Pulichinthala Project: పులిచింతలపై పొలిటికల్ ఫైటింగ్.., అసలు నిర్లక్ష్యం ఎవరిది..?

పులి చింతల ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్టుల్లో పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project) ఒకటి. ఇప్పుడీ పులిచింతల పొలిటికల్ ఫైటింగ్ కు వేదికైంది.

  • Share this:
    అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

    ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్టుల్లో పులిచింతల ప్రాజెక్టు ఒకటి. పులిచింతల బహుళార్ధకసాధక ప్రాజెక్ట్ కృష్ణాడెల్టా ప్రజల దశాబ్ధాల కల. ఎందరో ముఖ్యమంత్రులు పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రయత్నించినా 2004 తరువాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అప్పటి నుండి 2013 చివరి నాటికి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పూర్తిగా రూపు రేఖలు సంతరించుకుంది. అప్పటి నుంచి కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా పులిచింతలలో సామర్ధ్యం మేరకు నీటిని నిల్వ ఉంచి దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టుకు ఆయన మరణం తర్వాత వైఎస్ఆర్ పులిచింతల ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ప్రాజెక్టు నిర్మించిన ఘనత తమదేనని ప్రస్తుత అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. ఐతే ఇటీవల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

    ఐతే అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లనే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంటే.. గత ప్రభుత్వం అసమర్ధత వల్లనే కాంట్రాక్టర్ బొల్లినేని రామకృష్ణ నాశిరకంగా నిర్మించారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కడ ఏ తప్పు జరిగినా అది చంద్రబాబునాయుడి వల్లనే అంటూ అధికారపార్టీ ఎదురుదాడి చేయడం ఎంత వరకు సబబు..? ప్రతి విషయానికి ప్రతిపక్షాలమీద ఏదురు దాడి చేయడానికి అలవాటు పడ్డ అధికారపక్షం పులిచింతల గేటు ఊడిపోవటం కూడా చంద్రబాబు వల్లనే అని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలంటున్నారు.

    ఇది చదవండి: గంటన్నరలో హత్య, అత్యాచారం... తాడేపల్లి కేసులో సంచలన నిజాలు...



    పులిచింతల నిర్మాణం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. దాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్ ఎంపిక కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. మరలాంటప్పుడు ఇప్పటి తప్పిదానికి భాధ్యత వహించవలసింది ముమ్మాటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా..? అప్పట్లో వారి అసమర్ధత కారణంగానే కదా పులిచింతల నిర్మాణం నాసిరకంగా నిర్మించింది. మరలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పై గుడ్డకాల్చి వేయడం సరైంది కాదని ఆ పార్టీ వాదిస్తోంది.

    ఇది చదవండి: అతనికి 28, ఆమెకు 45.. ఇద్దరూ హోటల్లో రూమ్ తీసుకున్నారు.., ఆ తర్వాత ఏమైందంటే..!


    పులిచింతల వంటి భారీ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి అధికారులు వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఏమైనా లోపాలు ఉంటే సరిచేయవలసిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పులిచింతల ప్రాజెక్ట్ పటిష్టతకు తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా..? ప్రాజెక్ట్ నాణ్యత ,నిర్వాహణ లోపాలపై ధృష్టిపెట్టిన దాఖలాలేమైనా ఉన్నాయా..? వీటన్నిటినీ వదిలేసి తమ మీద ఎక్కడ నిందపడుతుందో అని ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం సబబు కాదని సీనియర్ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో పులిచింతల వంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published: