Home /News /andhra-pradesh /

GUNTUR TDP LEADERS NEW DEMAND BAN 23RD DATE YCP MP VIJAYSAI REDDY PUNCHES ON TWITTER ON DULIPALLA ARREST NGS

Andhra Pradesh: 23వ తేదీని బ్యాన్ చేయాలి. టీడీపీ నేతల కొత్త డిమాండ్.. విజయసాయిరెడ్డి సెటైర్లు

23వ తేదీని బ్యాన్ చేయాలంటున్న టీడీపీ విజయసాయిరెడ్డి ట్వీట్

23వ తేదీని బ్యాన్ చేయాలంటున్న టీడీపీ విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీని 23వ తేదీ సెంటిమెంట్ వెంటాడుతోందా? 23వ తేదీ అంటే ఆ పార్టీకి కలిసి రావడం లేదా?. తాజాగా ఆ పార్టీ కీలక నేత దూళిపాళ్ల నరేంద్ర కూడా 23వ తేదీనే అరెస్ట్ అవ్వడం.. పార్టీలో ఆందోళన పెంచుతోందా?

    చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి. అయితే రాజకీయాల్లో కూడా సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు నేతలు. ఒక్కోసారి సెంటిమెంట్ ను లక్కీగా భావిస్తే.. కొంతమందికి అస్సలు సెంటిమెంట్ కలిసి రావడం లేదని బాధపడుతుంటారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలను కూడా అలాంటి సెంటిమెంట్ ఇప్పుడు వెంటాడుతోంది. ఆ సెంటిమెంట్ ఏంటో అందరూ ఊహించే ఉంటారు. అదే నెంబర్ 23. అవును 23వ తేదీ అంటేనే టీడీపీ నేతలకు ఏదో ఒక టెన్షన్ తప్పడం లేదు. అందుకే ఈ నెంబర్ చెప్తే చాలు అధినేత నుంచి కార్యకర్త వరకు హడలెత్తిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ ట్వంటీ త్రీ నెంబర్ ఇప్పుడు టీడీపీ నేతల కల్లోకి కూడా వస్తోందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

    ఈ 23 నంబర్ వెనక అసలు కథేంటంటే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మే 23న ఫలితాలొచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఊహించని పరాభం ఎదురైంది. అప్పుడు మొదలైంది 23వ తేదీ టెన్షన్. ఇక ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే.. 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు. 151 స్థానాలతో వైసీపీ ప్రభంజనం కొనసాగితే.. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి మాత్రం కేవలం 23 సీట్లే వచ్చాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకుంటే.. సరిగ్గా ఎన్నికల్లో కేవలం 23 సీట్లే వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ లా నువ్వు ఎక్కడ మొదలయ్యావో.. అక్కడకే వస్తావ్ అన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో సీఎం జగనే నేరుగా సెటైర్లు వేశారు. దేవుడు స్క్రిప్ట్ అద్భుతంగా రాసారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిండు శాసనసభలో చంద్రబాబుని అవహేళన కూడా చేశారు.

    అప్పటి నుంచి 23వ తేదీన ఏం జరిగినా టీడీపీ నేతలపై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. అయితే మొన్న ఏపీ మున్సిపల్ ఎన్నికలు కూడా 23నే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎవ్వరూ ఊహించని విధంగా పరాజయం పాలైంది. 75 మున్సిపాలిటీలకు కేవలం రెండు చోట్ల ఆధిక్యంలో నిలిచినా.. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే నిలుపుకోగలిగింది. మరోవైపు గతంలో చంద్రబాబుకు సీఐడీ నోటిసులు ఇస్తూ.. 23వ తేదీనే విచారణకు హాజరవ్వమని కోరింది. దీంతో 23 వ తేదీ అంటే టీడీపీ నేతలు భయపడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే దానిపై ఇప్పటికే చంద్రబాబు స్టే తెచ్చుకోవడంతో ఆ సెంటిమెంట్ ఇబ్బంది తప్పింది. మళ్లీ ఇప్పుడు 23వ తేదీ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది.

    తాజాగా టీడీపీ కీలక నేత ధూళిపాళ్ళ నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘం డైరీలో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులపై ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. మరోవైపు ఈ కేసుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ కుట్రతోనే ఇలా టీడీపీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి నేతలు ఆరోపణలు చేశారు. అయితే వారి ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ ఎంపీ మాత్రం ట్విట్టర్లో సెటైర్లు వేశారు.

    దూళ్లిపాళ నరేంద్ర అరెస్ట్ అంటూ వేసిన బ్రేకింగ్ ఫోటోలకు.. శుక్రవారం, పైగా 23వ తేదీని క్యాలెండర్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారంటూ సెటైర్ వేశారు. దూళిపాళ్ల అరెస్ట్ కూడా 23వ తేదీనే జరగడంతో ఆ తేదీని చూసి టీడీపీ నేతలకు వణుకు పుడతోందని ఆయన ఆరోపించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Tdp, Vijayasai reddy

    తదుపరి వార్తలు