GUNTUR OLD AGE WOMAN COMMITS SUICIDE AFTER STAYING AWAY FROM HER KIDS IN PALANADU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Mother: ఓపిక ఉన్నంతకాలం పిల్లల కోసం కష్టపడింది.. కానీ మనసు ఎంత గాయపడితే అలా చేసుంటుంది..
ప్రతీకాత్మక చిత్రం
Parents: ఈ రోజుల్లో పిల్లలంతా పెద్దపెద్ద ఉద్యోగాల్లో విదేశాల్లో సెటిలైపోతున్నారు. వారిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు.. వృద్ధాప్యంలో పిల్లల తోడు లేక ఒంటరితనంతో అల్లాడిపోతున్నారు.
ఈ రోజుల్లో పిల్లలంతా పెద్దపెద్ద ఉద్యోగాల్లో విదేశాల్లో సెటిలైపోతున్నారు. వారిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు.. వృద్ధాప్యంలో పిల్లల తోడు లేక ఒంటరితనంతో అల్లాడిపోతున్నారు. ఒంటరితనం ఎంతభయంకరంగా ఉంటుందో కరోనా లాక్ డౌన్ సమయంలో అందరికీ తెలిసొచ్చింది. పట్టుమని 14రోజుల పాటు ఒంటరిగా క్వారంటైన్లో ఉండటానికే చాలా మంది ఇబ్బందులు పడిపోయారు. అలాంటిది ఏళ్ల తరబడి పిల్లలకు దూరంగా ఒంటరి గూటి పక్షుల్లా ఆ ముసలి ప్రాణాల ఎలా ఉండగలుగుతాయి. అన్నీ బాగున్నన్నాళ్లు పని పని అంటూ పరుగులు పెట్టి తీరా విశ్రాంతి తీసుకునే సమయంలో తోడులేక అల్లాడిపోతున్నారు. అలా ఓ అభాగ్యురాలు అమ్మా అని పిలిచేవాళ్లులేక కుమిలిపోయింది. ఆస్తులున్నా అవి సుఖాన్నిస్తాయేగానీ.. ప్రేమ, ఆప్యాయతలను పంచవుగా. అందుకే ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన కోట్ల రామారావు(60), కుమారి (52) దంపతులు గత రెండేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డి పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. వీరి కుమారుడు ఉద్యోగ రిత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. కుమార్తెలు వారి వారి కుటుంబాలతో సహ అమెరికాలో స్థిరపడిపోయారు.
అప్పటి నుంచి భార్యాభర్తలు ఒంటరిగానే ఉంటూ కాలంవెళ్లదీస్తున్నారు. ఐతే కుమారి మాత్రం నిత్యం పిల్లలపై బెంగతో ఉండేవారు. వారి ఎన్నిసార్లు పిలిచినా పనిఒత్తిడిలో పడి రాలేకపోయేవారు. ఇక బ్రతికుండగా కన్నబిడ్డలు తమ దగ్గరకు రారని ఆమె అనుకుందో.. లేక ఒంటరితనాన్ని భరించలేకపోయిందో తెలియదుగానీ.. కఠిన నిర్ణయం తీసుకుంది.
భర్త రామారావు పనిమీద బయటకు వెళ్లగానే.. బంగారం పెట్టుకొని, పట్టచీర కట్టుకొని, తమ ఆస్తి పత్రాలు, ప్రామిసరీ నోట్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లను చేతబట్టుకొని ఒంటిపై కిరోసిన్ పొసుకొని నిప్పంటించుంది. ఇంట్లో పొగ వస్తుండటంతో చుట్టుపక్కలవారు గమనించి ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో కాలుతూ కుమారి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది.
నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇల్లు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయిలే అని భావించిన పిల్లలకు అవేమీ వారి తల్లిని కాపాడలేకపోయాయి. ఈ వయసులో పిల్లల ఎదుగుదల చూసి మురిసిపోతూ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని భావించిన కుమారి.. అవేమీ సాధ్యంకాకపోవడంతో లోకాన్ని వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు, పనుల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు తల్లిదండ్రులకు సమయం కేటాయిస్తే ఈ వయసులో వారికి కొండంత ధైర్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.