హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: ప్రియురాలి మోజులో తండ్రి... నిత్యం ఆమెతోనే ఉండటాన్ని భరించలేని కొడుకు.. చివరకు ఏం చేశాడంటే..!

Extramarital Affair: ప్రియురాలి మోజులో తండ్రి... నిత్యం ఆమెతోనే ఉండటాన్ని భరించలేని కొడుకు.. చివరకు ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital Affair: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు నాశనమవుతుంటాయి. అయినవాళ్లు దూరమవడం తమను నిర్లక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు దారుణాలకు ఒడిగడుతుంటారు.

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు నాశనమవుతుంటాయి. అయినవాళ్లు దూరమవడం తమను నిర్లక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు దారుణాలకు ఒడిగడుతుంటారు. తన తండ్రి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, సంపాదించినదంతా ఆమెకే పెడుతుండటాన్ని జీర్ణించుకోలేను ఓ కొడుకు పక్కా ప్లాన్ తో తండ్రిని మర్డర్ చేయించాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వెంగమాంబ మల్లికార్డునరావు ఈనెల 7న హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారు. చివరకు హత్యతో సంబంధమున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. కన్నకొడుకే తండ్రిని హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. మల్లికార్జున రావు గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు పరిచమైన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ప్రియురాలిపై మోజులో ఎప్పుడూ ఆమెతోనే ఉంటున్న మల్లికార్జునరావు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు భావించారు. కుమారుడు సాయి కృష్ణ తన తండ్రి ఆస్తినంతా సంబంధం పెట్టుకున్న మహిళకే ధారపోస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు. పక్కా స్కెచ్ వేసి హంతకులను రంగంలోకి దించాడు. ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకొని హత్య చేయించాడు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు మల్లికార్జునరావుతో పరిచయమున్న వ్యక్తులు, బంధువులు, కుటుంబ సభ్యులను విచారించారు.

ఇది చదవండి: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్...? పిల్లలకు కరోనా పాజిటివ్.. ఎక్కడంటే..!


వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. హత్యకు కారణమైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, రాడ్లతో పాటు ఓ బైక్, ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ లో 350 మంది అమ్మాయిలకు వల… క్లోజ్ గా చాట్ చేసి ముగ్గులోకి దించాడు.. ఆ తర్వాత...


ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు చాలానే వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లాలో భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించి దొరికిపోయింది. అలాగే గుంటూరు జిల్లా యడ్లపాడులో పెళ్లైన 11నెలలకే భార్య ప్రియుడితో వెళ్లిపోగా భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత భార్య ఆత్మహత్య చేసుకుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న భార్య.. సొంత మరిది సాయంతో భర్తను హత్య చేయించింది. తాత్కాలిక సుఖాల కోసం కుటుంబ సంబధాలను విచ్ఛిన్నం చేసుకునే కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కన్నతండ్రిని కొడుకు హత్య చేయించడం సంచలనం సృష్టించింది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Son kills father

ఉత్తమ కథలు