హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

గుంటూరు పోలీసుల వెరైటీ శిక్ష... దొరికితే అంతే...

గుంటూరు పోలీసుల వెరైటీ శిక్ష... దొరికితే అంతే...

గుంటూరులో పోలీసుల వెరైటీ శిక్ష

గుంటూరులో పోలీసుల వెరైటీ శిక్ష

ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు... కొన్ని చోట్ల వెరైటీ శిక్షలు వేస్తూ వాళ్ల మళ్లీ రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.

  గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు... కొన్ని చోట్ల వెరైటీ శిక్షలు వేస్తూ వాళ్ల మళ్లీ రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మేం తప్పు చేశాము అంటూ పలువురు వాహనదారులతో ఐదు వందల సార్లు పేపర్ మీద రాయించి శిక్షిస్తున్న పోలీసులు... తాజాగా ఓ శిక్షను అమలు చేస్తున్నారు. గుంటూరు రూరల్‌కు సంబంధించిన కొల్లూరు పోలీసులు ఈ రకమైన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భముగా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండ రోడ్ల పైకి వచ్చేవారికి ఈ రకమైన వినూత్న శిక్ష వేస్తున్నారు.

  “నేను మూర్ఖుడిని. నేను మాస్క్ పెట్టుకొను. పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను”. ఈ రకమైన కామెంట్స్‌తో ఓ బోర్డు ఏర్పాటు చేయించి దాన్ని సెల్ఫీ పాయింట్‌గా మార్చేశారు. ఎవరైతే అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారో వారిని ఇక్కడకు తీసుకొచ్చి సెల్ఫీ తీయిస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటోను వారి ఫోన్‌లో వాట్స్ యాప్ డిపిగా, తమ సొంత సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయిస్తూ వినూత్న శిక్ష విధిస్తున్నారు. ఈ రకంగా అయిన కొందరు మారతారని పోలీసులు భావిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, Coronavirus, Guntur

  ఉత్తమ కథలు