హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Success Story: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!

Success Story: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!

లస్సీ

లస్సీ వ్యాపారంలో రాణిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Guntur: సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మించిన జాబ్‌ లేదని ప్రస్తుత యువత ఆలోచన. చదువు అయిపోగానే ఐదెంకల జీతం. వారానికి రెండు రోజులు సెలవులు. ఐదేళ్లు తిరిగేసరికి లక్షల్లో జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం ఎవరు కాదంటారు చెప్పండి.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  సాఫ్ట్ వేర్ ఉద్యోగాని (Soft Ware Job) కి మించిన జాబ్‌ లేదని ప్రస్తుత యువత ఆలోచన. చదువు అయిపోగానే ఐదెంకల జీతం. వారానికి రెండు రోజులు సెలవులు. ఐదేళ్లు తిరిగేసరికి లక్షల్లో జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం ఎవరు కాదంటారు చెప్పండి. అలా అందరిలానే అనుకుని ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాడు గుంటూరు కుర్రాడు. ఇంక లైఫ్‌ సెటిల్‌ అయినట్లే ననుకున్నాడు..కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మెకానికల్‌ లైఫ్‌కి తాను జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఫీల్‌ అయ్యాడు. ఇంక ఈ యాంత్రిక జీవితానికి గుడ్‌ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనుకుని రిజైన్‌ చేశాడు. కొత్తగా జీవిత ప్రయాణం మొదలుపెట్టాడు..ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడి విజయగాథ ఏంటో తెలుసుకుందాం..!

  గుంటూరు (Guntur) కు చెందిన తపస్వీ(29) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే బ్రాండ్‌ తనకు వద్దని.. తానే ఒక బ్రాండ్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న క్షణమే తన ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరు వచ్చాడు. చిన్ననాటి నుంచి తనకెంతో ఇష్టమైన ఫుడ్‌ బిజినెస్‌లో అడుగుపెట్టాడు.

  ఇది చదవండి: ఆన్ లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నా ఆదాయం సున్నా.. డెలివరీ బాయ్స్ లైఫ్ ఎంత కష్టమో చూడండి..!


  తపస్వి చిన్నతనం నుండే ట్రావెల్ ఫ్రీక్ మరియు ఫుడ్ లవర్. దేశంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో దొరికే ఫుడ్‌ని ఫుడ్ నీ టెస్ట్ చేయటం తపస్వీకి అలవాటు. తపస్వీకి ఎంతో ఇష్టమైన షరబత్‌లన్నీ దేశంలోని వేరే వేరే ప్రాంతాల్లో దొరుకుతాయి. అయితే వాటన్నీని ఒకే చోట అందుబాటులో ఉంచేలా ఒక స్టాల్‌ పెడితే ఎలా ఉంటుందని అనే ఆలోచనతో మొదలైందే దేశీ లస్సీ.

  ఇది చదవండి: మీకు హిందీ రాయడం, మాట్లాడటం వచ్చా..! ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే..!


  అయితే ఈ ఫుడ్ బిజినెస్‌ మీద తనకు అవగాహన లేకపోవటంతో ఒక ఫేమస్ బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకొని దానిని సక్సెస్ ఫుల్‌గా రన్ చేసి ఫుడ్ బిజినెస్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన ఆలోచనలకు తగ్గట్టుగా, అభిరుచికి తగ్గట్టుగా ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాడు. అదే దేశీ లస్సీ.

  ఇది చదవండి: తొలి పండగతో వన్ గ్రామ్ గోల్డ్‌కి పెరిగిన క్రేజీ..! కళ్లు చెదిరే డిజైన్స్‌కు మహిళలు ఫిదా..!


  దేశీ లస్సీ అనే పేరుతో నాలుగేళ్ల క్రితం ఓ స్టాల్‌ను ఓపెన్ చేశాడు. దేశంలో లభించే అన్ని రకాల షర్బత్‌లు, షేక్స్‌, కాక్‌టైల్స్‌, లస్సీ లాంటి పానీయాలు ఇక్కడ దొరుకుతాయి. డిఫరెంట్‌ టేస్ట్‌ ఉండే మిల్క్‌ షేక్స్‌, లస్సీలను గుంటూరు వాసులకు రుచి చూపిస్తున్నాడు. ఈ దేశీ లస్సీ షాపులో క్లాసిక్‌ షేక్స్‌, ఓరియో షేక్స్‌, ఫ్రూట్‌, చాక్లెట్‌, డ్రైఫ్రూట్‌ షేక్స్‌, కారెమిల్‌ షేక్స్‌ (Caramel shakes) అందుబాటులో ఉంటాయి. కాఫీలోనూ ఐదారు రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరికే రకరకాల మాక్‌టైల్స్‌ గుంటూరు వాసులను కట్టిపడేస్తున్నాయి.

  ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్


  ముఖ్యంగా ఇందులో దొరికే లస్సీ టేస్టే వేరే లేవల్‌. మనకు సాధారణంగా ఒకరకమైన లస్సీ మాత్రమే మహా అయితే ఐదు ఆరు రకాల లస్సీలను టేస్ట్‌ చేసి ఉంటాం. కానీ ఇక్కడ దాదాపు 18 రకాల లస్సీలు అందుబాటులో ఉంటాయి. మాంగో, కివి, బ్లూ బెర్రీ, గ్రీన్‌ యాపీల్‌, బ్లాక్‌ కరెంట్‌, బటర్‌స్కాచ్‌, చాక్లెట్‌.. ఇలా ఎన్నో రకాల ఫ్లేవర్స్‌తో ఎవరికి నచ్చిన టేస్టును బట్టి వాళ్లు లస్సీని ఎంజాయ్‌ చేయొచ్చు. ఈ దేశీ లస్సీ స్టాల్‌లో రూ.50 నుంచి మొదలు రూ.180ల వరకు మనకు షేక్స్‌, లస్సీలు దొరుకుతాయి. ఏ మాక్‌ టైల్ అయినా రూ.90లు మాత్రమే. అంతేకాదు ఏ థిక్‌ షేక్‌ అయినా రూ.180లకు ఇక్కడ దొరుకుతుందని తపస్వీ తెలిపారు.

  ఇది చదవండి: కోళ్లు పడుతున్న లంబోదరుడు... కోడి పిల్లలను పడుతున్న మూషికాలు..!ఈ వెరైటీ వినాయకుడిని చూశారా..?


  గుంటూరు వాసులకు ముఖ్యంగా ఫుడ్‌ లవర్స్‌కు దేశీ లస్సీ ఒక వరంలా మారింది. ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్ చేస్తూ తామెంతో ఇష్టపడే మాక్‌టైల్స్‌ను, మిల్క్‌ షేక్స్‌ను ఎంజాయ్‌ చేయోచ్చు. సాయంత్రం అయితే చాలు విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్‌, యువత ఇక్కడ వాలిపోతుంటారు. వీకెండ్స్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల నుంచి అంతగా డిమాండ్‌ ఉండటంతో మరో మూడు చోట్ల ఈ బ్రాంచ్‌లను ఓపెన్‌ చేసినట్లు తపస్వీ చెబుతున్నాడు. తన కాళ్లపై నిలబడటమే కాదు మరికొందరికి ఉపాధి ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నాడు తపస్వీ.

  అడ్రస్‌ : రామచంద్ర బ్రదర్స్‌ ఎదురుగా, లక్ష్మీపురం మెయిన్‌ రోడ్‌, గుంటూరు, ఆంధ్రప్రదేశ్- 522007.

  ఫోన్‌ నెంబర్‌ : +91 90520 52777

  Guntur Desi Shakes Map

  ఎలా వెళ్లాలి?

  గుంటూరు బస్టాండ్‌ నుంచి లక్ష్మీపురానికి బస్సు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు