Home /News /andhra-pradesh /

GUNTUR POLICE CONSTABLE CHEATED YOUNG WOMAN ON THE NAME OF LOVE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Love affair: కానిస్టేబుల్ ఆన్ లైన్ లవ్.. యువతిని ట్రాప్ చేసి చీటింగ్.. చివరికి ఇలా దొరికాడు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cheating: ప్రేమ, పెళ్లి అనే బంధాలు నమ్మకంపై నిలబడతాయి. నమ్మకం లేని చోట మంచి స్థాయి, బాగా డబ్బులున్నా పనిచేయవు. ఐతే బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, నలుగురికి మంచి చెప్పే ఉద్యోగాలు చేసేవారిని జనం ఇట్టే నమ్మేస్తారు. కానీ వాళ్లే నట్టేట ముంచుతుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Narasaraopet, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ప్రేమ, పెళ్లి అనే బంధాలు నమ్మకంపై నిలబడతాయి. నమ్మకం లేని చోట మంచి స్థాయి, బాగా డబ్బులున్నా పనిచేయవు. ఐతే బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, నలుగురికి మంచి చెప్పే ఉద్యోగాలు చేసేవారిని జనం ఇట్టే నమ్మేస్తారు. కానీ వాళ్లే నట్టేట ముంచుతుంటారు. అడ్డంగా మోసం చేసి చెక్కేస్తుంటారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఓయువతిని నమ్మించి గొంతుకోశాడో కానిస్టేబుల్. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palanadu District) నరసరావుపేటలో కానిస్టేబుల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం చేశాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీని స్పందనలో కోరింది. సోషల్ మీడియాలో పరిచయమై కానిస్టేబుల్ పెళ్లి చేసుకుంటానని ఐదు లక్షల కట్నం తీసుకొని మోసం చేశాడని యువతి ఆరోపిస్తుంది.

    సోమవారం స్పందనలో ఎస్పీకి యువతి ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి తెలంగాణ (Telangana) రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు నగదు తీసుకొని ఇప్పుడు మొహం చాటేశాడని యువతి ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకుంది.

    ఇది చదవండి: బుగ్గ కొరికాడని భర్తపై కేసు పెట్టిన భార్య.. ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగిందంటే..!


    గుంటూరు చెందిన రాజేష్ అనే వ్యక్తి సోషల్ మీడియో పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అని మాట దాటేస్తున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వస్తే కంప్లైంట్ వద్దని మాట్లాడుకుందామని చెప్పాడు. నమ్మి వాళ్లింటికి వెళ్లాను. అక్కడ నుంచి అతడు పారిపోయాడు. వాళ్ల నాన్న మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. సస్పండ్ చేస్తారు అంతే కాదా? అంటున్నారు. పెళ్లి మాత్రం చేయనని రాజేష్ తండ్రి అంటున్నారు. రాజేష్ పెళ్లి చేసేశామని చెబుతున్నారు.' అని బాధితురాలు వాపోయింది.


    ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.. ఆ తర్వాత ఊహించని స్కెచ్


    ఏడేళ్ల క్రితం తమకు సోషల్ మీడియాలో పరిచయమైందని.. తనతో మాటలు కలిపి, ప్రేమ పేరుతో నమ్మించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తమకు పరిచయం అయినప్పుడు రాజేష్ బీ టెక్ చదువుతున్నాడని.. ప్రస్తుతం నరసరావుపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ప్రేమ పేరుతో తనను నమ్మించడమే కాకుండా పెళ్లి చేసుకుంటానంటూ తల్లిదండ్రులను, మేనమామను కూడా ఇంటికి తీసుకొచ్చడాని.. ఇప్పుడు రూ.5లక్షలు తీసుకొని మాట మార్చాడని.. తనకు న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ.. దర్యాప్తు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Love cheating

    తదుపరి వార్తలు