హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు

Nara Lokesh: 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు

నారా లోకేష్ పాదయాత్ర పేరు యువగళం

నారా లోకేష్ పాదయాత్ర పేరు యువగళం

Nara Lokesh: తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పాదయాత్రకే పేరు కూడా ఫిక్స్ చేశారు. యువ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హడావుడి పీక్ కు చేరింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందా అనేలా పార్టీలు వ్యూహ.. ప్రతి వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అధికార వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaki Government) పేరుతో ఆ పార్టీ నేతలు అంతా.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే ఇదేం ఖర్మ పేరుతో జిల్లాల బాట పడుతున్నారు. ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్ర పాదయాత్ర (Padayatra)కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు ‘యువగళం (Yuva Galam)’ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు. బుదవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో కోలాహలం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) యువగళం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిన్న రాజప్ప, వంగలపూడి అనిత, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగనుంది.

ఈ పాదయాత్రలో మొత్తం వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రెడీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ఈ పాదయాత్రపై తెలుగు దేశం భారీ ఆశలే పెట్టుకుంది.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని.. లోకేష్ కు రాజకీయ కెరీర్ కు ఉపయోగపడుతుందంటున్నారు.

ఇదీ చదవండి : కూతురుని కూడా వదలరా? ట్రోల్స్ పై కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా .. అసలు ఏం జరిగింది అంటే?

సాధరణంగా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఓ బెంచ్ మార్క్‌లా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల్లో ఉండటానికి .,. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడానికి యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అది విడతల వారీగా సాగుతోంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ యాత్ర నిర్విరామ యాత్రకు సిద్ధమవుతున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయనే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పడు అధికారికంగా దీనిపై ప్రకటన చేశారు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. దీనికి తగ్గట్టుగానే రూట్ మ్యాప్ సిద్ధమైంది.

ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 1న సర్వదర్శనం టోకెన్లు జారీ.. ఎక్కడ ఇస్తారంటే..?

నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్‌గా మారింది. గతంలో అయితే చంద్రబాబుతో పాటు జగన్ జైలులో ఉండటం వల్ల.. షర్మిల పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీకి విజయం లభించలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజుల పాదయాత్రే చేశారు. అయినా ఆయన ఘన విజయం సాధించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు