Home /News /andhra-pradesh /

GUNTUR PANIPURI IS AVAILABLE AT RS 29 AND 20 VARIETIES OF PANIPURI IN GUNTUR GSU NJ ABH

Guntur: రూ.29లకే అన్‌లిమిటెడ్‌ పానీపూరి..! పిజ్జా, చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌ అంటూ 20 రకాల వెరైటీలు..!

రూ.29లకే

రూ.29లకే అన్‌లిమిటెడ్‌ పానీపూరి..!

మామూలుగా పానిపూరిలో ఏం వేస్తాం.. ! కొద్దిగా ఉల్లిపాయలు, మసాలా, ఆలు మసాలా ...ఇది సహజం. అయితే ఈ రెగ్యులర్‌ పానీపూరీ తిని బోర్‌ కొట్టిందా.. ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తుందా.? అయితే గుంటూరులోని ఈ పానిపూరి స్టాల్‌కు వెళ్లాల్సిందే..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India
  (Sumanth Jangam, News 18, Guntur)

  పాని పూరి లవర్స్ కి ఇది స్వర్గం! ఐస్ క్రీమ్ పానీ టెస్ట్ చేయాలి అంటే ఇది ఇక్కడకి రావాల్సిందే.. మీరు పానీపూరీ అంటే పడిచచ్చిపోతారా..! ఎక్కువ ప్లేట్లు తింటే జేబుకు చిల్లు పడుతుందని ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి వాళ్లకోసమే అన్‌లిమిటెడ్‌ పానీపూరీ. తక్కువ బబ్జెట్‌లో మీకు ఇష్టమొచ్చినన్ని పానీపూరీలు తినేయోచ్చు. అది కూడా మన రెగ్యులర్‌ పానీపూరీలు లాంటివి కాదు.. దాదాపు 20 రకాల ఫ్లేవర్స్‌లో అక్కడ పానీపూరీలు దొరుకుతాయి.

  మామూలుగా పానిపూరిలో ఏం వేస్తాం.. ! కొద్దిగా ఉల్లిపాయలు, మసాలా, ఆలు మసాలా ...ఇది సహజం. అయితే ఈ రెగ్యులర్‌ పానీపూరీ తిని బోర్‌ కొట్టిందా.. ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తుందా.? అయితే ఈ పానిపూరి స్టాల్‌కు వెళ్లాల్సిందే..!

  గుంటూరులోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఎస్ఈజే పానీపూరీ స్టాల్‌ను మీరు ఒక్కసారి విజిట్‌ చేశారంటే..ప్రతిరోజు అక్కడికే వెళ్తారు పానీపూరి తినడానికి. ఇక్కడ భయ్యా తోడా ప్యాస్‌ దాలో లాంటి రోటీన్‌ డైలాగ్‌ వినిపించదు.. తోడా ఐస్ క్రీం ధాలో , తోడా చీజ్ దాలో అని కస్టమర్లు అడుగుతుంటారు. పానీపూరి లవర్స్‌ను నోరూరించే వివిధ రకాల పానిపూరిలను గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు రిటైర్డ్‌ ఆర్మీమెన్‌.  ఉజ్జయినీ వెళ్లినప్పుడు అక్కడ ఇన్ని రకాల పానీపూరిలు చూశానని..తనకెంతో నచ్చి వాటి గురించి తెలుసుకుని, నేర్చుకున్నానని రిటైర్డ్‌ ఆర్మీమెన్‌ నరసింహరావు తెలిపారు. ఆ తర్వాతే గుంటూరులో శ్రీ లలితా ఎస్‌జేఈ అనే పేరుతో పానీపూరీ స్టాల్‌ను ఏర్పాటు చేశానని నరసింహరావు తెలిపారు. ఇక్కడ రెగ్యులర్‌ పానీపూరి బండి దగ్గరలాగా బయట రోడ్ల మీద నిలబడి తినేపని లేదు. హ్యాపీగా కూర్చుని తినొచ్చు. సీటింగ్‌, టేబుల్స్‌తో సహా ఆంబియన్స్‌ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్‌ ఫెసిలిటీ ఉంటుంది. గ్లౌజ్‌లు వేసుకుని పానీపూరి సర్వ్‌ చేస్తారు.

