హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: ఫొటోగ్రఫీ టు యూట్యూబర్‌గా మారిన గుంటూరోడు..! కంటెంట్‌ ఉంటే చాలు..లక్షల్లో అర్జించొచ్చు..!

Guntur: ఫొటోగ్రఫీ టు యూట్యూబర్‌గా మారిన గుంటూరోడు..! కంటెంట్‌ ఉంటే చాలు..లక్షల్లో అర్జించొచ్చు..!

photographer

photographer to youtuber

ఫోటోగ్రఫీ నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా మారి మిల్లియన్ వ్యూస్ సాధిస్తూ.. తెలుగు సోలో కంటెంట్ క్రియేటర్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. యూట్యూబ్‌ ఛానల్‌తో లక్షలు సంపాదించవచ్చని మన గుంటూరుకు చెందిన యూట్యూబర్‌ శ్రీనివాస్‌.

  (Sumanth jangam, News 18, Guntur)

  ఫోటోగ్రఫీ నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా మారి మిల్లియన్ వ్యూస్ సాధిస్తూ.. తెలుగు సోలో కంటెంట్ క్రియేటర్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. యూట్యూబ్‌ ఛానల్‌తో లక్షలు  సంపాదించవచ్చు అంటున్నాడు మన గుంటూరుకు చెందిన యూట్యూబర్‌ శ్రీనివాస్‌.

  గతంలో జీవితంలో సెటిల్‌ అవ్వడం అంటే  ఏ ఇంజనీరింగ్‌, డాక్టర్‌.. లేదా !,ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చుని మన తెలివినే పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించే మార్గాలు బోలెడున్నాయి. వాటిలో ఒకటే యూట్యూబ్‌.

  కంటెంట్‌ ఉండాలే కానీ యూట్యూబ్‌ ద్వారా వచ్చే ఆదాయానికి, ఆదరణకు ఎలాంటి కొదవ ఉండదు. కంటెంట్‌లో కాస్త క్వాలిటీ, క్లారిటీ ఉంటే చాలు యూట్యూబ్ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించొచ్చు.

  చిన్ననాటి నుంచే ఫొటోగ్రఫీపై మక్కువ..!

  గుంటూరుకు చెందిన శ్రీనివాస్ డిజిటల్ యుగం ప్రారంభదశలోనే ఈ విషయం గుర్తించాడు. అందుకే 2010లోనే యూట్యూబ్ వీడియోలు చేయటం ప్రారంభించాడు. శ్రీనివాస్ స్వతహాగా ఫోటోగ్రఫీ టెక్ ఫ్రెక్. చిన్నతనం నుండే ఫోటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తితో మద్రాస్ వెళ్ళి డార్క్ రూం ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు.

  20వ శతబ్ధంలో ఫోటోగ్రఫీ డిజిటల్‌లోకి మారే క్రమంలో డిజిటల్ ఎడిటింగ్ నేర్చుకున్నాడు. దీంతో ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌… రెండింటిపైనా పట్టు సాధించాడు. గుంటూరులో ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా మంచిపేరు సంపాదించాడు. కానీ తరువాతి కాలంలో ఫోటోగ్రఫీ రంగంలో పోటీ పెరిగిపోయింది. అయితే ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతను, కొత్తదనాన్ని కోరుకునే శ్రీనివాస్‌కు మరేదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నాడు..

  2010లోనే యూట్యూబ్‌ ఛానెల్ ప్రయాణం..!

  సరిగ్గా అదే సమయంలో ఇండియాలో ఇంటర్నెట్ రంగం ఊపందుకుంది. ఆ సమయంలో 2010 లో శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అందులో ఫోటోగ్రఫీ టుటోరియల్స్‌(Photography Tutorials) వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేసేవాడు. కానీ అప్పట్లో అంత ఆదరణ లభించలేదు.

  టిక్‌టాక్‌లో ఫేమస్‌ అయ్యేలోపు...!

