ప్రేమ (Love). రెండు మనసులను కలుపుతుంది. కానీ కొందరి ప్రేమే పెళ్లి (Love Marriage) వరకు చేరుతుంది. కొందరు మాత్రం తప్పక విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. కానీ 15ఏళ్ల క్రితం ప్రేమించుకోని విడిపోయిన ఓ జంట.. మళ్లీ కలిసింది. తమ ప్రేమను మళ్లీ గుర్తు చేసుకుంది. ఇద్దరికీ పెళ్లై, పిల్లలున్నా.. యుక్తవయసులో పుట్టిన ప్రేమ చిగురించింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా పెనవేసుకుంది. ఐతే వారు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలను విషాదంలో నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) నరసరావుపేట మండలం ఇస్సపాలెంకు చెందిన బత్తుల వెంకటకాళేశ్వరరావు, నాగలక్ష్మీ ఇద్దరూ 15 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లిచేసకోవాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దలతో చెప్పగా వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత కాళేశ్వరరావు గుంటూరుకు చెందిన లక్ష్మీ అనే మహిళతో, నాగలక్ష్మికి నరసరావుపేటకు చెందిన మరో వ్యక్తితో పెళ్లైంది. కాళేశ్వరరావు స్వగ్రామంలోనే ఉంటూ తాపీపని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. నాగలక్ష్మికు కూడా ఇద్దరు పిల్లలున్నారు. ఎవరి జీవితాలు వారివి అన్నట్లుగా బ్రతుకుతున్నారు.
కరోనా వల్ల చిగురించిన పాతప్రేమ..
ఐతే కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులు రావడంతో నాగలక్ష్మి భర్తను తీసుకొని స్వగ్రామమైన ఇస్సపాలెంకు వచ్చేసింది. ఇక్కడే ఉంటూ టైలరింగ్ శిక్షణ ఇస్తూ జీవనోపాధి పొందుతోంది. ఈ క్రమంలో కాళేశ్వరరావు, నాగలక్ష్మి ఒకర్ని ఒకర ఎదురుపడ్డారు. . 15ఏళ్ల తర్వాత మళ్లీ పాతప్రేమ మళ్లీ చిగురించింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు కలవడంతో ఈ క్రమంలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీలుకసు ఫిర్యాదు చేశారు.
శ్రీశైలంలో ఆత్మహత్య...
ఐతే బుధవారం రాత్రి కర్నూలు జిల్లా (Kurnool District) శ్రీశైలం (Srisailam) చేరుకున్న నాగలక్ష్మి, కాళేశ్వరరావు.. అక్కడే ఓ సత్రంలో గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఉదయం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు. కొద్దిసేపటికి కాళేశ్వరరావు కడుపులో నొప్పి అంటూ కేకలు వేస్తూ బయటకు రావడంతో సత్రం సిబ్బంది ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లాలోని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఐతే ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కాళేశ్వరరావు భార్య లక్ష్మికి ఫోన్ చేసి తన గురించి వెతకవద్దని.. మర్చిపోవాలని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
యుక్తవయసులో ఇష్టపడి ప్రేమను గెలిపించుకోలేకపోయిన వీళ్లిద్దరూ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేకపోయారు. రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Kurnool, Lovers, Lovers suicide