  అంతేకాదు పిజ్జా పానీపూరి, ఫైర్ లెమన్, చీజ్, చాక్లెట్, ఐస్‌క్రీం, పా, లస్సీపూరి, మౌత్‌ ఫ్రెషనర్‌, ఇందూరి పూరి అంటూ ఒక కొత్తరకమైన పానీపూరీ టేస్ట్‌ను గుంటూరువాసులకు అందుబాటులో తీసుకొచ్చారు. హాట్‌ హాట్‌ పిజా పానీపూరీ మనకు చూస్తుంటూనే నోరూరిపోతుంది. ఇంక ఫైర్‌ లెమన్‌ పానీపూరి అయితే.. మన కళ్లముందే ఫైర్ పెడుతుంటే ఎప్పుడు నోట్లో వేసుకుందామా అన్నట్లుగా ఉంటుంది. ఇంక ఐస్‌క్రీమ్‌ పానీపూరి సంగతి అయితే చెప్పనక్కర్లేదు.

  ఈ వెరైటీ పానీపూరీలు మాత్రం కాస్త రేటు ఢిఫరెంట్‌గా ఉంటాయి. పిజ్జా పానీపూరీ రూ.80లకు అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ పానీపూరీ ఛాలెంజ్‌లు కూడా పెడుతుంటారు. అందుకే కొత్తగా స్టార్ట్‌ చేసిన ఈ పానీపూరీ స్టాల్‌.. అతితక్కువ సమయంలోనే చాలాఫేమస్‌ అయ్యింది. సాయంత్రం అయ్యిందంటే చాలు కస్టమర్లతో కిటకిటలాడుతుంది. కాలేజీలు, స్కూళ్ల నుంచి వెళ్లే వాళ్లంతా ఇక్కడ వాలిపోతుంటారు. ఫ్రెండ్స్‌ చిట్‌చాట్‌ చేసుకోడానికి కూడా ఇది మంచి ప్లేస్‌. ఒక్కొక్కరు ఒక్కో ఫ్లేవర్‌ పానీపూరి తినొచ్చు.

  ప్రజల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుందంటున్నారు నరసింహరావు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి పానీపూరి సెంటర్‌ లేదని..చాలా టేస్టీగా ఉందంటూ కస్టమర్లు కితాబులిస్తున్నారు. మరికొందరైతే రెగ్యులర్ కస్టమర్లు అయిపోయారు.

  ఈ సారి గుంటూరు వెళితే మీరు కూడా ఈ పానీపూరి స్టాల్‌కు వెళ్లి ఒకసారి టేస్ట్‌ చేసి చూడండి.. మీకు నచ్చితే మళ్లీ మళ్లీ వెళ్లండి.  అడ్రస్: డోర్ నంబర్ 3-1/5, వైఎస్సార్ విగ్రహం పక్కన, రాజేంద్రనగర్‌, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌- 522006.
  ఫోన్‌ నెంబర్‌: 91 95732 78609

  ఎలా వెళ్లాలి?

  గుంటూరు బస్టాండ్‌ నుంచి రాజేంద్రనగర్‌కు సిటీ బస్సులు, ఆటోలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అక్కడకు వెళ్లి శ్రీ లలిత పానీపూరి సెంటర్‌ అని ఎవ్వరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.

  Read This: Kurnool: మైనర్ బాలిక ప్రేమకు అంగీకరించలేదని.. దారుణానికి ఒడిగట్టిన యువకుడు.. ఏం చేశాడంటే?
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Food, Guntur, Local News

  తదుపరి వార్తలు