Sanjeevani Ki Gaadi: పల్లెపల్లెకు వ్యాక్సిన్.. అదే ‘సంజీవని గాడీ’ లక్ష్యం..

సంజీవని వాహనాన్ని ప్రారంభిస్తున్న గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ

సంజీవనీ గాడీ (Sanjeevani ki Gadi) పేరుతో ప్రారంభమైన వ్యాక్సిన్ అవగాహన రథం దేశ వ్యాప్తంగా సంచరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.

  • Share this:
    Anna Raghu, Guntur Correspondent, News18

    ప్రస్తుతం దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. ప్రతి రోజూ లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరైంది. ఐతే కరోనా నుంచి ప్రాణాలు కాపాడేందుకు వినియోగిస్తున్న వ్యాక్సిన్ పట్ల చాలా మందిలో ఆందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ తో వల్ల దుష్ప్రభావాలుంటాయనే అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ భయాలు, అసత్య ప్రచారాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రజల్లో ఉన్న అపోహల కారణంగానూ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా కనిపించడం లేదు.

    కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయం లో ప్రజలకు వ్యాక్సిన్ ఒక్కటే వారిని కరోనా నుండి రక్షిఇస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నేపథ్యంలో వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారికీ వ్యాక్సిన్ పై వారిలో చైతన్యం కల్పించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అంశాల్లో అవగాహన కల్పించుటకు నెట్ వర్క్-18 గ్రూప్ మరియు ఫెడరల్ బ్యాంకు సంయుక్తంగా సంజీవిని (వ్యాక్సిన్ అవగాహనా రథం )వాహనాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు. ఈ వాహనం గుంటూరు నుంచి బయలుదేరింది.

    గుంటూరు జిల్లా రూరల్ పోలీస్ కార్యాలయం నుండి సంజీవిని (వ్యాక్సిన్ అవగాహనా రథం ) వాహనాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ.., మాట్లాడుతూ సంజీవిని (వ్యాక్సిన్ అవగాహనా రథం )వాహనాన్ని ప్రారంభించి ప్రజలకు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలిగిస్తూ ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునే దిశగా ప్రోత్సహిస్తూ, వారికి అవగాహన కల్పిస్తున్న నెట్ వర్క్-18 బృందాన్ని అభినందించారు.

    నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సంయుక్త సహకారంలో భాగంగా ప్రారంభించి సంజీవని - ఎ షాట్ ఆఫ్ లైఫ్ అవగాహనా కార్యక్రమం మే 13న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోనూ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించేందుకు సంజీవని గాడీలు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రముఖ నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ వాహనం ‘సంజీవని ఎ షాట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ దత్తత తీసుకున్న 4,831 గ్రామాల్లో ప్రయాణించి అక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచనుంది. ఇందులో భాగంగా కరోనా కేసులు అధికంగా ఉన్న అమృత్ సర్, ఇండోర్, నాసిక్, గుంటూరు, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ముందుగా ప్రచారం చేయనుంది.

    ఈ వాహనం ఐదు జిల్లాలలోని 500 లకు పైగా గ్రామాలకు ప్రయాణించి, ప్రజల్లో COVID-19 వ్యాక్సిన్‌పై గల అపోహలను తొలగించి, దానిపై వారికి అవగాహన కలిగిస్తారు. అంతేకాకుండా COVID-19 భద్రతా నియమాలను అనుసరించడం గురించి కూడా గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. అదనంగా ఈ వాహనం సందర్శించిన తరువాతి రోజున ఆరోగ్య భాగస్వామి Apollo 247 మరియు NGO భాగస్వామి United Way Mumbaiతో కలిసి వ్యాక్సిన్ శిబిరాలకు కూడా ఏర్పాటు చేస్తుంది.
    Published by:Purna Chandra
    First published: