Breaking News: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో జగన్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. అమరావతి కేసు విచారణ నుంచి వైదొలిగుతున్నట్టు సీజేఐ యూయూ లిలిత్ (CIJ UU Lalit) ప్రకటించారు. సీఐజే తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్ కు బదిలీ అయింది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని… వేరే బెంచ్ విచారణ వేయాలని సీజేఐ యూయూ లిలిత్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్ బదిలీ అయింది. అయితే మరో బెంచ్ కు బదిలీ చేసినంత వరకు.. కేసు లిఫ్ట్ అయ్యే అవకాశం లేదంటున్నారు.. అడ్వకేట్లు..
కోర్టు విచారణలో ఏం జరిగింది అంటే..?
ఇటు రాజధాని ప్రాంత రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ విముఖత చూపారు. దీంతో ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని రిజిస్ట్రీని ఆయన ఆదేశించారు.
అసలు పిటిషన్లు ఏంటంటే..?
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు 2 వేల పేజీలతో ఎస్‌ఎల్పీని ప్రభుత్వం దాఖలు చేసింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
రాజధాని అంశంలో ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అంటూ ఆ పిటిషిన్ లో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది.
ఇదీ చదవండి : ఆకతాయిల పనా? షార్ట్ వీడియోల కోసం చేశారా? కుట్ర ఉందా? శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
గతంలో హైకోర్టు చెప్పిన వాటిలో చాలా అంశాలు అమలు సాధ్యం కాదని పేర్కొంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. మరోవైపు రైతులు తమ పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని పేర్కొన్నారు. తీర్పులో ప్రస్తావించిన అంశాలతో పాటు తాము లేవనెత్తిన విషయాలు కూడా పొందుపరిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Supreme