హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Covid Hospitals: కొవిడ్ టైమ్ లో క్యాష్ దందా.. లక్షలు పోసినా ప్రాణానికి నో గ్యారెంటీ..!

AP Covid Hospitals: కొవిడ్ టైమ్ లో క్యాష్ దందా.. లక్షలు పోసినా ప్రాణానికి నో గ్యారెంటీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రైవేట్ ఆస్పత్రుల (Private Hospitals) కాసుల దందా అంతా ఇంతా కాదు. కొవిడ్ పేరుతో లక్షలకు లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు.

  వైద్యో నారాయణోః హరిః అన్నారు పెద్దలు. అంటే ప్రాణం కాపాడే వైద్యుడు దేవుడితో సమానం. అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ కొందరు డాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి వైద్యుల పట్ల ప్రజలకు ఏహ్యభావం ఏర్పడేలా చేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనుమతులు లేకుండా కోవిడ్-19 వైద్యం చేస్తున్న పలు ప్రైవేటు హాస్పిటల్స్ పై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ మరియు వైద్యశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల అక్రమాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వైరస్ సోకిన వారికి చికిత్సచేయడం కొరకు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలతో పాటు పట్టణంలోని పలు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. ఐతే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయా హాస్పిటల్స్ నందు బెడ్ల కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన పట్టణంలోని కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు కరోన వైరస్ కంటే ప్రమాదకరంగా పరిణమించారు. వైరస్ బాధితుల వద్ద నుండి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. సరైన వసతులు లేక పోయినా బాధితుల భయాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుండి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు.

  కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి హాస్పిటల్ కు వెళ్తే... 1,50,000 నుండి 2,00,000 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్ ల మాట దేవుడెరుగు. వాటి పేరెత్తితే చాలు బెడ్లు ఖాళీ లేవు అని సింపుల్ గా సమాధానం వచ్చేస్తుంది. ఇక ఆక్సిజన్ బెడ్ కావాలంటే రోజుకు 25,000 నుండి 30,000 రూపాయలు వసూలుచేస్తున్నారు. అదీ సక్రమంగా అందిస్తున్నారా అంటే అదీలేదు. చికిత్స మధ్యలో హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయని మీకు ఆక్సీజన్ అవసరమైతే బయటి నుండి ఆక్సీజన్ సిలిండర్లు తెచ్చుకోవాలంటూ తెలియజేస్తున్నారు. అటువంటి వారికి కొందరు దళారులను వారే పరిచయం చేసి వారి ద్వారా హాస్పిటల్ యాజమాన్యాలే రోజుకు 5,000-1,0000 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆక్సీజన్ దోపిడీకి పాల్పడుతున్నారు.

  ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమా..? వణికిస్తున్న వైరస్


  వీటికి తోడు మందుల ఖర్ఛు అదనం

  అంతే కాకుండా కొందరు ప్రైవేటు వైద్యశాలల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న రెమిడిసీవర్ ఇంజక్షన్లను వారి సిబ్బందితో బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఎవరైనా రోగికి రెమిడిసీవర్ ఇంజక్షన్ అవసరమైతే తమ వద్ద అందుబాటులో లేవని, కావాలంటే బయట తెచ్చుకోమని సూచిస్తున్నారు.అలా బయటి నుండి తమ సొంత మనుషుల ద్వారా 3,500/- రూపాయల విలువచేసే ఒక్కో ఇంజక్షన్ కు 30,000 నుండి 40,000 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు హెచ్చరించినా లెక్కచేయకుండా కొందరు ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు తమ దోపిడీ దందాలను కొనసాగిస్తూనే ఉన్నాయి.

  ఇది చదవండి:  ప్రధాని మోదీ వద్దకు ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల పంచాయతీ... విద్యార్థులకు ఊరట లభిస్తుందా...?


  ప్రజలకు సమస్యలు లేకుండా హాస్పిటల్స్ వద్ద ప్రభుత్వం నియమించిన నోడల్ ఆఫీసర్ల జాడే కరువైందని, కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు సకాలంలో స్పందించి ప్రైవేటు హాస్పిటల్స్ పై మరిన్ని దాడులు నిర్వహించి దోపిడీ దందాలను ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona virus, Covid hospital

  ఉత్తమ కథలు