Home /News /andhra-pradesh /

GUNTUR POLICE CAUGHT ONE OF THE ACCUSED IN TADEPALLI GANG RAPE CASE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Tadepalli Gang Rape: తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడి అరెస్ట్..? మారువేషంలో వెళ్లి పట్టుకున్న పోలీసులు..?

పోలీసుల అదుపులో తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేస్ నిందితుడు

పోలీసుల అదుపులో తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేస్ నిందితుడు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో (Tadepalli Gang Rape Case) పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత నిందితుల్లో ఒకడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి షేర్ కృష్ణగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడ్ని గుంటూరు అర్బన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో నిందితుడు వెంకట ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారైనట్లు సమాచారం. పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుల ఆచూకి కోసం నెల రోజులుగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల కదలికలు, వారి ఫోటోల ఆధారంగా లభించిన సమాచారంతో గత 30 రోజులుగా పోలీసులు వివిధ వేషధారణలతో నిందితుల కోసం గాలించారు.

    ముఖ్యంగా రైళ్లలో తిరిగే యాచకులు, హిజ్రాలు, సమోసాలు అమ్ముకునేవారు, రైల్వే ట్రాక్ ల పక్కన చెత్తఏరుకునేవారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలో ఒంగోలులో ఫ్లై ఓవర్ కింద నిద్రిస్తుండగా కృష్ణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
    ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న వెంకట ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడి కోసం రైల్వే ట్రాక్ లు, శివారు ప్రాంతాలు, చెన్నై ర్లైవే మార్గంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో జల్లెడపడుతున్నారు.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ కఠిన లాక్ డౌన్.. కేసులు పెరగడంతో తప్పని ఆంక్షలు.. ఎక్కడంటే..!


    ఏం జరిగిందంటే..!
    విజయవాడకు చెందిన యువతి జూన్ 19న రాత్రి 10గంటల సమయంలో తనకు కాబోయే భర్తతో కలిసి తాడేపల్లి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు... వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు.

    ఇది చదవండి: ఎమ్మెల్యేల తీరుతో సీఎం జగన్ కు చిక్కులు తప్పవా..? ఇలా అయితే నవరత్నాలు బూడిదలో పోసిన పన్నీరేనా..?



    ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్యాంగ్ రేప్ సీఎం వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో జరగడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం కూడా అందించింది. ఓ రోజు నిందితలను స్థానికులు గుర్తించగా ఓ ట్రైన్ ఎక్కిపారిపోయారు. ఘటన జరిగిన 45 రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు పట్టుబడ్డాడు. నిందితుడి అరెస్టును పోలీసులు ఇంతవరకూ ధృవీకరించలేదు. రెండో వ్యక్తి కూడా దొరికిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

    మీ నగరం నుండి (​గుంటూరు)

    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Gang rape, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు