Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Nara Lokesh: సాధారణంగా ఏ రాజకీయా పార్టీ అయినా ఓ పెద్ద కార్యక్రమం మొదలెట్టిందంటే హడావిడి మాములుగా ఉండదు. పార్టీ అధినేత నోటివెంట మాట రావడమే తరువాయి.. ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ బాధ్యత తీసుకుంటారు. అంతేకాదు జనంలోకి తీసుకెళ్తారు.. ఆ ప్రోగ్రామ్ అవసరాన్ని అందరికీ చెబుతుంటారు. కానీ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కీలక నేత కీలక ప్రకటన చేస్తే స్పందించాల్సిన నోళ్లు కూడా తెరుచుకోవడం లేదు. తాజాగా ఏపీ రాజకీయాల్లో (AP Politics) పాదయాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాదయాత్ర చేస్తే చాలు అధికారం గ్యారెంటీ అనే సెంటిమెంట్ కూడా ఉంది. వైఎస్ఆర్, చంద్రబాబు (Chandrababu) నుంచి జగన్ వరకు పాదయాత్ర ద్వారానే సీఎం కుర్చీ ఎక్కారు. ఇప్పుడు నారా లోకేష్ (Nara Lokesh) కూడా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారు.
లోకేష్ ను టీడీపీ భవిష్యత్తు రథసారథిగా చంద్రబాబు నిలబెడుతున్నారు. టీడీపీలోనూ అందరి నోట అదే మాట. అలాంటిది లోకేష్ పాదయాత్ర ప్రకటన చేస్తే.. స్పందించాల్సిన నేతలు, మాట్లాడాల్సిన నోళ్లు సైలెంట్ గా ఉండిపోయాయి. నిన్న మొన్నటిదాకా లోకేష్ జనంలోకి రావడం లేదు.. సరిగా మాట్లాడటం లేదంటూ నిట్టూర్చిన నేతలు.. ఇప్పుడాయన జనంలోకి వస్తానంటే మాత్రం హడావిడి చేయడం లేదు.
అదే జగన్ పాదయాత్ర అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.. చాలా రోజుల ముందు నుంచే పాదయాత్రకు హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడంటూ కుదిరినప్పుడల్లా ఊదరగొట్టారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఘటన అనేలా ప్రజల్లో ప్రొజెక్ట్ చేశారు. కట్ చేస్తే జగన్.. సీఎం కుర్చీలో కూర్చుకున్నారు.
టీడీపీ విషయానికి వస్తే.. బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు రాష్ట్ర మంతా తిరుగుతున్నారు. కొందరు నేతలు ఆయా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనౌన్స్ చేస్తే ఒక్కరూ హైలెట్ చేయడం లేదన్న భావన టీడీపీలో ఉంది. సీనియర్ల సంగతి అటుంచితే.. ఈ బాధ్యత అంతా యువనేతలపైనే పెట్టారు చంద్రబాబు నాయుడు.
ఇదీ చదవండి: ఘోర అగ్నిప్రమాదం.. తండ్రికొడుకులు సజీవ దహనం.. తల్లి, కూతురికి గాయాలు
కానీ ఈ సారి టికెట్లు ఆశించే యంగ్ లీడర్స్ కూడా పాదయాత్రపై సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలకే నమ్మకం లేదా? లేక వైసీపీ బలాన్ని చూసి మనకెందుకొచ్చిందిలే అని లైట్ తీసుకుంటున్నారా.. అని కేడర్ సైతం చర్చించుకునే పరిస్థితి నెలకొంది. చిన్న కార్యక్రమానికి కూడా ఎక్కడా లైని హైప్ తీసుకొచ్చే చంద్రబాబు కూడా లోకేష్ ప్రకటనను పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది.
ఇదీ చదవండి : ఏపీలో ఈ ఐదు గింజలకు ఫుల్ డిమాండ్.. నిత్యం ఇవి తింటే షుగర్ కు చెక్ పెట్టినట్టే..!
ఈ ఏడాది మాహానాడులో లోకేష్ చేసిన ఓ ప్రతిపాదనకు కూడా పార్టీలో విలువలేకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది. వరసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ లేదనడం, వరసగా రెండేళ్లు పదవలు చేపట్టకూడదనే మాట చెప్పినా.. ఇంతవరకూ వాటిపై చర్చగానీ, ప్రకటన చేయడంగానీ జరగలేదు. తాజాగా పాదయాత్రను కూడా లైట్ తీసుకుంటుండటంతో తమ్ముళ్లే లోకేష్ ను పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Mangalagiri, Nara Lokesh, TDP