Home /News /andhra-pradesh /

GUNTUR ROAD ACCIDENT IN PRAKASAM DISTRICT ON EARLY MORNING 5 PEOPLE DEAD SAME FAMILY NGS

Road Accident: తెల్లారుతూనే ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: దైవ దర్శనానికి అని వెళ్తున్న వారిని విధి వెంటాడింది. పవిత్రమైన శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకుని వెళ్తుండగా.. ఊహించని ప్రమాదం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది..

 • News18 Telugu
 • Last Updated :
 • Prakasam, India
  Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక దగ్గర తెల్లవారు జామునే ఇలాంటి ప్రమాద వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) ని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తున్న భక్తులు దుర్మరణం పాలయ్యారు. శ్రావణ మాసంలో స్వామిని దర్శించుకోవాలని ఆశ పడితే.. తిరిగి రాని లోకాలకు వెళ్లారు.  ప్రకాశం జిల్లా (Prakasam District) లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్ లో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కంభం సమీపంలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున.. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టడమే ఈ ప్రమాదానికి కారణం..

  అతి వేగంగా వెళ్తున్న ఆ కారు.. ముందు ఉన్న లారీని గుర్తించి.. బ్రేక్ వేసే లోపే అదుపు తప్పి ఢీ కొట్టింది. అది వచ్చే వేగానికి కారు నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ఈ దుర్ఘటనలో మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. మృతులు 60 ఏళ్ల అనిమిరెడ్డి, 60 ఏళ్ల గురవమ్మ, 55 ఏళ్ల అనంతమ్మ, 58 ఆదిలక్ష్మి, 24 ఏళ్ల నాగిరెడ్డి ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  ఇదీ చదవండి : ఏపీ వాసులకు అలర్ట్.. నేడు రేపు భీకర వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?

  ఇటీవల కాలంలో ఏపీలో ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా.. అప్రమత్తత కనిపించడం లేదు.. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలకు మనుషుల నిర్లక్ష్యమే కారణం అవుతోంది. రోడ్డు కాస్త ఖాళీగా ఉందని.. అతి వేగంగా వెళ్తుండడమే ఎక్కువ ప్రమకాదాలకు కారణమని గణంకాలు చెబుతున్నాయి. తాజా ప్రమాదానికి కూడా ఈ అతి వేగమే కారణమంటున్నారు. అందులోనూ రాత్రి పూట ప్రయాణాలు అంటే.. డ్రైవర్లకు నిద్ర లేమి సమస్య ఉంటుంది. దూరంగా ఉన్న వాహనాలను గుర్తించడం కష్టమే.. అలాంటి టైంలో అతి వేగంగా వెళ్తే ప్రమాదాలు తప్పవు.. తెలిసినా కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదు..

  ఇదీ చదవండి : నేటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు..? ప్రత్యేకత ఏంటి? ఎందుకు నిర్వహిస్తారు..?

  ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో పెను విషాదం నెలకొంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ.. పూర్తిగా ఆ స్వామి చెంతకే చేరారా అంటూ బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Prakasam, Road accident, Tirumala

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు