హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CBN Deeksha: “పట్టాభిది తప్పైతే.. మీ మంత్రులదీ తప్పే..” దీక్ష ప్రారంభించిన చంద్రబాబు...

CBN Deeksha: “పట్టాభిది తప్పైతే.. మీ మంత్రులదీ తప్పే..” దీక్ష ప్రారంభించిన చంద్రబాబు...

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో రేగిన చిచ్చు మంటలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై (Attack on TDP office) వైసీపీ అభిమానుల దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) 36 గంటల దీక్ష ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై (Attack on TDP Office) వైసీపీ అభిమానుల (YSRCP) దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) 36 గంటల దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల దాడులు, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు చూడలేదు. జరగరాని సంఘటనలు జరిగినప్పుడు ఆవేశంలో చిన్నవి జరగవచ్చుకానీ, ఒక పద్ధతిగా టీడీపీని తుదిముట్టించాలి, భయబ్రాంతులను చేయాలి, ఎవరైనా టీడీపీలో వుండాలన్నా, ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ దాడులపైన పెద్ద కుట్రే జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పట్టాభి ఇంటిపై దాడి చేశారని.., పట్టాభి భార్యను, 8ఏళ్ల చిన్న అమ్మాయిని కాపాడాలని ఆలోచిస్తున్నామని.., ఆలోపే ఇళ్లు మొత్తం ధ్వంసం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ అప్పుడే.. డీజీపీ కార్యాలయం పక్కన, సీకే కన్వెన్షన్ నుండి 150 మంది పార్టీ కార్యాలయానికి బయలుదేరారని సమాచారం అందిందని చెప్పారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. విశాఖ పార్టీ ఆఫీసుపై దాడి చేశారు, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంపై, కడపలో అమీర్ బాబు ఇంటిపై, లింగారెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఇంఛార్జి సుధీర్ రెడ్డికారుపై రాళ్లువిసిరినట్లు ఆరోపించారు.

  ఇది చదవండి: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..


  కేవలం వంద మీటర్ల దూరంలనే డీజీపీ కార్యాలయం, బెటాలియన్ దానికి దగ్గర్లోనే సీఎం ఇళ్లు ఉందని అయినా టీడీపీ కార్యాయలంపై దాడి జరిగిందన్నారు చంద్రబాబు. పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి ఈ దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి మనపై కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని చంద్రబాబు అభివర్ణించారు. వైసీపీకి సవాల్ విసురుతున్నా.. మమ్మల్ని మేము కాపాడుకోగలం.. పోలీసులకు చేతగాకపోతే స్టేషన్లు మూసేసుకుని వెళ్లండిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: సీఎం సొంత జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి..? రేసులో ఉన్నది వీళ్లేనా..!


  “రాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అలాంటప్పుడు 356 పెడతారు. టీడీపీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కావాలని అడగలేదు. ఒక పార్టీ కార్యాలయంపైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థపైన పద్దతి ప్రకారం చేశారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి, 356 పెట్టి రాష్ట్రాన్ని కాపాడాలని కోరాను. ఎన్ని గట్స్ వుండాలి డీజీపీకి.? కార్యాలయానికి ఎవరో సీఐ వచ్చి అనుమానస్పదంగా తిరిగితే పట్టుకుని మీడియా ముందు మనవాళ్లు పెట్టారు. పోలీసులకు అప్పజెప్పిన తర్వాత అతనెల్లి మన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టారు. మా అనుమతి లేకుండా మీ అధికారి మా ఆఫీసుకు ఎందుకు వచ్చారు. మహావ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు..శబాష్. ఎన్ని చేస్తారో చేయండి చూస్తాం. పట్టాభి వాడిని బాష తప్పైతే సీఎం భాష ఏంటి.? మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి.? ప్రజల్ని అడుగుదామా.?:” అని చంద్రబాబు నిలదీశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP, Ysrcp

  ఉత్తమ కథలు