Macharla Tension: పల్నాడు జిల్లా మాచర్ల (Macherla) లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ (Turaka Kishore) వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి. అయితే వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మాచర్లలో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపాటు
మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణం ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ గూండాలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదు.
ఇదీ చదవండి : ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. సచివాలయ కన్వీనర్ల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..
మరోవైపు వైసీపీ హింసపై గుంటూరు కి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. అక్కడ పరిస్థితులు ఇంత దారుణం గా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసిపి గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై నా చర్యలు తీసుకోవాలని డీఐజీని కోరారు చంద్రబాబు..
ఇదీ చదవండి : ఆ ఉమ్మడి జిల్లా ఎంపీలు అసెంబ్లీవైపు చూస్తున్నారా..? కారణం ఇదేనా..?
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టిడిపి శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణం అన్నారు నారా లోకేష్ .. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టిడిపి వారిపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనం అన్నారు లోకేష్.. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు టిడిపి కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైసీపీకి కొమ్ముకాయడమే అన్నారు. టీడీపీ వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ముగిసిన బీసీ కార్పోరేషన్ల పదవీకాలం.. ఈ రెండేళ్లలో వాటిద్వారా ఒనగూరిన లబ్ధి ఎంత..?
మాచర్ల ఎవడబ్బ జాగీరు పిన్నెల్లి ? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.. ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడడా? అని నిలదీశారు.. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గూండాగురి పరాకాష్టకు చేరిందని.. టీడీపీ నేతల కార్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ను అన్నారు.
ఇదీ చదవండి : జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?
వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనడానికి ఈరోజు మాచర్ల సంఘటనే నిదర్శనం అన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మూడున్నర సంవత్సరాల నుండి ఈరోజు మాచర్లలో నెలకొన్న పరిస్థితులే రాష్ట్రమంతా ఉన్నాయి. ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేయడం ఈరోజు కొత్త కాదు అన్నారు. పల్నాడు ప్రాంతంలో సొమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలను వైసిపి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ ఆద్యం పోసుకుంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, FIRE, TDP, Ycp