హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: ఆ ఫోటోలు మార్ఫింగ్ కాదు.. మంగళగిరిలో ఓటమికి కారణం అదే.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Unstoppable 2: ఆ ఫోటోలు మార్ఫింగ్ కాదు.. మంగళగిరిలో ఓటమికి కారణం అదే.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్ మెచ్యూర్ గా మాట్లాడారా?

నారా లోకేష్ మెచ్యూర్ గా మాట్లాడారా?

Unstoppable With NBK 2: భామలతో ఫారెన్ లో జలకాలాటలు ఆడిన లోకేష్ అంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి..? అవి మార్ఫింగ్ అని కొందరు వాధించేవారు.. అయితే ఆ ఫోటోలు ఎక్కడవి ఎలా వచ్చాయి అన్నదానిపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అలాగే మంగళగిరిలో ఓటమికి తానే కారణం అని ఒప్పుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mangalagiri, India

Unstoppable With NBK 2: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. మొన్నటి వరకు వరకు ఆయనకు మాట్లాడడం రాదు అంటూ విమర్శించిన వారే.. లోకేష్ తీరు చూసి షాక్ అవుతున్నారు. నారా లోకేష్ ఎంత మెచ్యూర్ గా మాట్లాడారు అండూ పొగుడుతున్నారు. ఇంతకీ ఆయన తాజా వ్యాఖ్యలతో లోకేష్.. టీడీపీ (TDP) అభిమానులు, కార్యకర్తుల, ఏపీ ప్రజలకు ఏం చెప్పలానుకున్నారు.. తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులతో పాటు ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్ (Unstoppable NBK 2) ఆహాలో స్ట్రీమింగ్‌ మొదలైంది. తొలి ఎపిసోడే బ్లాక్ బస్టర్ గా మారింది. మొదటి ఎపిసోడ్‌కు బాలకృష్ణ వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), అతని కుమారడు నారా లోకేశ్‌ను అతిథులుగా రావాడం.. ఎప్పటి నుంచో అనుమానాలుగానే ఉన్న.. ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడంతో.. షో క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఓటీటీ రేటింగ్స్ లో రికార్డు దిశగా దూసుకుపోతోంది. బావని.. అల్లుడిని ఇద్దర్నీ బాలయ్య వదల్లేదు.. బయట ట్రోలింగ్ చేస్తున్న.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అంశాలపైనే ప్రశ్నించి.. షోను మరో లెవెల్ కు తీసుకెళ్లారు..

1995 బిగ్‌ డెసిషన్‌, వైఎస్సార్‌తో అనుబంధం, అలాగే లోకేశ్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఫొటోలు, మంగళగిరిలో ఓటమిలపై ప్రశ్నలు అడిగి షోపై ఆసక్తిని రెట్టింపు చేశారు బాలయ్య. ఆ ప్రశ్నలకు చంద్రబాబు , లోకేశ్‌ కూడా చాలా ఆసక్తికరంగా సమాధానాలివ్వడం.. అది కూడా వారి నుంచి ఊహించని సమధానాలు రావడంతో.. ఈ షోకు హైప్ ను తెచ్చాయి. అన్నిటికన్నా నారా లోకేష్ ఇచ్చిన సమాధానాలు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయని స్పందన వినిపిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు పబ్లిక్ టాక్ లోనూ.. లోకేష్ సమాధానాలు సరైనవే అని ఆయనకు మద్దతు పెరిగేలా చేస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన మాటలకు.. పార్టీకి వ్యక్తిగతంగా ఆయనకు ప్లస్ అవుతాయి అంటున్నారు.

ముఖ్యంగా లోకేశ్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌ ఫొటోల వ్యవహారం. గతంలో లోకేశ్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటకు వచ్చాయి. స్విమ్మింగ్ పూల్‌లో విదేశీ అమ్మాయిలతో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ కొన్ని ఫొటోలు అప్పట్లో సెన్సేషన్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రత్యర్థి పార్టీలు కూడా విపరీతంగా ట్రోల్‌ చేస్తూ లోకేశ్‌, చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శల వర్షం గుప్పించారుమా. ఇప్పుడివే ఫొటోలను చూపిస్తూ అన్‌స్టాపబుల్‌ వేదికగా బాలయ్య మరోసారి లోకేష్, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదీ చదవండి : పవన్ యాత్రకు వాహనం ఇదే.. ఆరుగురు కూర్చొనే సిట్టింగ్.. చుట్టూ నిఘా నేత్రం.. ఎన్నో ప్రత్యేకతలు

ఈ ఫొటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని, ఆ ఫొటోల వెనకున్న విషయమేంటని తండ్రీ కొడుకులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ‘మామకు, ఆయన భార్యకు లేని సందేహం తనకెందుకు అంటూ తెలివిగా మాట్లాడారు. లోకేష్ ఏమన్నారంటే? ‘ఆ ఫొటోల్లో ఉన్నది తానే అని.. అవి మార్ఫింగ్ ఫోటోలు కాదంటూ ఒప్పుకున్నారు. అయినా అందులో తప్పేముంది. 2006లో కాలేజ్‌ డేస్‌లో సరదాగా దిగిన ఫొటోలవి అన్నారు. వారంతా నాతో పాటు నా సతీమణి బ్రాహ్మణికి కామన్‌ ఫ్రెండ్స్ అని వివరణ ఇచ్చారు. అంతేకాదు ఆ ఫోటోలో ఉన్నవారంతా..? తన కంటే బ్రాహ్మణికే ఎక్కువగా తెలుసన్నారు. ఆ ఫొటోల్లో తప్పేముందో నాకైతే తెలియడం లేదన్నారు. కావాలంటే ఆ ఫొటోలు ఫ్రేమ్‌ కట్టిస్తా అని తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా.. తనపై విమర్శలు ఆగేలా సమాధానం చెప్పారు.

ఇదీ చదవండి: శ్రీవారికి విరాళాల వెల్లువ.. ఈ నెల రోజుల్లో వచ్చినవి ఇవే.. రికార్డు స్థాయి నగదు.. ఎంతంటే?

ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ విషయంపై లోకేశ్‌ ను బాలయ్య ప్రశ్నించారు. తాను చెప్పాల్సినది ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయాను అన్నారు. అలాగే ఎక్కువ టైం ప్రజలకు కేటాయించలేకపోవడం కారణంగానే ఓడిపోయానని.. ఆ తప్పు తనదే అన్నారు. అందుకే ఎక్కడైతే నేను ఓడిపోయానో..తిరిగి అక్కడే గెలవాలని ప్రయత్నిస్తున్నాను అన్నారు. మూడేళ్ల నుంచి తాను మంగళగిరిలో నే తిరుగుతున్నానని వివరణ ఇచ్చారు. మంగళగిరి ఓటర్లను ఆకట్టుకునేలా ఆయన సమాధానం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Mangalagiri, Nandamuri balakrishna, Nara Lokesh, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు