Home /News /andhra-pradesh /

Mobile Phone: మొబైల్ ఫోన్ పోయిందా..? వాట్సాప్ మెసేజ్ చేస్తే తెచ్చిస్తామంటున్న పోలీసులు.. అదెలాగంటే..!

Mobile Phone: మొబైల్ ఫోన్ పోయిందా..? వాట్సాప్ మెసేజ్ చేస్తే తెచ్చిస్తామంటున్న పోలీసులు.. అదెలాగంటే..!

ప్రకాశం జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం

ప్రకాశం జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం

పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడాల్సిందే. అలాంటి మీ చేతిలోని మొబైల్ పోతే అంతే సంగతులు. ఊపిరికూడా ఆడని పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham Distirict) పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  మొబైల్ ఫోన్ (Mobile Phone) చేతిలో లేనిదే రోజులు గడవని పరిస్థితి. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడాల్సిందే. అలాంటి మీ చేతిలోని మొబైల్ పోతే అంతే సంగతులు. ఊపిరికూడా ఆడని పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. మొబైల్ పొగొట్టుకున్న బాధితులు వాట్సాప్ (What’s App) ద్వారా కంప్లైంట్ చేస్తే చాలు.. ఇక మిగతా పనంతా పోలీసులే చూసుకుంటారు. ఇందుకు సంబంధించి ఎస్పీ మల్లికా గార్గ్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. .ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలిసిన అటువంటి ఫిర్యాదులను పోలీసులు తక్షణమే స్వీకరించి చేధించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫారం ఫిల్ చేసి రిసెప్షన్ కౌంటర్ లో ఇవ్వాలి. ప్రతిగా ఆ పిర్యాదుదారునికి పిర్యాదు స్వీకరించినట్లుగా రసీదు ఇస్తారు.

  అనంతరం పోలీసులు ఆ పిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆ వివరాలను IT core టీంకు పంపడం జరుగుతుంది. IT core లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అప్లికేషన్స్ ద్వార ఎప్పటికప్పుడు మొబైల్ ఫోనును ట్రేస్ చెయ్యడం జరుగుతుంది. దీని ద్వారా భాదితులకు వారి ఫోన్ వీలైనంత త్వరగా దొరుకుంతదని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని, ప్రకాశం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ముందుంటుందని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు.

  ఇది చదవండి: పెన్సిల్ పోయిందంటూ పోలీస్ కంప్లైంట్... తగ్గేదేలే.. అంటున్న బుడ్డోడు..!


  మొబైల్ పొగొట్టుకున్నవారు వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలతో కంప్లైంట్ ఫామ్ నింపడం లేదా.. పోలీస్ వాట్సాప్ నెంబర్ కు 9121102266 పిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇందులో బాధితుని పేరు, మొబైల్ నెంబర్, మొబైల్ కంపెనీ, మోడల్, IMEI నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

  ఇది చదవండి: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..


  కొన్ని ఉదాహరణలు...
  ఇటీవల ఒంగోలుకు చెందిన సర్వేపల్లి సుబ్బారావు మరియు తేళ్ళ నరేష్ అనే వ్యక్తులు మద్దిపాడు పోలీసు స్టేషను పరిధిలో వారి వ్యక్తిగత పనులలో నిమగ్నమై వారి శాంసంగ్ సెల్ ఫోనులు పోగొట్టుకున్నారు. వారి ఫోన్లలో విలువైన సమాచారం ఉండటం వల్ల వారు వెంటనే మద్దిపాడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి IT core సిబ్బంది సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ మొబైల్ ఫోనులను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Mobile, Prakasham dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు