AP Political Fight: వైసీపీ - టీడీపీ పోటాపోటీ దీక్షలు... ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్..?

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) ప్రస్తుతం అట్టుడుకుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham Party) రెండూ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు.

 • Share this:
  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) ప్రస్తుతం అట్టుడుకుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham Party) రెండూ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. విమర్శకు ప్రతివిమర్శ.. ఆరోపణకు ప్రత్యారోపణ.. దీక్షకు కౌంటర్ దీక్ష. రెండు పార్టీలు తమదే సరైన విధానమని ప్రజల్ని నమ్మేంచే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 36గంటల దీక్షకు దిగారు. ఈ దీక్ష రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలంగా చాటాలని.. పార్టీ మారాలి అనుకుంటున్న నేతలను నేరుగా చెప్పి ఆపకుండా ఈ దీక్ష ద్వారా నిలువరించడానికి.. నిస్తేజంలో ఉన్న పార్టీని పట్టాలెక్కించడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. తాను ప్రజా ప్రజాప్రస్థానంలో తన ఉనికిని చాటుకునేందుకు ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

  ఇప్పటికే వైసీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవడానికి ఈ ఘటనను అవకాశంగా తీసుకున్నారనేది చంద్రబాబు వ్యూహం. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్ని ప్రయత్నాలు చేపట్టినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సారి మాత్రం అధికార పార్టీని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఆ విషయంలో తగ్గేదేలే..! అంటున్న రోజా.., వివాదంలోకి పవన్ ను లాగిన బాలినేని..


  బీజేపీతో కలిసే ప్లాన్..?
  టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అలాగే చాలా కాలంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు కూడా యత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లి బీజేపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలివ్వనన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇన్నాళ్లూ వైసీపీ విషయంలో ఒకింత మెతక వైఖరి అవలంభించిన బీజేపీని ఈ ఘటన ద్వారా వెనక్కిలాగాలనేది బాబు ప్లాన్ గా తెలుస్తోంది.

  ఇది చదవండి: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..


  వైఎస్ఆర్సీపీ వ్యూహం ఇదేనా..?
  రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాల విషయంలో తప్పితే మిగిలిన అంశాల్లో ఒకింత విమర్శలపాలవుతోంది. అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్లకు బిల్లులు, రోడ్లు ఇలా పలు అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాలను ప్రతిపక్షం అవకాశంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నేతలే సీఎం జగన్ ను బూతులు తిట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీని మరింత దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. జనాగ్రహ దీక్ష పేరుతో ప్రజలే ప్రతిపక్షంపై తిరగబడుతున్నారన్న భావనను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రజల్లో తమ ప్రభుత్వంపై అభిమానం ఏమాత్రం సన్నగిల్లలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిమాణలపై జగన్ కూడా ముఖ్య నాయకులతో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి రెండు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ లో ప్రజలు ఎటువైపు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
  Published by:Purna Chandra
  First published: