GUNTUR PEOPLE FOLLOWING UNIQUE MARRIAGE TRADITION IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Unique Tradition: ఇలాంటి పెళ్లి మీరెప్పుడూ చూసుండరు..! అబ్బాయికి పట్టుచీర.. పూల జడ.. మరి అమ్మాయికి...!
పెళ్లికుమార్తె అలంకారంలో యోగేంద్ర
భారతదేశం (India) విభిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవు. అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ చాలా ఆచారాలున్నాయి. పెళ్లవుతుందని, మంచి జరుగుతుందని, అదృష్టం వరిస్తుందని చాలా ఆచారాలను పాటిస్తుంటారు. అలాంటి ఆచారాల్లో చాలా కఠినమైనవి ఉంటాయి. కొన్ని ఆచారాలు చాలా సరదాగా ఉంటాయి.
భారతదేశం (India) విభిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవు. అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ చాలా ఆచారాలున్నాయి. పెళ్లవుతుందని, మంచి జరుగుతుందని, అదృష్టం వరిస్తుందని చాలా ఆచారాలను పాటిస్తుంటారు. అలాంటి ఆచారాల్లో చాలా కఠినమైనవి ఉంటాయి. కొన్ని ఆచారాలు చాలా సరదాగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే ఆచారాలు వింతగా, ఫన్నీగా అనిపిస్తాయి. కులాలు, వర్గాలు, జాతులు, ప్రాంతాలను బట్టి కొన్ని వింత ఆచారాలను విధిగా పాటిస్తారు. సాధారణంగా పెళ్లంటే పెళ్లి కుమార్తెను అందంగా అలంకరించి పీటలమీద కూర్చొబెడతారు. వచ్చిన వాళ్లంతా అమ్మాయి ఎలాంటి నగలు వేసుకుంది..? ఎలాంటి చీరకట్టుకుంది..? కట్టుబొట్టు అంతా పట్టిపట్టి చూస్తారు. కానీ ఏపీలోని ఓ గ్రామంలో మాత్రం వింత ఆచారం ఉంది.
ఇక్కడ పెళ్లి జరుగుతుంటే అమ్మాయికి బదులు అబ్బాయిని పెళ్లి కుమార్తె మాదిరిగా ముస్తాబు చేస్తారు. అబ్బాయి అందాన్ని చూసి ముచ్చటపడతారు. ప్రకాశం జిల్లా (Prakasham District) కొనకమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు అదివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. పెళ్లిలో పట్టుపంచెతో దర్శనమివ్వాల్సిన వరుడు.. పట్టుచీర కట్టుకొని వచ్చాడు. జంబలకిడి పంబ సినిమాను తలపించే స్టైల్లో యోగేంద్ర పంచెకు బదులు చీర, చొక్కాకు బదులు జాకెట్ ధరించి.. బారెడు విగ్గుపెట్టి జడవేసుకొని పూలు పెట్టుకున్నాడు. కళ్లకు కాటుక, పెదవులకు లిప్ స్టిక్, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలతో అలంకరించుకున్నాడు. ఐతే ఇదే వెరైటీ పెళ్లి కాదు. అది వాళ్ల వంశాచారం.
వారి వంశంలో అబ్బాయిలకు పెళ్లి చేసే సమయంలో తమ ఇలవేల్పు అయిన గురప్పుడు స్వామికి కొలుపులు జరుపుతారట. ఇందుకోసం పెళ్లి కుమార్తె మాదిరిగా అలంకరించుకొని ఆలయానికి వెళ్తూ.. ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకోవటం తమ ఆచారమని రామయ్య కుటుంబం చెప్తోంది. అందుకే ఇలా పెళ్లి కూతురిలా ముస్తాబై ఎదురునడిచామని తెలిపారు. పెళ్లి తంతు మొదలైన వెంటనే అబ్బాయిని పెళ్లి కూతురిలా, అమ్మాయిని పెళ్లి కొడుకులా ముస్తాబుచేస్తారు. అనంతరం ఊరేగింపుగా ఊరి చివర జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంధుమిత్రులు హాజరవుతారు. ఇలా చేయడం వల్ల తమ నూతన జంటకు గురప్పుడుస్వామీ అనుగ్రహం లభించి పిల్లా పాపలతో సుఖంగా ఉంటారని నమ్ముతుంటారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి సాంప్రదాయాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇలాంటి వింత ఆచారాలను పాటిస్తుంటారు. యుక్తవయసు వచ్చిన వారికి ఇలా విచిత్ర వేషాలు వేయించి పూజలు చేయించి దేవుడి ఆశీస్సులు పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.