AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం పూర్తిగా హీటెక్కింది. ముఖ్యంగా గుంటూరు తొక్కిసలాట తరువాత పరిస్థితి మరింత రచ్చకు కారణమవుతోంది. తొక్కిసలాట ఘటనపై అధికార పార్టీ నేతలు వరుసగా టీడీపీపై దాడి చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు చేసిన హత్యలే అని మంత్రులు, వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే వారి విమర్శలకు ధీటుగా టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. వరుసగా జరుగుతున్న తొక్కిసలాటలపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని.. ఎప్పుడూ లేనిది ఇలా జరుగతోంది అంటే దానికి వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై అధికార పార్టీ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ముఖ్య నేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవాలనే కుట్ర జరగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలే అందుకు నిదర్శనమని ఆరోపించారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను పార్టీలకు ఆపాదిస్తున్నారని లోకేష్ ఆక్షేపించారు. సంఘటనను రాజకీయాలకు ఆపాదించే వారు మనుషులు కాదని మండిపడ్డారు. ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయన్న నక్కా ఆనంద్ బాబు.. సంఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు పరామర్శ, సోషల్ మీడియా యాక్టివ్ కావటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మాట్లాడని మహిళ కమిషన్ చంద్రబాబు పై విమర్శలు చేయడానికి మాత్రం ముందు ఉంటుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని (Devineni Uma) మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు (NRI Srinivasarao) ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కానీ నిన్న గుంటూరులో పోలీసులు అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జరిగిన దుర్ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు.
ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైసీపీ నేతలు (YCP Leaders) క్యూలు కట్టి నోళ్లు పారేసుకున్నారని మండిపడ్డారు. జగనన్న సైన్యం, అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబర్ 20న ప్రచారం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. గజగజ వణకాల్సిందే ఒక్కొక్కడు.. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అని పోస్టు పెట్టారన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనకు.. ఈ పోస్టుకు సంబంధం ఉందని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Nara Lokesh, TDP