Home /News /andhra-pradesh /

GUNTUR SOFTWARE ENGINEER TURNED FARMER IS GOT SUCCESS IN ORGANIC FARMING IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAIL HERE PRN GNT

Software Farmer: అమెరికా వదిలి ఆంధ్రాలో వ్యవసాయం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ..

యజ్ఞనారాయణ (ఫైల్)

యజ్ఞనారాయణ (ఫైల్)

వ్యవసాయం (Agriculture) మన సంస్కృతి, తరతరాలుగా మన జీవన విధానంలో భాగమైంది. హరిత విప్లవం తర్వాత మన సేద్య విధానంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. హైబ్రీడ్ విత్తనాలు, రసాయనాలు పుడమితల్లిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆలస్యంగా గుర్తించిన రైతాంగం, తిరిగి ప్రకృతి సేద్య విధానాలను (Organic Farming) ఆచరిస్తూ... దేశీ విత్తన రకాల సాగుకు మొగ్గుచూపుతున్నారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  వ్యవసాయం (Agriculture) మన సంస్కృతి, తరతరాలుగా మన జీవన విధానంలో భాగమైంది. హరిత విప్లవం తర్వాత మన సేద్య విధానంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. హైబ్రీడ్ విత్తనాలు, రసాయనాలు పుడమితల్లిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆలస్యంగా గుర్తించిన రైతాంగం, తిరిగి ప్రకృతి సేద్య విధానాలను (Organic Farming) ఆచరిస్తూ... దేశీ విత్తన రకాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. దేశీరకాల విత్తన అభివృద్ధితోపాటు.. వీటి ప్రత్యేకతను తోటి రైతులకూ తెలియజేస్తూ, సాగు దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ వ్యవసాయంలో మార్పులను తీసుకువస్తోంది. సేంద్రీయ ఆహారపు ఉత్పత్తుల పట్ల నానాటికీ పెరుగుతున్న ఆదరణ రైతులను సాగు పంథా మార్చుకునేలా చేస్తోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడకుండా. ప్రకృతి సిద్ధమైన సేంద్రీయ ఎరువులు, కషాయాలను సొంతంగా తయారుచేసుకొని, అటు సాగుఖర్చులను అదుపులో ఉంచుకుంటూ ఇటు రసాయన రహిత పంటలు పండించుకుంటున్నారు.

  అలా పండించిన ఉత్పత్తులను సైతం, సొంతంగా మార్కెట్‌ చేసుకునేవారే రెండు విధాలా లాభపడుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లాకు (Guntur District) చందిన దండే యజ్ఞనారాయణ. ఆయన చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అయితే దానితో తృపి చెందక తరతరాలు నుంచి వస్తున్న వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు. నిజాంపట్నం పంచాయితి లోని గోకర్ణ మాఠానికి చెందిన దండే యజ్ఞనారాయణ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వ్యవసాయం మీద మక్కువ తో స్వదేశానికి వచ్చాడు. అందరిలా కాకుండా భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా క్రిమి సంహరక మందులు లేని పంటలు సాగు చేయాలని నిర్ణయించారు.

  ఇది చదవండి: రైతుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఏడాది ఆదాయం ఎంతో తెలుసా..?


  అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రాంతం నుంచి వరి వంగడాలను తీసుకొచ్చాడు. తనకున్న ఎకరం పొలంలో సగం కాలబట్టి, మరో ఆర ఎకరంలో కర్పూర కామిని వరిసాగుకు శ్రీకారం చుట్టాడు. ఒక్కో రకాన్ని మీటరు వెడల్పు, 40మీటర్ల పొడవుతో మడులు చేసి, సాగు చేశారు. ఒక రకానికీ మరో రకానికీ మధ్య 2 అడుగుల దూరం వదిలాడు. ప్రతి 15రోజులకు ఒకసారి గో మూత్రాన్ని నీటిలో పారించటంతో పాటు, పైరుపైన కూడా పిచికారీ చేస్తుంటాడు. చీడపీడలను గమనించుకుంటూ వాటిని నివారించడానికి కషాయాలను పిచికారీ చేస్తుంటాడు.

  ఇది చదవండి: సిలికాన్ వ్యాలీ వదిలి సేంద్రీయ వ్యవసాయం.. ఈ దంపతుల సంపాదన ఎంతంటే..!


  ఈ వరి రకానికి పెట్టుబడి చాలా తక్కువని యజ్ఞ నారాయణ చెబుతున్నాడు. తాను సాగుచేసే పంటకు ఎకరానికి రూ.12వేలు మాత్రమే ఖర్చవుతాయని.. సాధారణ సేద్యానికి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుందని తెలిపాడు. ఈ వరిరకం ఐదు నెలలకు దిగుబడి వస్తుందని అది కూడా ఎకరానికి 30 బస్తాల వరకు వస్తుందని వెల్లడించాడు. ఈ వరి రకానికి మరొక ప్రత్యేకం ఏమిటి అంటే వర్షాలు కురిసినా గింజ పాడు ఆవుకుండా ఉండటం, పంట నేలకు ఒరగ కుండా ఉండటం దీని ప్రత్యేకతగా వివరించాడు.

  ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!


  ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న తాను ఉద్యోగం కంటే సేంద్రీయ వ్యవసాయాన్నే ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. అవసరమైతే జాబ్ అయినా వదులుకుంటాను కానీ వ్యవసాయం వదులుకోను అంటున్నాడు. అధిక దిగుబడుల లక్ష్యంతో సాగుతున్న నేటి వ్యవసాయంలో ఉత్పత్తులు విషపూరితంగా మారుతున్న వేళ, రైతుల బాట సేంద్రీయ బాటే కావాలంటాడు నారాయణ.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Organic Farming

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు