• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • GUNTUR SENSATIONAL FACTS BEHIND SI SRAVANI SUICIDE CASE IN CHUNDUR POLICE STATION OF GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: మహిళా ఎస్సై ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు… అంతా సీఐనే చేశాడా..?

Andhra Pradesh: మహిళా ఎస్సై ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు… అంతా సీఐనే చేశాడా..?

ఎస్సై శ్రావణి (ఫైల్)

ఎస్సై శ్రావణి ఆత్మహత్యకు కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధమే (Extramarital Affair) కారణమన్న ప్రచారం జరిగింది. ఐతే దీని వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూలు ఎస్సై పిల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధమే కారణమని ప్రచారం జరిగినా.., అసలు కారణం వేరే ఉందని దర్యాప్తులో తేలుతోంది. మహిళా ఎస్సైపై అసత్య ప్రచారం చేయడం వల్లే బలన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.., ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పిల్లి శ్రావణి.. 2018లో ఎస్సైగా పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించారు. తొలుత గుంటూరు జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశారు. అక్కడి నుంచి ఏడు నెలల క్రితం చుండూరు ఎస్సైగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఆమెతో పాటు అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవీంద్ర కూల్ డ్రింక్ లో కలుపు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

    ఐతే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా కానిస్టేబుల్ తో ఉన్న వివాహేతర సంబంధమే కారణమన్న ప్రచారం జరిగింది. చుండూరు సీఐ రమేష్ బాబు వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రావణి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే ఉంది. ఎన్నికల సమయంలో నమోదైన కొన్ని కేసులకు సంబంధించి సీఐ తనపై రిట్ పిటిషన్లు వేయించడంతో పాటు కానిస్టేబుల్ తో అక్రమ సంబంధముందని అసత్య ప్రచారం చేయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎస్పీ దగ్గర చెప్పి చర్యలసు సిఫార్సు చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే స్టేషన్ లో శ్రావణికి అనుకూలంగా ఉండే సిబ్బందితో పాటు తనకు కూడా మెమోలు ఇవ్వడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే లంచాలు తీసుకుంటున్నట్లు పై అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది.


    ఎస్సైగా డ్యూటీలో చేరినప్పటి నుంచి తప్పుని సహించని వ్యక్తిగా శ్రావణికి పేరుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆమెపై ఎస్ఈసీకి, కోర్టులకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే కొద్దిరోజులుగా శ్రావణికి, సీఐ సురేష్ బాబుకు మధ్య వివాదం నడుస్తోంది. ఇద్దరు పరస్పరం వాదులాడుకునేవారన్న ప్రచారముంది. స్టేషన్లో పనిచేసే సిబ్బంది కూడా ఈ విషయాన్ని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీఐ రమేష్ బాబును వీఆర్ కు పంపినట్లు తెలుస్తోంది. అలాగే సీఐకి సహకరించిన గురవయ్యే అనే వ్యక్తి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

    ఇది చదవండి: కరోనాను గెలిచి బిడ్డకు జన్మనిచ్చింది.. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.. ఇది మాటలకందని విషాదం..

    Published by:Purna Chandra
    First published: