ఒంటరిగా ఉన్నవారికి తోడు చాలా అవసరం. అదే భర్తను పొగొట్టుకొని, పిల్లలతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఆసరా కోరుకుంటారు. కానీ అలాంటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు మృగాళ్లు రెచ్చిపోతుంటారు. అలా భర్తను పొగొట్టుకొని ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మహిళపై కన్నేసిన ఓ కానిస్టేబుల్ ఆమెను జీవితంతో ఆడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని గుంటూరుకు (Guntur) చెందిన మహిళ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఓ మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఇక జీజీహెచ్ కు తరచూ వచ్చే ఓ పోలీస్ కానిస్టేబుల్ తో మహిళకు పరిచయమైంది. పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో తన కుటుంబానికి సంధించిన విషయాలు, కష్టాలు, బాధలు చెప్పుకుంది. ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి బలవంతంగా లోబరుచుకున్నాడు.
జరిగిన విషయం బటకు చెప్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. తనకు ఏమైనా ఐతే పిల్లలు ఒంటిరివాళ్లవుతారని భయపడిన బాధితురాలు మిన్నకుండిపోయింది. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్న కానిస్టేబుల్.. అతడి స్నేహితులను తీసుకొచ్చి ఆమె కుమార్తెపట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో ఎదురుతిరిగిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో మరోసారి ఇలా చేయనని ఆమెను నమ్మించి రెండేళ్ల క్రితం విజయవాడ తీసుకెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.
కొంతకాలం ఆమెతో సజావుగానే కాపురం చేసిన కానిస్టేబుల్ కొన్నిరోజుల తర్వాత తనలోని మృగాడ్ని బయటపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే హెచ్ఐవీ రోగులకు వాడిన సూదిని నీ పిల్లలకు గుచ్చుతానని బెదిరించడం, ఆమె కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఆమెను వేధిస్తున్నాడు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే తాను పోలీసునని.. ఎవరూ ఏమీ చేయరేని.. ఎక్కువ చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని మహిళ తన కుమార్తెతో కలిసి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
గతంలో విశాఖపట్నంకు (Visakhapatnam) చెందిన అప్పలరాజు సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అప్పలరాజుపై పద్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లిపేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అప్పలరాజుకు గతంలోనే సునీత అనే మహిళతో పెళ్లైందని.. మొదటి భార్య ఉండగానే 2008లో తనను రెండో పెళ్లి చేసుకున్నాడని పద్మ ఆరోపించారు. ఆ తర్వాత 2014లో స్వర్ణ మూడో పెళ్లి, 2018లో లావణ్య అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తనను మోసం చేసి నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ రెండో భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన కొడుకు స్నేహితుడైన బీటెక్ స్టూడెంట్ తో అక్రమ సంబంధం అంటగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.