || జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరిన అమరావ... https://t.co/ea2guDVaMw via @YouTube #JrNTR #jrwifanart #JrNTR???? #jrntrfootysjagan #jrntrfootnaradogs #NTR30 #NTRfantasy #ntrnominatedforoscar2023 #ntrhealthuniversity #Amaravati
— nagesh paina (@PainaNagesh) October 9, 2022
అసలు తాతను అవమానించినప్పుడు జూనియర్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. మరి అలాంటి మనవడు ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. అంటూ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీని తామే లాక్కొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడే వెనక ఉండి అమరావతి ప్రాంత రైతులతో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తోన్నాడంటూ.. ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించింది. రైతుల తీరును తప్పుపట్టారు. ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్‌ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దంటూ మండిపడుతున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సమయంలో కూడా జూనియర్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రోల్స్ చేశారని, ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావూరి కృష్ణ, కన్వీనర్ నున్న గణేష్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు. జూనియర్‌ను తిట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Jr ntr, TDP