Home /News /andhra-pradesh /

GUNTUR POLICE ARRESTED YOUNG MAN FOR BLACKMAILING GIRLS WITH FAKE INSTAGRAM ID IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Instagram: ఇన్ స్టాగ్రామ్ లో 350 మంది అమ్మాయిలకు వల... క్లోజ్ గా చాట్ చేసి ముగ్గులోకి దించాడు.. ఆ తర్వాత...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడెక్కడివారు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకుంటుంటారు. ఇలా ఓ కేటుగాడు ఫేక్ ఐడీలతో వందలాది మంది అమ్మాయిలను చీట్ చేశాడు.

    అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

    సోషల్ మీడియాలో ఎక్కడెక్కడివారు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకుంటుంటారు. అంతేకాదు ఫోటోలు, వీడియోలు కూడా పంపించుకుంటుంటారు. పరిచయం కాస్త ముదిరితే పర్సనల్ చాటింగ్, ఫోటోలు పంపుకునేంత వరకు వెళ్తుంది. ఆ తర్వాత విషయం బ్లాక్ మెయిలింగ్ వరకు వెళ్తుంది. ఇలా ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను ముగ్గులోకి దించాడు. వందలాది మందిని ట్రాప్ చేశాడు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో దోచేశాడు. బాధితుల ఫిర్యాదుతో ఆ కేటుగాణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని సంజీవ్ నగర్ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కుటుమారుడు పూనూరి రామ్ ప్రకాష్... ఓ కాలేజీలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతగాడు డబ్బు సంపాదించేందుకు ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రియ అనే పేరుతో అమ్మాయిగా ఐడీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత విద్యార్ధినులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టేవాడు. వారితో చాటింగ్ చేస్తూ దగ్గరయ్యేవాడు.

    ఆ తర్వాత తన సొంత ఇన్ స్టా ఎకౌంట్ నుంచి అదే అమ్మాయిలకు రిక్వెస్ట్ పెట్టి.. ప్రియ అనే ఎకౌంట్ నుంచి రామ్ మంచివాడని., తనకు బాగా తెలుసని చెప్పేవాడు. దీంతో వాళ్లు కూడా రామ్ ప్రకాష్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించేవాళ్లు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేసి దగ్గరయ్యేవాడు. పర్సనల్ విషయాలపై కూడా చాటింగ్ చేస్తూ వావి వివరాలు సేకరించేవాడు. ఆ తర్వాత అర్జెంట్ అవసరమంటూ డబ్బులు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో గుంటూరు శ్రీనివాసరావు పేటకు చెందిన ఓ యువతిని ట్రాప్ చేసి దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి రూ.85వేలు తీసుకొని జల్సాలు చేశాడు.

    ఇది చదవండి: 10 నిముషాల్లో రూ.10 లక్షల ఆదాయం.. కోట్లలో వ్యాపారం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..

    ఆమెను బెదిరించి ఇన్ స్టా ఐడీ పాస్ వర్డ్ తీసుకొని యువతి ఫ్రెండ్స్ తో కూడా చాటింగ్ చేసేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు తన ఇన్ స్టా ఎకౌంట్ ను బ్లాక్ చేసింది. అయినా వేధింపులు మానుకోని రామ్..ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిలింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా... 350 మందికి ఫేక్ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టినట్లు గుర్తించారు. అతడి వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

    ఇది చదవండి: భార్యను చంపాలని మూడుసార్లు విఫలమైన భర్త... నాలుగోసారి ఏం చేశాడంటే..!


    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Instagram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు