Home /News /andhra-pradesh /

GUNTUR POLICE HOME GUARD PROVIDING DRINKING WATER TO STRANGERS IN SUMMER FOR 18 YEARS IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH AND RECEIVED MANY AWARDS FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: సేవచేయాలంటే కోటీశ్వరులే కానక్కర్లేదు.. ఈయనలా మంచి మనసుంటే చాలు..

పోసీలు అధికారులతో సుభానీ (ఫైల్)

పోసీలు అధికారులతో సుభానీ (ఫైల్)

Guntur District: వేసవి కాలం వస్తే చాలు.. దాహం తీర్చే వారి కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఆ ప్రాంతంలో బాటసారులకు దాహం వేస్తే అందరూ అతడివైపు చూస్తారు.

    మయామవుతున్నా మానవ బంధాలకు ఆర్ధ్రత నిండిన చేతులతో నీటి వంతెన కడుతున్నాడు అతను. లాఠీ పట్టిన చేతిలోనే మానవత్వాన్ని ఉబికిస్తున్నాడు. హృదయరశ్మితో ప్రవహిస్తు దశాబ్దాన్నర కాలంగా సేవాధారను కురిపిస్తున్నాడు. అతని మనసు గొప్పతనంమ హా నిశ్శబ్దంగా అందరికీ స్పరింప చేస్తుంది. అతడే గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన హోగార్డు సుభాని. ఇప్పుడు జనంలో జలగీతంగా మారాడు. వేసవి వచ్చిందంటే ఇతనిలోని మానవనీయత చిగురులు వేస్తుంది. సెగలు చిమ్మేదారుల్లో.. మైలురాళ్ళను దాటే బాటసారులకు చల్లని పానీయమై సేదదీరుస్తుంది. దమ్మలపాడు అడ్డరోడ్డ దగ్గర తన ధార అమృతాన్ని ఏర్పాటు చేశారు. పచ్చని చెట్ల నీడలో దాహర్తిని తీర్చే ధారగా మొరుస్తున్నాడు. పోలీసు శాఖలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తునే.., వేసవిలో చల్లని చినుకై మానవనీయతను చాటుకున్నాడు. పదహరేళ్ళుగా"పానీ" ప్రస్ధానాన్ని కోనసాగిస్తూ అందరి అభీనందనలను అందుకున్నాడు. సత్తెనపల్లి నర్సారావు పేట రహదారి లో దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద ఆటోలు బస్సులు ఎక్కడనికి ఎంతో మంది ప్రయాణికులు మరియు పొలం పనులు చేసుకునే రైతులు రైతు కూలీలలకు వేసవి లో వారి ఇబ్బందిని గుర్తించాడు హొంగార్డు సుభాని.

    దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి దహర్తి తిరుస్తున్నాడు. చిరుద్యోగి యిన సుభానీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఉద్యోగ భాద్యతలు వేరే ప్రదేశంలో నిర్వహిస్తున్నా ఇక్కడ చలి వేంద్రాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. తను ఎక్కడ పనిచేస్తున్నా చలివేంద్రాన్ని మాత్రం ప్రతి వేసవిలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిర్వహిస్తూ ఎంతోమంది కి ఆధర్శంగా నిలిచాడు.
    సేవచేయటాని కోటీశ్వరులు కానక్కరలేదు మనసుంటే చాలని నిరూపించాడు.

    గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన సుభాని నిరుపేద కుటుంబం లో జన్మించి తన కుటుంబ పోషణకోసం పోలీస్ శాఖ లో హోంగార్డ్ గా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన విధినిర్వహణ లో భాగంగా తనపై అధికారుల కార్యాలయానికి వెళ్లి వస్తున్న తరుణం లో దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద తాగునీటి కోసం ప్రయాణికులు, రైతులు ఎంతో ఇబ్బంది పడటాన్ని గమనించిన సుభాని వారి వెతలు తీర్చటానికి ఏదోఒకటి చేయాలనే సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాల క్రితం మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజూ సైకిల్ పై క్యాన్ లతో నీటిని నింపుకొని చలివేంద్రంలోని కుండలను రోజుకు మూడుసార్లు నింపుతాడు. ఆలా మొదలైన తన చలివేంద్రా ప్రస్థానాన్ని ఇప్పటి కి కొనసాగిస్తూ ఎంతోమంది దాహార్తి తీరుస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని ఎంతోమందికి సుపూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. సుభానిని ఆదర్శంగా తీసుకొని సేవ చేసేందుకు ముందుకు రావాలని పలువురు సూచిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు