హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: సీఎం నివాసం సమీపంలో లోకేష్ అద్భుత కార్యక్రమం.. సొంత ఖర్చులతో సంజీవ‌ని ఆరోగ్య ర‌థం

Nara Lokesh: సీఎం నివాసం సమీపంలో లోకేష్ అద్భుత కార్యక్రమం.. సొంత ఖర్చులతో సంజీవ‌ని ఆరోగ్య ర‌థం

సీఎం నివాసం దగ్గర నారా లోకేస్ సంజీవని రథం

సీఎం నివాసం దగ్గర నారా లోకేస్ సంజీవని రథం

Nara Lokesh: పోయిన చొట్టే నెగ్గాలి అనే విధానంతో ముందుకు వెళ్తున్నారు నారా లోకేష్.. మళ్లీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న లోకేష్.. తాజాగా సీఎం జగన్ నివాసానికి సమీపంలో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా సొంత ఖర్చులతో ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mangalagiri, India

Nara Lokesh: మంగళగిరి (Mangalagiri) లోనే తాను పోటీ చేస్తానని ఇప్పటికే నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. పోయిన చోటే గెలవాలి అదే తన లక్ష్యం అని కూడా చెప్పారు.  గత ఎన్నికల్లో ప్రజలకు సరిగ్గా తన మాట చెప్పుకోలేకపోయానని.. అందుకే గత మూడేళ్లుగా మంగళిరికి అందుబాటులో ఉంటూ అక్కడి ప్రజలను కలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాను అన్నారు. ఈ సారి గెలుపు సాధించడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులు భాగంగా సొంత డబ్బులతో అనేక కార్యక్రమలు చేపడుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన తాజాగా సంజీవని ఆరోగ్య్ రథాన్ని ప్రారంభించారు. చిన్న చిన్న స‌మ‌స్యల‌కీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి స‌మ‌యం, డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌లేని నిరుపేదలు, నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామీణుల కోసం మొద‌టిసారిగా `సంజీవ‌ని ఆరోగ్య ర‌థం` పేరుతో మొబైల్ ఆస్పత్రి ఆలోచ‌న‌కి కార్యరూపం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పట్టణాలకు కూడా విస్తరించారు.

తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నివాస ప్రాంతమైన తాడేపల్లి పట్టణంలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలానికి ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రం, మంగళగిరి, తాడేపల్లి లో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాను అన్నారు లోకేష్.

వాటి ద్వారా ఇప్పటి వరకూ పది వేల మందికి వైద్య సహాయం అందించామన్నారు. త్వరలోనే బిపి, షుగర్ ఉన్న వారికి ప్రతి 15 రోజులకోసారి టీడీపీ తరపున మందులు ఇంటి దగ్గరే అందిస్తామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. మంగళగిరి నియోకవర్గ ప్రజలు అందరికీ దీన్ని అందుబాటులో ఉంచారు. ఎలాంటి సమస్య ఉన్నా ఉచితంగానే వైద్య సదుపాయం అందించనున్నారు.

ఈ ఆరోగ్యర‌థంలోని అత్యాధునిక చికిత్స ప‌రిక‌రాలు, ప‌రీక్ష యంత్రాలు, ఎమ‌ర్జెన్సీకి అవ‌స‌ర‌మైన సామాగ్రిని నారా లోకేష్ సొంత ఖ‌ర్చుల‌తో స‌మ‌కూర్చారు. ఈ వాహ‌నంలో ఒక జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ అయిన డాక్టర్‌, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌, ఫిమేల్ న‌ర్స్‌, కాంపౌండ‌ర్ ఉంటారు. డాక్టర్ ఆధ్వ‌ర్యంలో రోగుల్ని ప‌రీక్షిస్తారు.

ఇదీ చదవండి : జగన్ అంటే పిల్లి అనుకున్నారా..? పులి.. చంద్రబాబే దత్తపుత్రుడితో తిట్టిస్తున్నారన్న కొడాలి నాని

ఈ ఆరోగ్యర‌థం దగ్గరే 200కి పైగా రోగ‌నిర్దార‌ణ ప‌రీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. అవ‌స‌ర‌మైన‌వారికి మందులు కూడా రూపాయి తీసుకోకుండా అంద‌జేయ‌నున్నారు. అంద‌రికీ ఆరోగ్యమ‌స్తు-ప్రతీ ఇంటికీ శుభ‌మ‌స్తు అనే నినాదంతో చేప‌ట్టిన ఈ ఆరోగ్యర‌థం ఏ ఊరు ఏ స‌మ‌యంలో సంద‌ర్శిస్తుందో ముందుగా షెడ్యూల్ చేసి వారికి స‌మాచారం ఇస్తారు. ఇందులో పేషెంట్లకి అత్యవ‌స‌ర‌సేవ‌లు అందించే సామ‌గ్రి, నెబ్యులైజ‌ర్‌, ఆక్సిజ‌న్ వంటివ‌న్నీ అందుబాటులో ఉంచారు. అలాగే మాతాశిశు సంర‌క్షణ సూచ‌న‌లు ఇవ్వడంతోపాటు ఆరోగ్య అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వహించి ప్రజ‌ల్ని చైత‌న్యం చేస్తారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Mangalagiri, Nara Lokesh

ఉత్తమ కథలు