  కానీ, 2019లో టిక్ టాక్ వీడియోలు చేయటం ప్రారంభించాడు. మంచి టైమింగ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ పైన పట్టు ఉండటంతో మంచి ఆదరణ లభించింది. జనాల్లో ఆదరణ పెరిగింది. తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువయ్యారు. ఇంకొన్ని రోజులాగిఉంటే టిక్‌టాక్‌ సెలబ్రెటీ అయ్యేవారేమో...కానీ అంతలోనే టిక్ టాక్ బాన్ కావడంతో మళ్లీ అయోమయంలో పడ్డాడు.

  శ్రీనివాస్‌ ఆన్‌ ఇన్‌వన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌..!

  కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని యూట్యూబ్‌లో శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్(Srinivas all in one) పేరుతో ఛానల్ ప్రారంభించారు. ప్రతిరోజు షాట్ వీడియోలు చేయటం ప్రారంభించారు. దీనికి కూడా మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. సరిగ్గా లాక్‌డౌన్‌ సమయంలో తన ప్రయాణం మరో మలుపు తిరిగింది. కరోనా అవగాహనకు సంబంధించి ఫన్నీ వీడియోలు చేయడంతో..అవి వైరల్‌గా మారాయి. ఇక అప్పటి నుంచి శ్రీనివాస్‌ యూట్యూబ్‌ ఛానల్ మంచి ఊపు అందుకుంది.

  కుటుంబసభ్యులతోనే కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్న శ్రీనివాస్‌..!

  మొదట్లో సింగిల్‌గా వీడియోలు చేసేవాడు. ఫ్యాన్స్‌ పెరగడంతో నెటిజన్ల నుంచి రోజురోజుకి ఆదరణ పెరగడంతో తన కుటుంబసభ్యులతో కలిసి కొన్ని వీడియోలు చేసేవాడు. తన ఇంట్లోనే సెట్టింగ్‌ వేసి ఫన్నీ వీడియోలు, కంటెంట్‌ క్రియేట్‌ చేయడం లాంటివి చేస్తూ పాపులర్‌ అయ్యాడు. శ్రీనివాస్‌ చేసిన వీడియోలకు ఇప్పుడు మిలియన్‌ వ్యూస్ సాధిస్తున్నారంటే..దాని వెనక అతని కృషి ఎంతగానో ఉందని చెప్పుకోవాలి.

  కొడుకుతోనే ఎక్కువ యూట్యూబ్‌ షార్ట్స్‌..!

  శ్రీనివాస్‌ ఎక్కువగా తన కుటుంబసభ్యులతోనే యూట్యూబ్‌ షార్ట్స్‌ వీడియోలు చేస్తుంటారు. ముఖ్యంగా తన కొడుకుతో చేసిన ఫన్నీ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే తన సక్సెస్‌కు ఫ్యామిలీ మెంబర్స్‌ ప్రధాన కారణమని అంటున్నారు శ్రీనివాస్‌. యాక్టింగ్‌లో తనకు తన తండ్రే స్ఫూర్తి అని భవిష్యత్‌లో యాక్టింగ్‌వైపే వెళ్లాలని అనుకుంటున్నాని శ్రీనివాస్‌ కుమారుడు ధనుష్‌ చెబుతున్నాడు.

  గోల్డ్‌ ప్లే బటన్‌ లక్ష్యంగా...!

  తెలుగు కంటెంట్ క్రియేటర్స్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్న శ్రీనివాస్‌ ఇప్పుడు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఫొటోగ్రఫీ టిప్స్‌, ప్రొడక్ట్‌ రివ్యూలు, ఎంటర్‌టైన్మెంట్‌, కామెడీ స్కిట్స్‌ ఇలా అన్ని రకాల వీడియోలు చేస్తూ నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంటున్నాడు. అయితే తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్‌ కానీ, ఎలాంటి ప్రమోషన్స్‌ కానీ ఉండవంటున్నారు శ్రీనివాస్‌. యూట్యూబ్‌ టీమ్‌ నుంచి సిల్వర్‌ ప్లే బటన్‌ సాధించిన శ్రీనివాస్‌.. గోల్డ్‌ ప్లే బటన్‌ సాధించడమే తన లక్ష్యమంటున్నారు.

  యూట్యూబ్‌ URL: https://www.youtube.com/channel/UC273SUYRAV2gh3UAicZE2WA/featured

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు