Power Cuts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ కోతలు (Power Cuts) ఇప్పట్లో ఆగవా..? కానీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే మాత్రం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అని పదే పదే ప్రకటిస్తున్నారు. విద్యుత్ సమస్య (Power Crises) తీరిందని.. ఇక 24 గంటలూ అందరికీ విద్యుత్ అందుబాటులో ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు.. పరిశ్రమలకు పవర్ హాలిడేలు కూడా ఎత్తేశారు. బొగ్గు సమస్య కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించింది ప్రభుత్వం.. వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలు.. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే కూడా ఎత్తేసింది. అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మంత్రులు సైతం అదే మాట చెప్పారు. కర్ణాటక (Karnataka), కేరళ (Kerala)లో కురిసిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగిందని.. మెట్టూరు, భవానీసాగర్ తదితర జలాశయా్లో విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో ఇక పవర్ కట్స్ ఉండవని అంతా ఆశించారు.. కానీ అవన్నీ ఉత్తుత్తి మాటలేనా.. ఏపీలో విద్యుత్ సమస్యలు ఇంకా తీరలేదు.. అనడానికి పవన్ మీటింగ్ ఓ ఉదహరణ..
ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలపై జనసేన పార్టీ (Janasena Party) గత కొంతకాలంగా విమర్శలు చేస్తోంది. నిరసనలు చేపట్టింది. అయితే గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ కరెంటు కోతలకు బ్రేక్ పడడం లేదు. ఎక్కడో ఒకచోట అప్రకటిత కరెంటు కోతులు ఉండనే ఉంటున్నాయి. తాజాగా ఏపీలో జనసేన పార్టీ సమావేశం జరుగుతుండా కరెంటు పోయింది. మంగళగిరి (Magalagiri) లోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా ఇలా కరెంటు పోయింది.
Pawankalyan || Power cut during janasena chief pawan kalyan meeting with... https://t.co/xoiMXhCOML via @YouTube #Pawanakalyan #JanasenaParty #JanaSenaTelangana #JanasenaParty #JanasenaRythuBharosa #powercrisis @Powercut @tdptrending @JanaSenaParty
— nagesh paina (@PainaNagesh) May 22, 2022
దీంతో వెంటనే పపన్ పడి పడి నవ్వారు.. ఇదే ఏపీలో విద్యుత్ సరఫరా పరిస్థితి అంటూ గుర్తు చేశారు. సరిగ్గా ఏపీలో ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్న సమయంలోనే కరెండు సరఫరా నిలిచిపోయింది. దీంతో సత్యం అంటూ పవన్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఓ వైపు వైసీపీ పెద్దలు ఏపీలో విద్యుత్ సమస్యలు లేవంటున్నారు.. కానీ జనసేనాని సభ జరుగుతుండగా విద్యుత్ నిలిచిపోయింది చూడండి అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
నిన్ననే..చెంచలగూడ జైలు దత్తపుత్రుడు @ysjagan ఈరోజు నుంచి APలో కరెంటుకోతలుండవని చెప్పారు.ఆ మాటల్లో నిజములేదనీ 24గంటల్లోనే తేలిపోయింది. ఈరోజు మంగళగిరి @JanaSenaParty కార్యాలయంలో శ్రీ @PawanKalyan మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగ కరెంటుకోత. గాలి మాటలే కదా
@VSReddy_MP A2 గారు pic.twitter.com/gchq2tHaWv
— Kona Tatarao (@TataraoKona) May 20, 2022
విద్యుత్ సమస్యతో అయినా పవర్ నిలిచిపోయి ఉండాలి.. ఏపీ కరెంటు సమస్యలు లేవు అనుకుంటే పవన్ మీటింగ్ కు అంతరాయం కలిగించాలనే వైసీపీ నేతలు కావాలని.. మంగళగిరిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా పవర్ నిలిచిపోయినా పవన్ సమావేశం కొనసాగించారు. అందరూ ఫోన్ లైట్లు ఆన్ చేసుకుని సమావేశం కొనసాగించారు. పవన్ కల్యాణ్ కూడా తన స్మార్ట్ఫోన్ లైట్ ఆన్ చేసి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్లో షేర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Mangalagiri, Pawan kalyan, Power cuts, Power problems