Home /News /andhra-pradesh /

GUNTUR ONLINE LOAN APPS TENSION ONE MARRIED WOMEN SUICIDE IN GUNTUR NGS NJ

Crime News: బాబోయ్ ఆన్ లైన్ లోన్.. న్యూడ్ ఫోటోలతో బెదిరింపు.. వివాహిత ఆత్మహత్య

ప్రాణాలు తీస్తున్న ఆన్ లైన్ లోన్ యాప్ లు

ప్రాణాలు తీస్తున్న ఆన్ లైన్ లోన్ యాప్ లు

Loan App: మీ అత్యవసరమే వారి పెట్టుబడి.. వేలల్లో ఇస్తారు.. లక్షల్లో వసూలు చేస్తారు.. అది కూడా క్షణం అలస్యం అయితే..? అంతే.. వేధింపుల పర్వం మొదలెడతారు.. మహిళలైతే లైంగిక వేధింపులకు కూడా వెనుకాడరు. తాజాగా వారి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహ ఆత్మహత్య చేసుకుంది.

ఇంకా చదవండి ...
  Loan App: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ (Cyber Crime) ఇప్పటికే టెన్షన్ పెడుతోంది. దీనికి తోడు లోన్ యాప్ ల (Loan Apps) వేదింపులు.. రోజు రోజుకీ పెచ్చు మీరుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ వేధింపులు తట్టుకోలేక కొందరు ధైర్యంగా పోలీసుకు ఫిర్యాదుచేస్తుంటే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  తాజాగా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక గుంటూరు (Guntur) కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌(Indian Bulls), రూపెక్స్‌ యాప్స్‌(Rupex app) నుంచి 20,000 రూపాయల లోన్‌ తీసుకున్నారు. ఆమె తీసుకున్న 20వేల రుణానికి.. ఇప్పటికే 12 వేలు కట్టింది. సమయానికి మిగతా డబ్బు చెల్లించలేకపోయింది. దీంతో ఆ లోన్‌యాప్‌ కాల్‌ సెంటర్‌ నుంచి వేధింపులు మొదలయ్యాయి.

  లోన్‌యాప్‌ నిర్వాహకులు రెండు రోజుల నుంచి ప్రత్యుషను టార్చర్‌ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో, తన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లకు పంపిస్తామని ఆ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపడం మొదలుపెట్టారు. తన కాంటాక్ట్‌ నెంబర్స్‌కు.. బంధువులకు కాల్‌ చేసి చెప్తామంటూ నిరంతరంగా కాల్స్‌ చేస్తూ వేధించినట్లు సమాచారం.  ఒకటి రెండు రోజులు కాదు.. ఇలా రోజుకో రకంగా టార్చర్‌ పెట్టడం మొదలుపెట్టారు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందేమోననే భయంతో.. మనస్తాపం చెందిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఐఆయ్‌ సారీ.. వీలైతే క్షమించు.. అంటూ సెల్ఫీ వీడియో..! పెట్టిందామె.

  ఇదీ చదవండి : సీఎం టూర్ పై వరుణుడి ఎఫెక్ట్.. జగన్ విశాఖ పర్యటన వాయిదా.. మరి వాహనమిత్ర?

  ప్రత్యుష సూసైడ్‌కు ముందు తన భర్తకు, తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపింది. ఆ వీడియో తను పడ్డ మానసిక క్షోభను వెల్లడించింది. లోన్ యాప్స్ నుంచి తాను రుణం తీసుకున్నానని.. బాగా ప్రెజర్ పెడుతున్నారని వాపోయింది. సాయంత్రం ఏడింటి కల్లా డబ్బులు కట్టకపోతే..తన పిక్స్ మార్ఫింగ్‌ చేసి పెడతామంటూ టార్చర్‌ చేస్తున్నారంటూ ఏడ్చేసింది. నిన్నంతా తాను మాట్లాడింది లోన్ వాళ్లతోనే అని.. వీలైతే క్షమించు. ఇక తన వల్ల కావట్లేదని. తాను ఈ ప్రాబ్లమ్‌ను ఎదుర్కోలేకపోతున్నానంటూ వీడియోలో చెప్పింది.

  ఇదీ చదవండి : వైసీపీపై మా పార్టీ నేతల ప్రచారంలో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

  ఆ సెల్ఫీ వీడియోను తన భర్తకు, తల్లిదండ్రులకు పంపిన తరువాత ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ఫోన్, వాట్సాప్ ద్వారా నిర్వాహకులు వేధిస్తూనే ఉన్నారు. దీనిపై ప్రత్యుష భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇదీ చదవండి: మరో 24 గంటలు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

  పోలీసులు పదే పదే హెచ్చరస్తున్నా. ఈ లోన్ యాప్ ల మాయాజలం నుంచి అమాయికులు తప్పించుకోలేకపోతున్నారు. అందుకే ఎంతగా డబ్బు అవసరం ఉన్నా సరే… ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లను ఆశ్రయించవద్దని..వాళ్ల చేతులకు మీ సమాచారాన్ని మొత్తం ఇవ్వొద్దని పోలీసులు కోరుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు వేధిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని… ప్రాణాలు తీసుకోవడం లాంటి పనులు చేయోద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur, Loan apps

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు