Balakrishna Warning: ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఆహా టాక్ షో రికార్డులతో ఫుల్ సందడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు కోపం వచ్చింది. సాధారణంగానే బాలయ్యకు కోపం ఎక్కువ.. అది ఒక్కోసారి హద్దులు దాటితే.. అభిమానికి సైతం చెంప చెల్లు మనిపించడం బాలయ్య స్టైల్.. అందుకే బాలయ్య సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోలాగే వ్యవహరిస్తారు. తాజాగా జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. గుంటూరు (Guntur) జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవంలో పాల్గొన్న బాలకృష్ణ (Balakrishna) చేతుల మీదుగా సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ రెడ్డికి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపీ రెడ్డి శ్రీనివాస రెడ్డికి వార్నింగ్ ఇవ్వడానికి అసలు కారణం ఏంటంటే.. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ సినిమా పాటల్ని పెట్టారు. ఆ పాటలు వస్తుండగా వాటిని ఆపేయాలంటూ నిర్వాహకుల్ని ఎమ్మెల్సీ ఆదేశించారు. అక్కడతోనే ఆగలేదు. ఆ పాట వేసిన కార్యకర్తపై చర్యలు కూడా తీసుకున్నారు.
నరసరావుపేటలో నా సినిమా పాట వేశారని వైసీపీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారు.రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శిస్తే నేను రెడీ,రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దు,సినిమాను సినిమాలాగా చూడాలి,సినిమాను అన్ని పార్టీల వారు చూస్తారు,అందరి సినిమాలు చూస్తారు- #NandamuriBalakrishna pic.twitter.com/JNV53FYr3O
— manabalayya.com (@manabalayya) March 15, 2023
దీంతో ఆ విషయం టీడీపీ నాయకులకు తెలిసింది. వారు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక కులం వారికోసమో, ఒక పార్టీ వారికోసమో సినిమాలు చేయట్లేదని, సినిమావాళ్లంతా ప్రజలందరి కోసమే నటిస్తారని క్లాస్ పీకరు. రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టొద్దని సూచించారు. రాజకీయాల్లో చూసుకుందాం రండి, సినిమాలపై మీ ప్రతాపమేంటి అని ప్రశ్నించారు.
చదువుకున్నవాడివి, ప్రజా సేవ చేయడానికి వచ్చావంటే ఎవరూ ఏమీ అనరు, కానీ సినిమాల విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోను అని హెచ్చరించారు బాలయ్య. తాను చిటికేస్తే చాలు అని.. మూడు కన్ను తెరిస్తే అంతే సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య డైలాగ్ కు అక్కడి ఫ్యాన్స్ మళ్లీ విజిల్ వేశారు.. మా బాలయ్య అంటే అది అంటూ ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు.. ఇటు టీడీపీ నేతలు సైతం మరి బాలయ్యతో పెట్టుకుంటే అంతే అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Balakrishna, Tollywood, Ycp