హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Inspiration: 50 ఏళ్లు కష్టపడి సంపాదించారు.. జీజీహెచ్ కు యావదాస్థి రాసిచ్చిన వైద్యురాలు.. ఎంతో తెలిస్తే షాక్

Inspiration: 50 ఏళ్లు కష్టపడి సంపాదించారు.. జీజీహెచ్ కు యావదాస్థి రాసిచ్చిన వైద్యురాలు.. ఎంతో తెలిస్తే షాక్

వైద్యురాలి ఔదార్యం

వైద్యురాలి ఔదార్యం

Inspiration: డబ్బు డబ్బు.. ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతోంది. సంపాదన కోసం ఏం చేయాడానికైనావెనుకాడరు.. ఆస్థి కోసం హత్యలు చేయడానికి.. కుట్రలు చేయడానికి కూడా బరి తెగిస్తున్న రోజులు ఇవి.. కానీ ఇలాంటి రోజుల్లో ఓ మహిళా వైద్యురాలు.. ఔదార్యం చూసి.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని జీజీహెచ్ కు రాసి ఇచ్చేసింది వైద్యురాలు.. ఎంతో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Inspiration: డబ్బుకు లోకం దాసోహం.. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. ఆస్తి లేని వారిని సొంత వాళ్లు కూడా పట్టించుకోరు.. ఆస్థి ఉంటే అందరూ బెల్లంపై ఈగల్లో ముసురుతారు.. లేదంటే మనుషుల్లా కూడా ట్రీట్ చేయరు. అందుకే ఆస్థి కోసం అంతా ఆరాటపడుతుంటారు. ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయినవారికి కూడా దూరం అవుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అంతెందుకు చేతిలో లక్ష రూపాయలు ఉన్నా.. పది రూపాయలు సాయం కావాలి అని అడిగినా లేవు అని చెప్పే రోజులు.. డబ్బు పేరు చెబితే ఎక్కడ లేని స్వార్థం బయటపడుతుంది. ఇలాంటి రోజుల్లో కూడా.. ఓ వైద్యు రాలు గొప్ప ఔదార్యం చూపించింది. అమెరికా (America) లో స్థిరపడిన గుంటూరు (Guntur) కు చెందిన వైద్యురాలు  ఉమా గవిని (Doctor Uma Gavini).. తనకున్న 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్‌కు దానం చేశారు.. తన కోసం చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగ్చుకోకుండా.. మొత్తం తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌ (GGH)కు ఇచ్చేశారు..

  తన పేరుపై ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆస్పత్రికి రాసి ఇచ్చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా.. అమెరికాలో స్థిరపడ్డారు.. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న ఆమె.. గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ పూర్తి చేశారు.. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు.

  అంతేకాదు.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు.. డల్లాస్‌ వేదికగా గత నెలలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఉమ.. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. కనీస బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా తన వద్ద లేకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని.. ఆమె ఆస్పత్రికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

  ఇదీ చదవండి : మీరు మారిపోయారు.. అవును నిజమే.. ఆయన ఈయనేనా అంటూ ఆశ్చర్యం..

  2008లో వైద్యురాలైన ఉమ ‘జింకానా’ అధ్యక్షురాలిగా పనిచేశారు.. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు పేర్కొన్నారు.. కానీ, ఆ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చినట్టు సమాచారం. దీంతో, ఆమె భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు వైద్యులు.. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటి్‌స్టగా సేవలు అందించిన కానూరి రామచంద్రరావు.. మూడేళ్ల కిందట ప్రాణాలు విడిచారు.. ఆమెకు వారసులు కూడా లేరు.. దీంతో డాక్టర్‌ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. కొంతమంది ఇలా దానాలు చేస్తుంటారు. అయితే అందులో ఎక్కువంది 50 శాతం లేదా..? ఎంతోకొంత ఇస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం యావదాస్తిని మొత్తం దానం చేసి వార్తల్లో నిలిచారు. ఇక, ఆమె నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, HUMAN STORY

  ఉత్తమ కథలు