Home /News /andhra-pradesh /

GUNTUR NRI ARRESTED FOR CHEATING WOMAN ON THE NAME OF MARRIAGE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

NRI Cheating: పెళ్లి పేరుతో మోసం.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. ఎన్నారై చీటర్ అరెస్ట్..

కర్నాటి సతీష్ (ఫైల్)

కర్నాటి సతీష్ (ఫైల్)

NRI Cheater: తమ కుమార్తె అమెరికాలో సంతోషంగా ఉంటుందని భావించి అడిగినంత కట్నకానుకలు చదివిస్తారు. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడటంతో లబోదిబోమంటారు. తాజాగా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేస్తున్న ఎన్నారై బాగోతం బట్టబయలైంది. కట్నం కోసం పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత ఉడాయించడం అలవాటుగా చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఎన్నారై సంబంధం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మంచి జీతం, సంపాదన, ఆస్తులుంటాయని బావించి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. తమ కుమార్తె అమెరికాలో సంతోషంగా ఉంటుందని భావించి అడిగినంత కట్నకానుకలు చదివిస్తారు. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడటంతో లబోదిబోమంటారు. తాజాగా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేస్తున్న ఎన్నారై బాగోతం బట్టబయలైంది. కట్నం కోసం పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత ఉడాయించడం అలవాటుగా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) క్రోసూరుకు చెందిన కర్నాటి సతీష్ బాబు 13ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికి దాదాపు ఐదుగుర్ని పెళ్లి చేసుకొని కట్నకానుకలు తీసుకొని ఉడాయించాడు. అంతేకాదు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేసేవాడు.

    కర్నాటి సతీష్ కు 13 ఏళ్ల క్రితం విశాఖపట్నంకు చెందిన మహిళతో పెళ్లైంది. ఆమెకు గ్రీన్ కార్డు ఉండటంతో అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వీరికి 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఐతే కొంతకాలం తర్వాత తన భార్య బంధువైన యువతితో పరిచయం పెంచుకొని 2014లో ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మొదటిభార్య హైదరాబాద్ లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆమెను కూడా వదిలేసి 2017లో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని అన్నవరంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలు ఆమెతో కాపురం చేసి అమెరికా వెళ్లిపోయాడు.

    ఇది చదవండి: ఒక్కడు 150 దొంగతనాలు చేశాడు.. చివరికి ఇలా చిక్కాడు.. ఆ డబ్బుతో ఏం చేసేవాడంటే..


    కొంతకాలం తర్వాత ఇండియాకు వచ్చిన సతీష్ పై లక్ష్మి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడి పాస్ పోర్ట్ సీజ్ చేశారు. ఐతే వారితో రాజీ కుదుర్చుకుని, పాస్‌పోర్టు తీసుకున్నాడు. అనంతరం గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతితో సంబంధం కుదుర్చుకుని భారీగా కట్నం తీసుకున్నాడు. 2019లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నెలపాటు ఇక్కడే ఆమెతో కాపురం చేశాడు. కొద్దిరోజులయ్యాక అమెరికా తీసుకెళ్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి నెలలు గడుస్తున్నా రాకపోగా.. ఫోన్‌ చేసినా స్పందన లేదు. అత్తమామలను అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే గతంలో కూడా ఇలాగే పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసినట్లు కేసులున్నాయని తెలిసింది.


    ఇది చదవండి: మరో ట్విస్ట్ ఇచ్చిన సాయి ప్రియాంక.. ప్రియుడితో పెళ్లి.. తండ్రికి మెసేజ్..


    గత ఏడాది విజయవాడకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. భారీగా కట్నం తీసుకొని ఉడాయించడం, ప్రశ్నిస్తే బెదిరించడం చేసేవాడు. అంతేకాదు ఏకాంతంగా గడిపిన సందర్భంలో వారి నగ్నవీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాడు. ఎన్నారై పెళ్లికొడుకు బాధితులంతా గుంటూరు ఐజీ త్రివిక్రమ వర్మను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్ ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. సతీష్ తో పాటు అతడి తండ్రి వీరభద్రరావును కూడా అరెస్ట్ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cheating, Guntur, NRI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు