హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Undavalli Sridevi: రెబల్ ఎమ్మెల్యే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి..? శ్రీదేవి రాజకీయ అడుగులు ఎటు..?

Undavalli Sridevi: రెబల్ ఎమ్మెల్యే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి..? శ్రీదేవి రాజకీయ అడుగులు ఎటు..?

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

Undavalli Sridevi: మొన్నటి వరకు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటోంది అన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు సీఎం జగన్ నె హెచ్చరించడం వెనుక రీజన్ ఏంటి.. ఇంతకీ ఆమె ఇస్తాను అంటున్న రిటన్ గిఫ్ట్ ఏంటి..? ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు పడనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Undavalli Sridevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLC Elections Result) చుట్టే తిరుగుతున్నాయి. క్రాస్ ఓటింగ్ వేశారు అనే అనుమానంతో వైసీపీ వేటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్య పైనే చర్చ జరుగుతోంది. అయితే అందులో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) ముగ్గురికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది. సొంతగా బలగం ఉంది. అవసరం అయితే వెంటనే నడిచే కార్యకర్తలు ఉన్నారు. కష్టపడితే పార్టీతో సంబంధం లేకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి రెండు నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుంది. కానీ ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) పరిస్థితి అందుకు భిన్నం.. తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే ఆమె తీరుపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఆమె ఉన్నది రాజధాని ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అందులోనూ గతంలో ఆమె రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ఏ విధంగా చూసిన ఆమెకు ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆమె ఎలా.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారనే చర్చ ఉంది. అయితే ఆమె మాత్రం తాను వ్యతిరేకంగా ఓటు వేయలేదు అను చెబుతూనే.. అధికార వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు.

తాజాగా ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనా, సజ్జల పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కొట్టిన దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇచ్చి తీరుతానంటూ శపథం చేశారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధం లేకపోవడంతో స్వతంత్రురాలినని ప్రకటించారు.

తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని వైఎస్ఆర్సీపీ గుండాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏమైనా మాఫియా డాన్‌నా అని నిల‌దీశారు. డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారో తెలుసని, వారి మాదిరిగా ఎమ్మెల్యే శ్రీదేవి చనిపోకూడదనే తాను ఇన్నాళ్లు బయటకు రాలేదన్నారు. తనకు ప్రమాదం ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే నియోజకవర్గానికి వస్తాను అన్నారు. దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆరోపించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్నటి వరకు పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం.. రాజధాని అమరావతి రైతుల తరపున మాట్లాడలేకపోయానని.. ఇప్పుడు తను స్వతంత్య్ర ఎమ్మెల్యేను కాబట్టి.. రాజధాని రైతుల తరపున పోరాడుతాను అన్నారు.

ఇదీ చదవండి సింహం ఒక్క అడుగు వెనక్కు వేస్తే ఓడినట్టా? దాన్ని కూడా చంద్రబాబు టచ్ చేయలేరన్న రోజా

ఇప్పుడు ఆ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. జగన్ కు ఆమె ఇస్తానన్న రిటన్ గిఫ్ట్ ఏంటి..? అంటే వేరే రాజకీయ పార్టీలో చేరి.. వైసీపీ ఓటమి కోసం పని చేస్తారా..? లేక ఆ సామాజిక వర్గాన్ని జగన్ కు వ్యతిరేకంగా పని చేసేలా కార్యచరణ రూపొందిస్తారా.. లేక రాజధాని ప్రాంత రైతులతో కలసి ఉద్యమం చేపడతరా..? మరో విషయం ఏంటేంటే.. వచ్చే ఎన్నికల్లో ఆమె టీడీపీలో చేరిన అక్కడ నుంచి సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ తరపున ఇప్పటికే బలమైన అభ్యర్థులు అక్కడ ఉన్నారు. దానికి తోడు రాజధాని రైతులంతా ఆమె వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు.. ఇలాంటి సమయంలో ఆమెకు టీడీపీ టికెట్టు ఇస్తుందని అంచనా వేయడం కష్టమే.. కానీ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని హామీ లభించినట్టు తెలుస్తోంది. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Vundavalli sridevi

ఉత్తమ కథలు