Andhra Pradesh: పూజలు చేసే పూజారికి విగ్రహం.. ఏంటి ఆయన ప్రత్యేకత..? ఎక్కడో తెలుసా?

పురోహితుడికి విగ్రహం

విగ్రహాలకు పూజలు చేసే పొరోహితుడికే.. విగ్రహం కట్టారు.. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇలా గ్రామ ప్రజలు తమ అభిమానం చాటుకున్నారు. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడ ఉందా తెలుసా..?

 • Share this:
  ప్రస్తుతం పురోహితుడి పరిస్థితి దారుణంగా ఉంది.. అందరూ బాగుండాలి అని పూజలు చేసిన పురోహితుల పరిస్థితి రాను రాను ఇబ్బంది కరంగా మారుతోంది. ప్రస్తుతం ఆన్ లైన్ పూజలు, ఆన్ లైన్ పెళ్లిళ్ల ట్రెండ్ పెరుగుతోంది. కరోనా మహమ్మారి పురోహితులకు ఊహించని షాక్ ఇస్తోంది. చాలా వరకు పెళ్లిళ్లు.. పూజలు వాయిదాలు పడుతున్నాయి.. అందరి ఆదాయ మార్గాలు తగ్గడంతో.. పురోహితులకు ఇచ్చే సంభావన పై ప్రభావం పడుతోంది. అన్ని బాగా ఉన్ని రోజుల్లోనే పురోహితులు అంటే.. వారికి పెళ్లిళ్లు అవ్వడం కష్టంగా ఉండేది. అంతా ఉద్యోగస్తులను కోరుకునే వారు.. ఇప్పుడు కరోనా రూపంలో మరో దెబ్బ తగిలింది. దీంతో దేశ వ్యాప్తంగా పురోహితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పురోహితుడినే దేవుడిలా భావించి విగ్రహం పెట్టారు  గ్రామ ప్రజలు..

  పల్నాడు ప్రజలు మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో దాచుకుంటారు,వారు లేకున్నా వారి జ్ఞాపకాలు తలుచుకుంటు భావితరాలకు వారి ఔనత్యాన్ని తెలియ చేసేందుకు గ్రామాల్లా పట్టణాల్లో వారి విగ్రహాలు పెట్డుతుంటారు అలాగే పల్నాడు లో ఎక్కువగా బ్రహ్మనాయుడు, నాగమ్మ, కన్నమదాసు వంటి పల్నాటి వీరుల విగ్రహాలు దర్శనమిస్తాయి ..సాదారణం గా  దేశ నాయకుల విగ్రహాలు,రాజకీయ నాయకులు, ప్రముఖుల విగ్రహాలు పెట్టి గౌరవించటం చూస్తుంటాము కాని మాచర్ల మండలం కంభంపాడు గ్రామ ప్రధాన బురుజు వీధి,భొడ్రాయి బజార్ లో ఒక పౌరోహితుడికి విగ్రహం పెట్టి అయన పై ఉన్న ప్రేమ అభిమానాలను చాటుకున్నారు కంభపాడు గ్రామస్థులు

  ఆయన పేరు జక్కేపల్లి కృష్ణమూర్తి.. డబ్బు ఆశించకుండా పేద, ధనిక భేదం లేకుండా ఇచ్చిన సంభావన మాత్రమే తీసుకుని అనేక వందల మందికి వివాహాలు,ఇళ్ళ లో శుభకార్యాలు జరిపించేవారని .. ఒకప్పుడు బాగా ఆస్తులు ఉన్నా.. ధాన దర్మాలతో కాలక్రమేణా ఆస్తి కరిగిపోయిందని.. అయినా ఎప్పుడూ డబ్బు కోసం చూడక గ్రామస్తులకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేసేవారు.  ఎవరి ఇంటిలో శుభకార్యాలు ఉన్న నిర్వహించి వారి స్తోమతతో  ఒక్కరూపాయి,  కొబ్బరి చిప్ప ఇచ్చినా ఆనందంగా స్వీకరించేవారని అలా ఎంతోమంది చిన్న ధనిక పేద వర్గాలకి శుభకార్యమంటే ముందుగా గుర్తుకు వచ్చేది కృష్ణమూర్తి అయ్యగారే అని చెబుతుంటారు గ్రామస్తులు.

  అయన చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగాయని, ఎంతోమందికి  మంచి ముహుర్తాలు నిర్ణయించి పెళ్ళిళ్ళు చేసారని..  గ్రామ ప్రజల అందరి కి తలలో నాలుక లా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ కుల, మత భేదాలు చూపక అందరిని సమానంగా చూసేవారని అందుకే ఆయన ప్రస్తుతం లేకున్నా..  తమ గుండెలలోను, విగ్రహం రూపం లో కూడా పదిల పరిచామని అంటున్నారు. గ్రామానికి చెందిన కావూరి వంశస్తులు విగ్రహం నిర్మించినట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల ఆప్యాయతలకు ఔన్నత్యానికి చిహ్నంగా కృష్ణమూర్తి  విగ్రహాన్ని చెప్పొచ్చు..  

  తమ గ్రామంలో ఆయన చేతుల మీదుగా వివాహాలు జరిగిన వారు అంతా ఇప్పుడు సుఖసంతోషాలతో  ఉన్నారని వారి లోతానూ ఒకడినని కంభంపాడు గ్రామానికి చెందిన కొరటా వెంకటేశ్వర్లు అనే ఒక 80 సంవత్సరాల వృద్దుడు తెలిపారు. కృష్ణమూర్తి ఏదైనా దొంగిలింపబడిన వస్తువు లేదా తప్పిపోయిన గేదెలు తన అంజనం ద్వారా ఎటు ఉన్నాయో ఖచ్చితంగా తెలిపేవారని అంటున్నారు..
  Published by:Nagesh Paina
  First published: