GUNTUR POLICE ARRESTED 80 PEOPLE IN PROSTITUTION CASE IN GUNTUR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Guntur Girl: మైనర్ బాలికతో చీకటి వ్యాపారం.. ఒక్క కేసులో 80 మంది అరెస్ట్.. పూర్తి వివరాలివే..
పోలీసుల అదుపులో నిందితులు
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఒకే కేసులో అరెస్టయ్యారు. ఆడపిల్లను అటబొమ్మగా చూసిన వారంతా కటకటాల్లోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఒకే కేసులో అరెస్టయ్యారు. ఆడపిల్లను అటబొమ్మగా చూసిన వారంతా కటకటాల్లోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఏడాదిన్నర క్రితం ఓ వ్యక్తి భార్య, కూతురు ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారి ఇద్దర్నీ గుంటూరు జీజీహెచ్ లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతడి భార్య జూన్ లో ప్రాణాలు విడిచింది. 13 ఏళ్ల బాలికకు నెగిటివ్ వచ్చినా.. కాస్త అనారోగ్యంతో ఇబ్డంది పడేది. ఆ చిన్నారి బాగోగులు చూసుకోవాల్సిన తల్లి లేదు. తండ్రి వాచ్ మన్ ఎప్పుడు ఫ్యాక్టరీ దగ్గరే ఉండేవాడు.. దీంతో ఆ బాలిక బాగోగులను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ మహిళ ఆ విషయాన్ని తెలుసుకుంది. వెంటనే తాను ఓ ఆస్పత్రిలో నర్సును అని చెప్పి ఆ తండ్రిని పరిచయం చేసుకుంది. బాలిక పరిస్థితి బాగులేదని.. అమ్మ లేని పిల్ల కాబట్టి.. తాను తీసుకెళ్లి నాటు వైద్యం చేయిస్తానని.. ఆరోగ్యంగా తిరిగి వస్తుందని నమ్మించింది.
ఆమె నర్సు అని చెప్పడం. బాలిక బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో.. పూర్తిగా ఆ మాయ లేడి మాటలను నమ్మిన తండ్రి.. ఆమెతో పాటు బాలికను పంపించాడు. అలా బాలికను తనతో పాటు తీసుకెళ్లిన ఆ కంత్రీ కిలాడీ లేడీ.. బిజినెస్ ప్రారంభించింది. అనారోగ్యంతో ఉందని.. తల్లి లేని పిల్ల అని ఏ మాత్రం జాలి చూపించలేదు. కాసులపై కక్కుర్తితో వ్యభిచార రొంపిలోకి దింపింది. కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని మాయ మాటలతో మొదట లొంగదీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చేయించింది. ఇంతలో విజయవాడ మీదుగా తరలించే సమయంలో బాలిక తప్పించుకొని పేరేచెర్ల లో ఉన్న తండ్రి వద్దకు చేరుకోని తన బాధను వెళ్లబోసుకుంది..
దీంతో తండ్రి నిందితురాలిపై మేడికొండూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదును జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి కేసును అరండల్పేట స్టేషన్కు బదిలీ చేశారు. విచారించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఐతే బాలికను విచారించిన్నపుడు ఈ కేసులో తొలుత 45 మంది వరకు అరెస్ట్ చేశారు. ఐతే బాలిక న్యాయమూర్తి ఎదుట పోలీసులు అందరిని అరెస్ట్ చేయలేదని ఇంకా ఉన్నారని వాంగ్మూలం ఇచ్చింది. వాంగ్మూలం విన్న న్యాయమూర్తి నిర్వాహకులు మరియు విటులను కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పటంతో రాజకీయ నాయకుల అనుచరుల బాగోతాలు బయటపడ్డాయి.
ఈ కేసు లో మొత్తం 80 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా మరో పది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు 53సెల్ ఫోన్లు 3 ఆటోలు 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు లండన్ లో ఉన్నట్లు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.