రాష్ర్టంలో వైసీపీ (YSRCP)అరాచకం పరాకాష్టకు చేరిందని, ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రతిపక్షాలను, ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ద్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై 36 గంటల పోరు దీక్ష ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మించుకున్న 70 లక్షలమంది కార్యకర్తలకు దేవాలయమైన టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటే.... ఉగ్రవాదం కాక మరేంటి? ఈ దాడి ఏమైనా అడవిలో జరిగిందా? ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లో డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో జరిగిందంటే వీళ్ల పరాకాష్టకు ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ అడ్డుకుని ఉంటే ఈ దాడి జరిగేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ తో యువత చిత్తు
డ్రగ్స్ తో రాష్ర్ట యువత భవిష్యత్ పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్న చంద్రబాబు..., పిల్లలు గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పధార్ఢాలకు అలవాటు పడితే వారి భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. మీకు, మీ పోలీసులకు భయపడి ప్రజలు, ప్రతిపక్షాలు సరెండర్ అవ్వాలా? అని నిలదీశారు. మద్యం సిండికేట్లుని అరికట్టి మొదట మద్యం పాలసీ తెచ్చింది ఎన్టీఆరే, మద్యపాన నిషేదం అన్న జగన్ మాటతప్పారని ఆరోపించారు. మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు.
వెంకటేశ్వరుడే కాపాడాడు..
సమైక్యాంధ్ర రాష్ర్టంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రంలో ఉగ్రవాదం, ముఠా కక్ష్యలు, మతతత్వం లేకుండా ఉండేందుకు కృషి చేశాని.., అందుకే నాపై 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే వెంకటేశ్వర కాపాడాడన్నారు. పట్టాభి సీఎం తల్లిని దూషించారని అంటున్నారు, నేను రాజకీయాల్లోకి వచ్చినపుడు జగన్ నోట్లో వేళ్లేసుకుని ఆటలాడుకుండి ఉంటారని ఎద్దేవా చేశారు. వీళ్ల తప్పులు ఎండగడితే బూతుల మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు నన్ను ఇష్టమెచ్చినట్టు బూతులు తిడుతున్నారన్నారు. అమరావతి పర్యటనలో నా బస్సుపై చెప్పు వేస్తే ఎవరో భాధితులు ఆవేదనతో విసిరి ఉంటారని సాక్షాత్యు డీజీపీ మాట్లాడారంటే ఏం అనాలని ప్రశ్నించారు.
టీడీపీ ఆపీసుపై దాడి ఘటన గురించి పోన్ చేస్తే కేంద్ర హోంమంత్రి, గవర్నర్ పోన్ తీసి మాట్లాడారన్న చంద్రరబాబ.., కానీ డీజీపీ కనీసం స్పందించకపోగా పైగా దాడి చేసిన వాళ్లను పోలీసులే సాదరంగా పంపించారని ఆరోపించారు. ఆపీసుపై దాడి జరిగినా ఇన్ని గంటలు గడిచినా ఇంతవరకు కనీసం కేసు పెట్టలేదని.,ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదుని మండిపడ్డారు. దాడి జరిగిన తర్వాత అక్కడ లేని లోకేశ్ , బ్రహ్మం, ఇతర నేతలపై 307 కేసులు పెట్టటారంటే డీజీపిని ఏమనాలని నిలదిశారు.
వారిపై కేసులు పెట్టరా..?
పట్టాభి దాడి చేసిన వారిపై కేసులు లేవు గానీ పట్టాభి ఏదో తిట్టిడాడని తిట్టినదాటిని కొత్తం అర్దం చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. తన తల్లిని తిట్టారని జగన్ అంటున్నారు. జగన్ తన రాజకీయ లబ్ధికోసం తల్లిని కూడా ఉపయోగించుకుంటున్నారన్నారు. జగనన్న బాణం తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతోంది. సొంత చెల్లికి న్యాయం లేని జగన్ నాకు నీతులు చెబుతారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు మేం పోరాటం చేస్తున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం మాదేని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు..
భారతదేశ రాజకీయాల్లో జగన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టం ముందూ అందరూ తల వంచాల్సిందేనన్నారు. “కేసులు పెట్టి మానసికంగా వేధిస్తే మాకు రావా బీపీలు?. తప్పు చేసిన వైకాపా నాయకులను పట్టుకోవడానికి పోలీసులు భయపడుతున్నారు. తెలుగుదేశం హయాంలో అన్ని ముఠాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాం. సొంతపార్టీ వారిపైనా కఠిక చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్టబద్ధంగా పరిపాలించాం. మైదుకూరు ఎమ్మెల్యే చంపుతామని బెదిరించినా ఆయనపై కేసు లేదు. వీళ్లు లా అండ్ ఆర్డర్ ను కాపాడే వాళ్లా? డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చే వరకు ఈ పోరాటం ఆగదు.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP, Ysrcp