Andrha Pradesh: ఆక్సిజన్ అందిస్తున్న ఆపద్భాందవుడు. సెల్యూట్ సాంబయ్య అంటున్న జనం

కరోనా రోగులకు ఊపిరి పోస్తున్న సాంబయ్య

సంపాదన ఉంటే చాలాదు సాయం చేసే మనసు ఉండాలి. తను కష్టాల్లో ఉన్నా ఎదుటు వారికి సాయపడుతున్నాడు తాడేపల్లికి చెందిన సాంబయ్య అనే యువకుడు.. సొంత డబ్బులతో కరోనా రోగులకు ఇబ్బంది కలగకుండా వాహనంతో పాటు ఆక్సిజన్ ను అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. గతంతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో ఇటీవల ప్రాణాల పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లోనూ భయం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా చాలామంది ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నారు. కానీ అవసరానికి వాళ్లకు ఆక్సిజన్ దొరకడం లేదు. కానీ అలాంటి వారి కోసం నేను ఉన్నాను అంటూ ఔదార్యం చూపిస్తున్నాడు ఓ వ్యక్తి. కోవిద్ బాధితుల కు ఊపిరి ఉదుతూ..  వారి ప్రాణాలు నిలబెట్టే చిరు ప్రయత్నం చేస్తున్న సాంబయ్య ఎదరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

  ఏపీలో గత ఇరవై నాలుగు గంటలలో సుమారు ఇరవై నాలుగు వేళా మంది కి కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితి లో కోవిడ్వి బాధితులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. అత్యవసరం అంటూ ఆస్పత్రులకు వెళ్లినా అక్కడ ఆక్సిజన్ నిల్వలు లేవని.. బెడ్ దొరకలేదని తిరిగి ఇంటికి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది ఆస్పత్రి బయటే రోధిస్తూ కన్నుమూసిన సంఘటనలు చాలానే చూశాం.

  ఆక్సిజన్ అందక కొందరు ఇబ్బంది పడుతుంటే.. ఆక్సిజన్ ఉన్నా.. వెళ్లడానికి వాహనం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అని చెప్పి ప్రైవేటు వాహనాన్ని లేది ఆంబులెన్స్ ను ఆశ్రయిస్తే.. కాసుల కక్కుర్తితో  రోగుల రక్తం తాగేస్తున్నారు.  పది వేలకుపైగా ఖర్చు అవుతుోంది అంటూ భయపెడుతున్నారు. వాహనాలు దొరకక ప్రాణాలు విడిచిన  సంఘటనలు కూడా ఏపీలో నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కష్ట సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు తాడేపల్లి కి చెందిన జంగాల సాంబయ్య .

  తాడేపల్లి కి చెందిన జంగాల సాంబయ్య తన ఇంట్లో అందరికి కరోనా సోకింది. దీంతో వారి అవసరాలు తెలుసుకోగలిగాడు. కరోనా సోకిన వారి అవసరాలు గుర్తించగలిగాడు.  ముఖ్యంగా ఆక్సిజన్ తో కూడిన వాహనం లేకపోవడంతోనే ఎక్కువమంది ప్రాణాలు విడుస్తున్నారనే సంగతిని తెలుసుకున్నాడు. దీంతో అలా ఇబ్బంది పడుతున్నవారికి తన వంతు సాయం చేయాలని సంకల్సించాడు. వెంటనే సొంత డబ్బులు ఖర్చు చేసి.. తనదగ్గర ఉన్న వాహనానికి ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు.

  పేత మధ్య తరగతి ప్రజలకు ఎవరైనా అవసరం ఉందని ఫోన్ చేసినా.. వేరే ఎవరి ద్వారా తెలిసినా వెంటనే ఉచితంగా రోగులను ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు. గత కొన్ని రోజుల నుండి  తాడేపల్లి చుట్టుపక్కల గ్రామాలలోని  కరోనాతో బాధపడుతున్న రోగులను ఉచితంగా విజయవాడ గుంటూరు చిన కాకాని తాడేపల్లి లోని పలు ఆస్పత్రులకు తరలించాడు.

  ఆక్సిజన్ అవసరం ఇంకా పెరిగిందని గుర్తించి..  తన వద్ద వున్న డబ్బుతో రెండు ప్రాణవాయువు  సిలెండర్లను కొనుగోలు చేశాడు. రోగులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఎప్పుడూ వాటినిండా ప్రాణవాయువును నింపి.. కరోనా రోగులు ఏ సమయంలో సాయం కావాలని కోరినా వెంటనే స్పందిస్తూ సెల్యూట్ సాంబయ్య అనిపించుకునేలా చేస్తున్నాడు.  ఎవరైనా తనను ఫోన్ చేసి  సంప్రదిస్తే వారికి  ప్రాణవాయువును అందించి వారు కోరుకున్న ఆస్పత్రికి తరలిస్తున్నాడు సాంబయ్య.

  సాయం చేయాలి అంటే భారీగా సంపాదన అవసరం లేదని.. తన దగ్గర ఉన్నదినితో కష్టకాలంలో ఎదుటు వారికి సాయపడొచ్చని సాంబయ్య చేసి చూపిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో రక్త సంబంధీకులు, సన్నిహితులూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో తనకు సంబంధం లేని వారికి కూడా సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. తన కుటుంబసభ్యులు కరోనాతో బాధపడుతున్న మొక్కవోని ధైర్యంతో ఎంతోమందికి ప్రాణాలు పోస్తున్నాడు. సాంబయ్య చూపిస్తున్న ఓదర్యాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.  సాంబయ్యను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని ఆశిద్దాం.
  Published by:Nagesh Paina
  First published: