హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur GGH: జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం.. కిడ్నాపర్లు వీళ్లే.. ఎలా దొరికారంటే..!

Guntur GGH: జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం.. కిడ్నాపర్లు వీళ్లే.. ఎలా దొరికారంటే..!

గుంటూరు జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు క్షేమం

గుంటూరు జీజీహెచ్ లో కిడ్నాపైన పసికందు క్షేమం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన గుంటూరు జీజీహెచ్ (Guntur GGH)లో పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన గుంటూరు జీజీహెచ్ (Guntur GGH)లో పసికందు కిడ్నాప్ (Kidnap) కథ సుఖాంతమైంది. మూడు రోజుల మగ శిశువు శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో పసికందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేవలం రెండు గంటల్లోనే బాబు ఆచూకీ కనుగొన్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. జీజీహెచ్ లో వార్డుబాయ్ గా పనిచేసే హేమవరుణుడు బాబును ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అతడికి పద్మఅనే మహిళ సహకరించినట్లుగా తెలుస్తోంది. హేమవరుణుడు, పద్మకు వివాహేతర సంబంధం ఉంది. బాబును ఎత్తుకెళ్లి విక్రయించాలని ఇద్దరూ స్కెచ్ వేశారు. ఈక్రమంలో శుక్రవారం అర్ధరాత్రి బాబును ఎత్తుకెళ్లారు. గుంటూరు నగరంలోని నెహ్రూనగర్లో బాలుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.

అసలేం జరిగింది..?

గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ ఈనెల 11వ తేదీ రాత్రి కాన్పు కోసం జీజీహెచ్ లో చేరింది. ఈ నెల 13న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతో పాటు భర్త, అత్త, అమ్మ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బాబుకు పాలుపట్టించిన నానమ్మ... బాత్ రూమ్ కు వెళ్తూ.. అమ్మమ్మ పార్వతమ్మదగ్గర పడుకోబెట్టింది. ఆమె వచ్చి చూసేసరికి బిడ్డ కనపించలేదు. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఆస్పత్రి అధికారులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. బిడ్డను సచిలో పెట్టుకొని వెళ్తున్నట్లు గుర్తించారు. వారు వెళ్లిన మార్గంతో పాటు సిబ్బంది కూడా నిదింతులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా వార్డు బాయ్ బాబును ఎత్తుకెళ్లినట్లు తేలింది.


ఇది చదవండి: ఆమెపాలిట శాపంగా మారిన పవర్ కట్... ఆ నలుగుర్ని ఏంచేసినా పాపం లేదు..


గంటల్లోనే బాబు ఆచూకీ లభ్యం..

ఈ కేసులో పోలీసుల సమయస్ఫూర్తి, సాంకేతిక పరిజ్ఞానం వల్ల గంటల వ్యవధిలోనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలు నిందితులను పట్టించాయి. గంటల వ్యవధిలోనే బాబును తీసుకొచ్చిన పోలీసులకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల పసికందు కనిపించకుండా పోవడంతో అందరూ ఆందోళన చెందారు. ముఖ్యంగా తల్లి ప్రియాంక తల్లడిల్లిపోయింది. బాబు ఆచూకి తెలపాలంటూ అధికారులను వేడుకుంది. అటు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది చదవండి: అమెరికా అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్... కొన్నాళ్ల తర్వాత మనోడికి చుక్కలు చూపించింది...


ఐతే పోలీసులతో పాటు ఆస్పత్రి సిబ్బంది, బాబు బంధువులు గాలింపు చర్యలు చేపట్టడంతో వెంటనే గుర్తించగలిగారు. మొత్తానికి బాబు ఆచూకీ దొరకడంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. తొలుత బాబును వైద్యపరీక్షల కోసం వైద్యులకు అప్పగించిన పోలీసులు ఆ తర్పాత తల్లి చెంతకు చేర్చారు. నిందితులను విచారించి మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Kidnap

ఉత్తమ కథలు