Anna Raghu, Guntur, News18
డబ్బు ఎవరితో ఏపనైనా చేయిస్తుంది. అది లేకపోతే జీవితమనే బండి నడవదు. డబ్బు కొందరికి అవసరం. కొందరికి బలహీనత. అలాంటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదిస్తుందో ముఠా. అమయాకులను చీకటి వ్యాపారంలోకి దించుతోంది. టెక్నాలజీని ఉపయోగించి మరీ దందాను సాగిస్తున్నారు. స్మార్ట్ గా హైటెక్ పద్ధతిలో వ్యభిచారాన్ని నడుపుతున్నారు. అందమైన యువతులు ఫోటోలను వాట్స్ అప్ గ్రూపుల్లో పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur), విశాఖపట్నం (Visakhapatnam) తో పాటు హైదరాబాద్ (Hyderabad) లోనూ ఎలాంటి భయం లేకుండా వ్యభిచార దందాను నడుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.., గుంటూరు అగ్రహారంలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో అర్బన్ ఎస్పీ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ తనస సిబ్బందితో కలిసి అగ్రహారం అడివి తక్కెళ్లపాడులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనఖీల్లో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది.
వాట్సాప్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పంపుతూ విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు మహిళలను అదుపులోనికి తీసుకున్నారు. ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తోందని మహిళలే అని తెలిసి పోలీసులే షాకయ్యారు. నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
మహిళలను అక్రమ రవాణా చేసి అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ ముఠా.. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర, చత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ రొంపిలోకి దించుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు మరియు కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలకు డబ్బు సంపాదించవచ్చని చెప్పి ఈ వృత్తిలోకి దించుతున్నారు. ఇందుకు ఒప్పుకోని వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ ముఠాకు చిక్కిన యువతులను వివిధ నగరాలకు తిప్పుతూ వాట్సాప్ గ్రూపుల ద్వారా వ్యాపారం చేస్తున్నారు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నగరాల్లోని ప్రైమ్ ఏరియాల్లో ఇళ్లను అద్దెకు తీసుకొని దందా సాగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విటులను ఆకర్షించి ముందుగానే ఆన్ లైన్ ద్వారా డబ్బులు జమ చేయించుకుంటారు. అనంతరం గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషే పంపి తాము ఉండే ఇళ్లకు రప్పిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేసి ఈ చీకటి దందాను రట్టు చేశారు.
గతంలోనూ గుంటూరు, విజయవాడ నగరాల్లో హైటెక్ వ్యభిచార దందాలు వెలుగు చూశాయి. పోలీసులు ఎన్నిసార్లు రైడ్ చేసి అరెస్టులు చేసినా ఈ చీకటి వ్యాపారానికి అడ్డుకట్టపడటం లేదు. నిత్యం అడ్రెస్ లు మార్చడం.., ఎవరికీ అనుమానం రాని ఏరియాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని సీక్రెట్ గా వ్యాపారం చేస్తుండటంతో పోలీసులకు కూడా దొరకడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Guntur, Prostitution racket