హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: రగ్గులు అమ్ముతూ ఇళ్లకు వస్తారు... కన్నుపడిందా అంతేసంగతులు..! గుంటూరులో యూపీ ముఠా ఆగడాలు..

Guntur: రగ్గులు అమ్ముతూ ఇళ్లకు వస్తారు... కన్నుపడిందా అంతేసంగతులు..! గుంటూరులో యూపీ ముఠా ఆగడాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur: దొంగతనాలు చేసేవారు పక్కా స్కెచ్ తో రెక్కీ చేసి దోచేస్తారు. ఎక్కడా తేడా రాకుండా రోజుల తరబడి ప్లాన్ వేసి అందినకాడికి ఎత్తుకెళ్లిపోతుంటారు. కానీ ఓ ముఠా మాత్రం సీజనల్ గా అవసరమయ్యే వస్తువులతో జనానికి వల వేస్తోంది. వాటిని అమ్మినట్లే అమ్ముతూ జనానికి టోకరా వేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

దొంగతనాలు చేసేవారు పక్కా స్కెచ్ తో రెక్కీ చేసి దోచేస్తారు. ఎక్కడా తేడా రాకుండా రోజుల తరబడి ప్లాన్ వేసి అందినకాడికి ఎత్తుకెళ్లిపోతుంటారు. కానీ ఓ ముఠా మాత్రం సీజనల్ గా అవసరమయ్యే వస్తువులతో జనానికి వల వేస్తోంది. వాటిని అమ్మినట్లే అమ్ముతూ జనానికి టోకరా వేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో జనానికి అవసరమైన దుప్పట్లు, రగ్గుల పేరుతో కన్నింగ్ స్కెచ్ వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఇంటింటికీ తిరుగుతూ రగ్గులు విక్రయిస్తూ జీవనోపాధి చూసుకుంటారు. ఐతే వాళ్లు పట్టెడన్నం కోసం బిజినెస్ చేస్తున్నారనుకుంటే పొరబాటే. పగలు ఊరూరా తిరిగి నచ్చిన ఇంటిని సెలెక్ట్ చేసుకోవడం.. రాత్రికి అడ్డంగా దోచేయడం వారి పని. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ రోజు పొద్దున్నే గుంటూరు జిల్లా (Guntur District) పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ సంబాషణ ఏమి అంటే పథ గుంటూరు బాలాజీ నగర్ లో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు.

వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరుసటి రోజు పక్క వీధిలో అదే తరహాలో మరో దొంగతనం., కొన్ని రోజుల తరువాత నల్లపాడు ప్రాంతంలో మరో దోపిడీ జరిగాయి. వరుస దొంగతనాలను పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మూడు దొంగతనాలను విశ్లేషించి విచారణ ప్రారంభించారు. ఈ దోపిడీలన్నింటినీ ఒకే ముఠా చేసినట్లు నిర్ధారించారు.

ఇది చదవండి: సమాధిలో శవం మిస్సింగ్.. దృశ్యం సినిమాను తలపిస్తున్న క్రైమ్ స్టోరీ..



ఐతే ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడ ఉంటారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. చివరికి ఓ చిన్న ఆలోచన వచ్చింది. ఆయా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తులపై నిఘా ఉంచగా.. రగ్గులు విక్రయించేవారిపై అనానం వచ్చింది. వారి గురించి మొత్తం కూపీలాగగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలోని సద్దుల్లాబాద్ కు చెందిన షేక్ ఖలీల్, రషీల్, బాబు ఖురేష్ ముఠాగా ఏర్పడ్డారు. ఇతర రాష్ట్రాలకు రగ్గులు, దుప్పట్లు విక్రయించేందుకు వెళ్తూ దోపిడీలకు పాల్పడున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని మణిపురం బ్రిడ్జి వద్ద రూమ్ అద్దెకు తీసుకున్న నిందితులు.. స్థానికులకు రగ్గులు విక్రయించేవారిగా పరిచయం చేసుకున్నారు. రగ్గులు అమ్మే నెపంతో తమకు నచ్చిన ఇంటిని ఎంచుకొని రెక్కీ చేసేవారు. అనువైన సమయం చూసుకొని ఇంటిని కొల్లగొట్టేవారు. వీరిలో ఒకరు బయట కాపలాగా ఉంటారు. మరో ఇద్దరు లోపలికెళ్లి దొంగతనానికి పాల్పడతారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు