చాలా మందికి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. దొడ్డిదారిలో సంపాదించి రాత్రికి రాత్రే రిచ్ గా మారిపోవాలని కలలుగంటారు. మరికొందరు కష్టపడి సంపాదించాలని భావిస్తారు. ఓ కుర్రాళ్ల బ్యాచ్ మాత్రం ఎక్కడ నేర్చుకుందో ఏమోగానీ ఇంట్లో కలర్ జిరాక్స్ మెషిన్ పెట్టుకొని కాసుల దందా స్టార్ట్ చేశారు. పండగ సమయం తమ దొంగవ్యాపారం హాయిగా జరిగిపోతుందని భావించారు. కానీ పోలీసులకు చిక్కి లాకప్ లో కాలం గడుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రేదశ్ లోని గుంటూరు జిల్లా మేడికొండూలు మండలం కేంద్రంలో దొంగనోట్ల ముఠా వెలుగు చూసింది. ఓ దుకాణంలోకి వెళ్లిన నలుగురు యువకులు వస్తువులు కొనుగోలు చేసి తమ దగ్గరున్న దొంగనోట్లను చలామణీ చేసేందుకు యత్నించారు. ఐతే యజమానికి అనుమానం రావడం, పోలీసులు వచ్చి వారిని పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి.
అదుపులోకి తీసుకున్న యువకులను ప్రశ్నించగా పోలీసులకు దితిరిగే నిజాలు తెలిశాయి. ఆరుగులు యువకులు ముఠాగా ఏర్పడి ఇంట్లోనే కలర్ జిరాక్స్ మెషిన్ పెట్టుకొని దొంగనోట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ఇప్పటికే కొంత నగదును చలామణి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల వద్ద నుంచి నాలుగు లక్షలు విలువ చేసే దొంగనోట్లు, కలర్ జిరాక్స్ మెషిన్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కృష్ణాజిల్లా పెడన పట్టణంలో దొంగనోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరభద్రపురంకు చెందిన కాసా నాగరాజు అతని కుమారుడు దొంగనోట్లు తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు దొంగనోట్లు ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శనివారం అర్ధరాత్రి కాసా నాగారాజు ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. అతడి ఇంట్లో కలర్ జిరాక్స్ మిషన్, కటింగ్ మిషన్, ల్యాప్ టాప్, రూ.4లక్షల విలువ గల దొంగనోట్లు, రూ.37వేలు అసలు కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
లక్షకు నాలుగు లక్షలు..
నకిలీ నోట్లు చెలామణీ చేసేందుకు తండ్రీకొడుకులు కొందరికి కమీషన్ పై ఇస్తున్నారు. లక్షకు నాలుగు లక్షల నకిలోట్లు ఇస్తున్నారు. రూ.40వేలు అసలు నగదు ఇస్తే.. అందుకు లక్ష విలువ చేసే నోట్లు ఇస్తున్నారు. నకిలీ నోట్లు చెలామణీ చేసేందుకు వీరికి సహకరించిన తాళ్ల నాగేశ్వరరావు, కాసా శివరాజు, వీణం వెంకన్న, వాసా రాజశేఖర్, బొప్పి సాయికుమార్, బట్ట పైడేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. సిద్ధాని పెద్దిరాడులు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఐతే పట్టణంలో ఓ చోట పేకాటాడుతున్న సందర్భంగా నకిలీ నోట్లను గుర్తించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.