anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.
Nara Lokesh Padayatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపు కోసం అన్ని పార్టీల వ్యూహాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నరే సమయం ఉండడంతో అన్ని పార్టీలు భారీ ప్లాన్స్ ను రెడీ చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉండేలా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP) గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaki Government) కార్యక్రమంతో ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతోంది. ఈ ప్రోగామ్ ని సీఎం జగన్ (CM Jagan) చాలా సీరియస్ గా తీసుకొని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు పార్టీ పరంగా.. ఇటు ప్రభుత్వం పరంగా మళ్లీ అధికారంలోకి తమదేనన్న ధీమాతో వైసీపీ ముందుకెళ్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లోనే కాస్త నిర్లిప్తత నెలకొందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నించడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడంలో టీడీపీ కాస్త వెనుకబడిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొవాలంటే మరేదైనా భారీ కార్యక్రమం చేపట్టాలని నారా లోకేష్ పాదయాత్ర ను జనవరి 27వ తేదీన కుప్పం నుండి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లు నిన్న మంగళగిరిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమం లో లోకేష్ ప్రకటించారు.
ఇదీ చదవండి : పవన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి పార్టీ మారుతున్నారా..?
మూడు నెలల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన పార్టీ మహానాడు తర్వాత పార్టీ కాస్త ఉత్సాహంగా కనపిస్తోంది. మహానాడు నింపిన ఉత్సాహంతో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టినా పార్టీ నాయకులు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక లాభం లేదని గుర్తించిన లోకేష్ పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారట.
ఇదీ చదవండి: ప్రధాని ముందే మూడు రాజధానుల ప్రస్తావన..? మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
2023 జనవరి నుంచి ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు వందల యాబై రోజుల పాటు యాత్ర సాగేలా ప్రతి నియోజకవర్గంలో యాత్ర ఉండేలా పక్కా ప్రణాళికతో రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి యువత, నిరుద్యోగులు, దళిత, బడుగు బలహీన వర్గాలను దగ్గర చేసే విదంగా ప్రణాళికను రూపొందించారట జనవరి 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని.. ఇందుకోసం ఆయన మానసికంగా సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్రను పూర్తి సక్సెస్ చేసే విధంగా పెద్ద స్కెచ్ రెడీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోంది.. మగవారి నరాల బలహీనతకు చెక్ పెట్టే సీతాఫలం..
ఈ పాదయాత్రకు సంబంధించి బాధ్యతలను కొంనియోజకవర్గాల బాధ్యతను వారే చూస్తుంటారు. ముఖ్యంగా కొందరి యువ నేతలను ఎంపిక చేసి.. పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యువకులు.. రైతులకు లోకేష్ ను చేరువ చేేసేలా ఈ పాద యాత్రను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి పాదయాత్రలు చేసిన నేతలు అధికారం సాధిస్తూ వస్తున్నారు. మరి అనవాయితినీ లోకేష్ కంటిన్యూ చేస్తారా.. లేదా బ్రేక్ వేస్తారో చూడాలి..దరు కీలక నేతలకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Guntur, Nara Lokesh, TDP